హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యాలెట్ బాక్సుల్లో ఓట్ల గందరగోళం ... మౌలాలీ డివిజన్ లో కౌంటింగ్ నిలిపివేత, కొన్ని చోట్ల బీజేపీ అభ్యంతరం

|
Google Oneindia TeluguNews

జిహెచ్ఎంసి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల కౌంటింగ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కౌంటింగ్ ప్రారంభంలో బిజెపి దాదాపు 80 డివిజన్లలో ఆధిక్యాన్ని కనబరిచిన ట్లుగా కనిపించినా నిదానంగా ట్రెండ్ చేంజ్ అవుతోంది. మొదటి రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ పార్టీనే ముందువరుసలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలలో బిజెపి ముందంజలో ఉన్నప్పటికీ, బ్యాలెట్ బాక్స్ లో ఉన్న ఫలితాలు మాత్రం టిఆర్ఎస్ ని ముందువరుసలో నిలిపాయి.

Recommended Video

GHMC Election Results 2020 : బ్యాలెట్ బాక్సుల్లో పోలైన ఓట్లలో తేడా.. రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు!

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ... టీఆర్ఎస్ కు చెంప పెట్టు .. బండి సంజయ్ ధీమాతో పాటే అనుమానాలు కూడా ..గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ... టీఆర్ఎస్ కు చెంప పెట్టు .. బండి సంజయ్ ధీమాతో పాటే అనుమానాలు కూడా ..

పోలైన ఓట్లకు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లకు తేడా

పోలైన ఓట్లకు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లకు తేడా

ఇక బ్యాలెట్ బాక్సుల్లో కౌంటింగ్ విషయం లో గందరగోళ వాతావరణం నెలకొంది . కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్స్ లో పోలైన ఓట్ల కంటే అదనంగా ఓట్లు ఉండటం, కొన్నిచోట్ల పోలైన ఓట్ల కంటే తక్కువ సంఖ్యలో ఓట్లు ఉండటం గందరగోళానికి దారి తీస్తోంది. దీంతో ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు . జిహెచ్ఎంసి పరిధిలోని మౌలాలి డివిజన్ లో లెక్కింపు ప్రక్రియను బ్యాలెట్ బాక్స్ లో ఓట్లు గందరగోళంతో అధికారులు నిలిపివేశారు.

 మౌలాలీ డివిజన్ లో లెక్కింపు నిలిపివేత

మౌలాలీ డివిజన్ లో లెక్కింపు నిలిపివేత

మౌలాలి డివిజన్ లో ఒక బ్యాలెట్ బాక్స్ లో మొత్తం 361 ఓట్లు పోల్ కాగా, ఆ బాక్స్ లో 394 ఓట్లు ఉన్నాయి . మొత్తం 33 ఓట్లు అధికంగా ఆ బాక్స్ లో ఉండడంతో అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. కౌంటింగ్ సిబ్బంది ఇదే విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు . ఇక వివేకానంద డివిజన్ లోని ఓట్ల లెక్కింపు పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేశారు .

వివేకానంద నగర్ లోనూ , జాంబాగ్ లోనూ బాక్సుల్లో ఓట్లకు , పోలైన ఓట్లకు తేడా

వివేకానంద నగర్ లోనూ , జాంబాగ్ లోనూ బాక్సుల్లో ఓట్లకు , పోలైన ఓట్లకు తేడా

పోలైన ఓట్ల కంటే బాక్సులు అధికంగా ఓట్లు ఉన్నాయని ఏజెంట్ ఏకాంత్ గౌడ్ ఆరోపించారు. బ్యాలెట్ బాక్సుల సీల్స్ సక్రమంగా లేదంటూ ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఇక గోషామహల్ నియోజకవర్గం పరిధిలో జాంబాగ్ డివిజన్ లో కూడా ఓట్ల లెక్కింపు పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది బూత్ నెంబర్ 8 మొత్తం 471 ఓట్లు పూట బాక్స్లో మరో 257 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా ఓట్ల గల్లంతుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది . అయితే అక్కడ పోలింగ్ శాతాన్ని తప్పుగా వెల్లడించామని అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది.

English summary
There was an atmosphere of confusion in the matter of counting in the ballot boxes. The fact that there are more votes than the number of votes cast in the ballot box in some places and less than the number of votes cast in other places is leading to confusion. Leaders of opposition parties have strongly objected. Alleged rigging in this election. Authorities stopped the counting process in Moulali division under GHMC due to confusion over votes in the ballot box.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X