హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ... టీఆర్ఎస్ కు చెంప పెట్టు .. బండి సంజయ్ ధీమాతో పాటే అనుమానాలు కూడా ..

|
Google Oneindia TeluguNews

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాబోతున్నాయని బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నగర ఓటర్లు తమకే పట్టం కట్టబోతున్నారని, జిహెచ్ఎంసి పరిధిలో తమ ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరుగుతోందని వారంటున్నారు. ఐదేళ్ల క్రితం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పొత్తులతో ఎన్నికలకు వెళ్లినా బిజెపి నాలుగు డివిజన్ల కే పరిమితం కాగా, ఈసారి ఊహించని విధంగా బిజెపి దూసుకుపోతోంది.

ఓటర్లు రాక పోలింగ్ కేంద్రాలు ఖాళీ .. గ్రేటర్ పోలింగ్ తగ్గటానికి చలి , కరోనా కారణాలన్న ఎస్ఈసిఓటర్లు రాక పోలింగ్ కేంద్రాలు ఖాళీ .. గ్రేటర్ పోలింగ్ తగ్గటానికి చలి , కరోనా కారణాలన్న ఎస్ఈసి

పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యం .. జోష్ లో బీజేపీ

పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యం .. జోష్ లో బీజేపీ

ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ లో బిజెపి ఆధిక్యతను ప్రదర్శించింది. పోస్టల్ బ్యాలెట్ లో రెండో స్థానానికి టిఆర్ఎస్ పార్టీ చేరింది.ఈ ఫలితాలే రిపీట్ అవుతాయని అంటున్నారు బీజేపీ నేతలు .ఇదే సమయంలో విజయం పై ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ . ఈసారి అనూహ్య ఫలితాలను సాధించవచ్చు అన్న నమ్మకంతో ఉన్న బీజేపీ నేతలు ఓటు బ్యాంకు సమీకరించడంలో సక్సెస్ అయ్యామని భావిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 80 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతను కనబరుస్తుంది . టిఆర్ఎస్ పార్టీ కేవలం 30 స్థానాలకే పరిమితమైంది.

టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నిక ఫలితాలు చెంపపెట్టు అన్న బండి సంజయ్

టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నిక ఫలితాలు చెంపపెట్టు అన్న బండి సంజయ్

ఇక ఈ నేపథ్యంలో ఆది నుంచి టిఆర్ఎస్ పార్టీ తో హోరాహోరీగా పోరాటం చేసిన బీజేపీ నేతలు ఈ ఎన్నికలలో విజయం మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు వచ్చిన ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ పార్టీకి చెంప పెట్టువంటివని బండి సంజయ్ చెప్తున్నారు. ఎన్నికల ఆది నుండి కుట్రలు చేసినా ప్రజలు తమ పక్షానే నిలిచారని అంటున్నారు.ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తు ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు టిఆర్ఎస్ పార్టీకి చెంప పెట్టువంటివని రాష్ట్ర ప్రభుత్వానికి మరో మట్టికాయ పడిందని బండి సంజయ్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి అంటూ ఫైర్ అయ్యారు.

ఇది ఎన్నికల్లో తాము సాధించిన మొదటి నైతిక విజయం అన్న బండి సంజయ్

ఇది ఎన్నికల్లో తాము సాధించిన మొదటి నైతిక విజయం అన్న బండి సంజయ్

ఇది ఎన్నికల్లో తాము సాధించిన మొదటి నైతిక విజయం అంటూ బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఈసీ, రాష్ట్రప్రభుత్వం కలిసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చేసిన కుట్రను కోర్టు అడ్డుకుందని న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచిందని బండి సంజయ్ పేర్కొన్నారు . ప్రజా తీర్పును గౌరవించలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఎందుకు సాక్ష్యాలను బండి సంజయ్ పేర్కొన్నారు.

 ఎన్నికలపై అనేక అనుమానాలు .. రిగ్గింగ్ కు పాల్పడిందని ఆరోపణ

ఎన్నికలపై అనేక అనుమానాలు .. రిగ్గింగ్ కు పాల్పడిందని ఆరోపణ

ఇదే సమయంలో అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు . టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఎన్నికల అధికారులతో కలిసి పోలింగ్ రోజున రిగ్గింగ్ కు పాల్పడిందని ఆరోపిస్తున్నారు.సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య జరిగిన పోలింగ్ పర్సంటేజీ అంతగా పెరగడం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బిజెపి విజయం సాధించి తీరుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ కు ఈ ఎన్నికలు ఒక గుణపాఠం .. కాషాయ జెండా ఎగురుతుందన్న ధీమా

సీఎం కేసీఆర్ కు ఈ ఎన్నికలు ఒక గుణపాఠం .. కాషాయ జెండా ఎగురుతుందన్న ధీమా

ఇక రాష్ట్ర అధికార యంత్రాంగం ఎన్నికల అధికారులు కలిసి టిఆర్ఎస్ కు అనుకూలంగా పోలింగ్ శాతాన్ని మార్చారని అనుమానం వ్యక్తం చేస్తున్న బండి సంజయ్ ఎంపిక చేసిన డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి చేశాయని దీనికి బాధ్యులైన అధికారులను సర్వీసు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి , రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఈ విషయంలో గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాషాయ జెండా ఎగురుతుంది అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్. గ్రేటర్ లో గట్టి పోటీ ఇచ్చేలా టీఆర్ఎస్ కు చెమటలు పట్టేలా పెరిగిన బీజేపీ ఓటింగ్ బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ కు కారణం కాగా , ఎన్నికల కౌంటింగ్ లో చివరి వరకు ఎన్ని స్థానాలు వస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది.

Recommended Video

Suresh prabhu Complaint on Jagan | జగన్ సర్కారుకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులకు లేఖలు !!

English summary
Bandi Sanjay says the election results so far have been a slap in the face to the TRS party. Sanjay said the people had sided with him despite election conspiracies since the election. TRS party leaders are still they should be ashamed. Sanjay said that bjp will win in this elections , with the court directives bjp won the first ethical victory in elections .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X