• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బండి సంజయ్ మరో బండ్ల గణేష్ -బీజేపీ చీఫ్ సంచలన కామెంట్లపై కవిత ఫైర్ -బండ్ల అనూహ్య రియాక్షన్

|

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేష్ ఎన్నికల ప్రచారంలో చివరిరోజైన ఆదివారం రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, నేతల మాటల తూటాలు, సంచలన వ్యాఖ్యలతో హోరెత్తిపోయింది. 'పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్' చేస్తామని ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తాజాగా మరోసారి ఓల్డ్ సిటీని టార్గెట్ చేశారు. బండి తీరును తప్పు పడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా కౌంటరిచ్చారు.

ఎందుకు చంపుతాం? కేసీఆర్ 100ఏళ్లు బతకాలి: అమిత్ షా సంచలనం -కామెంట్లు చూస్తే షాకవుతారుఎందుకు చంపుతాం? కేసీఆర్ 100ఏళ్లు బతకాలి: అమిత్ షా సంచలనం -కామెంట్లు చూస్తే షాకవుతారు

డాక్టర్లతో భేటీలో..

డాక్టర్లతో భేటీలో..


బల్దియా ప్రచారంలో చివరిరోజైన ఆదివారం టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ బేగంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిటీకి చెందిన పలువురు వైద్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓల్డ్ సిటీపై ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో హిందువులు భయానక వాతావరణంలో జీవిస్తున్నారన్నారని, పాతబస్తీని భాగ్యనగరంగా మార్చాలని బీజేపీ కోరుకుంటోందని, భాగ్యనగరానికి బీజేపీయే రక్షణ కవచంగా ఉంటుందని సంజయ్ అన్నారు. గ్రేటర్ లో బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్ ను మహానగరంగా మార్చుతామన్నారు.

హిందువులపై కుట్ర..

హిందువులపై కుట్ర..

పాతబస్తీలో హిందూ జనాభాను తగ్గించే కుట్ర జరుగుతోందని సంజయ్ ఆరోపించారు. ‘‘శాలిబండ అలియాబాద్ ఉప్పుగూడ లాల్ దర్వాజ గౌలిపుర చాతార్నాకా వంటి ప్రాంతాల్లో నివసించిన హిందువులు ఇప్పుడు ఎక్కడికి పోయారు? వాళ్ళ ఆస్తులను ఎవరు ధ్వంసం చేశారు? హైదరాబాద్ పోలీసులకు హీరోలనే పేరుంది. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే గనుక 24 గంటల్లోపే హీరో పోలీసులకు 15 నిమిషాలపాటు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తాం. తద్వారా ఓల్డ్ సిటీలో దాక్కున్న రోహింగ్యా, పాకిస్తానీ, బంగ్లాదేశీ ముస్లింలను తరిమేస్తాం. పాతబస్తీలో ఏడాదికి రూ.600 కోట్లు విద్యుత్‌ బిల్లులు చెల్లించడం లేదు. ఆస్తి పన్ను కూడా కట్టట్లేదు. పన్నులన్నీ హిందువులు కడితే పాతబస్తీలో జల్సా చేస్తారా?'' అని సంజయ్ అన్నారు. కాగా,

సీఎం జగన్ భారీ స్ట్రోక్:ఏకంగా టాప్1 -ఆర్థికాభివృద్ధిలో ఏపీ దూకుడు -తెలంగాణ డౌన్ -SOS study 2020సీఎం జగన్ భారీ స్ట్రోక్:ఏకంగా టాప్1 -ఆర్థికాభివృద్ధిలో ఏపీ దూకుడు -తెలంగాణ డౌన్ -SOS study 2020

అప్పుడు బండ్ల.. ఇప్పుడు బండి..

అప్పుడు బండ్ల.. ఇప్పుడు బండి..

పాతబస్తీలో మత విభేదాలు, హైదరాబాద్ పేరు మార్పు అంశాలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. బండిని నటుడు బండ్ల గణేష్ తో పోల్చారు. ‘‘హైదరాబాద్ పేరు మారిస్తే ఏం లాభం? పేరు కాదు.. బీజేపీ తన విధానాలు మార్చుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల గణేష్ మాదిరిగానే ప్రస్తుత ఎన్నికల్లో బండి సంజయ్ కూడా కామెడీ షో చేస్తున్నారు. జీహెచ్ఎంసీల్లో టీఆర్ఎస్ మరోసారి ఘనవిజయం సాధిస్తుంది'' అని కవిత అన్నారు. కాగా,

కవితకు బండ్ల గణేష్ కౌంటర్..

కవితకు బండ్ల గణేష్ కౌంటర్..


ఎన్నికల్లో కామెడీ వేశాలంటూ బండి సంజయ్ తో కవిత పోలిక పెట్టడంపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాను జోకర్ ను కాదని కేసీఆర్ తనయకు చురక వేశారు. ‘‘కవితగారూ.. నేను జోకర్ ను కాదు.. ఫైటర్ ని. అయితే ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాను. ఆల్ ది బెస్ట్''అని గణేష్ ట్వీట్ చేశారు.

  Pawan Kalyan's Jana Sena Flags More Than BJP Flags At Amit shah Road Show పవన్ కల్యాణ్ కటౌట్లు...!!
  సంజయ్ మతిస్థిమితం కోల్పోయారా?

  సంజయ్ మతిస్థిమితం కోల్పోయారా?


  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. కులం, మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో అల్లర్లకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు అమిత్‌షా ఎక్కడున్నారు? ఏ మొహం పెట్టుకొని షా సిటీకి వచ్చారని పొన్నం ప్రశ్నించారు.

  English summary
  Telangana state BJP president Bandi Sanjay once again made sensational remarks on Hyderabad Old City. Sanjay said that Hindus were living in a horrible environment in the Old City and that Hyderabad would be renamed Bhagyanagar. TRS MLC Kalvakuntla kavitha slams BJP chief's remarks. Kavitha counters that Bandi Sanjay is now talking like actor Bandla Ganesh in the past.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X