హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌వి దగాకోరు మాటలు... నిధులన్నీ కేంద్రం ఇచ్చినవే.. భాగ్యలక్ష్మి ఆలయ వేదికగా బండి సంజయ్..

|
Google Oneindia TeluguNews

వరద సాయాన్ని నిలిపివేయాలని తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈసీకి లేఖ రాయడం బాధనిపించిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. గతంలో అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి,ఎన్నికల కమిషన్‌కు తాను లేఖలు రాశాని... ఆ సంతకాలతో సరిపోల్చుకోవాలని అధికారులకు సూచించారు. కేవలం ఎన్నికల జిమ్మిక్కు కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వరద సాయం లేఖను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఆ లేఖ తాను రాయలేదని మరోసారి వివరణ ఇచ్చుకున్న సంజయ్... గ్రేటర్‌లో బీజేపీని గెలిపిస్తే వరద సాయం కింద ప్రతీ ఇంటికి రూ.25వేలు అందజేస్తామన్నారు. ఏ ఇంటికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి.. ఆ మొత్తాన్ని చెల్లిస్తామన్నారు.

దగాకోరు మాటలు..

దగాకోరు మాటలు..

లేఖ తాను రాయలేదని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చానన్నారు సంజయ్. కానీ ఇక్కడికి వస్తే ఎన్నికల్లో ఎక్కడ ముస్లింల ఓట్లు కోల్పోతామో అన్న భయంతో కేసీఆర్ రాలేదన్నారు. ముఖ్యమంత్రి చెప్పేవన్నీ దగాకోరు మాటలని విమర్శించారు. ప్రజలు ఎక్కడ తిరగబడుతారోనన్న భయంతోనే ఎన్నికలకు ముందు వరద సాయం పంపిణీ చేశారని విమర్శించారు. సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయని...అభివృద్ది,సేవ,సెంటిమెంటు ముసుగుల్లో వస్తే నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరని అన్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులే...

కేంద్రం ఇచ్చిన నిధులే...

టీఆర్ఎస్ పాలనలో విశ్వనగరం హైదరాబాద్ కాస్త విషాదనగరంగా మారిందన్నారు. నాలాలు,చెరువుల ఆక్రమణతో నగరం మునిగిపోయిందన్నారు. హైదరాబాద్ అభివృద్దికి ఖర్చు చేశామని చెప్తున్న నిధులన్నీ కేంద్రం నుంచి వచ్చినవేనని.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని అన్నారు. ఎన్నికల వేళ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,ఎల్‌ఆర్ఎస్ గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను డల్లాస్,ఇస్తాంబుల్‌లా తీర్చిదిద్దుతానని చెప్పి ఇప్పటిదాకా ఏమీ చేయలేదన్నారు.

Recommended Video

GHMC Elections: Hyderabad అభివృధి Chandrababu Naidu కృషి ఫలితం

గ్రేటర్‌లో బీజేపీని గెలిపించాలని...

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తాయి... పోతాయి... అంతేగానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయవద్దని బండి సంజయ్ పేర్కొన్నారు. మతం పేరుతో,ఒక వర్గం ఓట్లతో కేసీఆర్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కేంద్రంలో ఉన్నది పేదల ప్రభుత్వమని... అభివృద్ది చేసే సత్తా,సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి నరేంద్ర మోదీ నాయకుడిగా ఉన్నాడని అన్నారు. కాబట్టి గ్రేటర్‌ ప్రజలు బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

English summary
Telangana BJP chief Bandi Sanjay visited Bhagyalaxmi temple near charminar in Hyderabad,today at 12pm as he challenged CM KCR to discuss about the letter allegedly written by him to stop flood relief fund in GHMC region before elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X