హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'బ్లేడ్' గణేష్‌ ఆరు నెలల్లో నేల మీదకు వచ్చాడు ! రాజకీయాల్లో తాను చేసిన తప్పేంటో క్లియర్‌గా చెప్పాడు

|
Google Oneindia TeluguNews

ఆయన కమెడియన్‌గా అందరికి సుపరిచితుడు. ఆ తర్వాత బడా నిర్మాతగా ఎదిగాడు. ఆపై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడేమో అవే రాజకీయాలంటే అసహ్యమేస్తోందంటున్నాడు. అందుకే రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నట్లు తెలిపాడు. ఈ పాటికే ఆయనెవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఎస్ హిఈజ్ నన్ అదర్ దెన్ బండ్ల గణేష్. నటుడిగా, సినీ నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు.. ఇప్పుడు రాజకీయాలెందుకు తనకవసరం లేదని ఎందుకు చెబుతున్నారు..?

నాడు పెద్ద పెద్ద సవాల్‌లు విసిరిన బండ్ల గణేష్

నాడు పెద్ద పెద్ద సవాల్‌లు విసిరిన బండ్ల గణేష్

బండ్ల గణేష్...పరిచయం అక్కర్లేని పేరు. ఇటు సినీ ఇండస్ట్రీలో అటు రాజకీయాల్లో తన పేరు ప్రతినోట నానింది. ఇక గతేడాది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే బండ్ల గణేష్ ఇంటర్వ్యూ కోసం టీవీ ఛానెళ్లు వెంటపడ్డాయి. అంత క్రేజ్ సాధించారు. ఒక విధంగా చెప్పాలంటే సినిమా హీరోలకంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు బండ్ల గణేష్. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరి నాడు పెద్ద పెద్ద ఛాలెంజ్‌లే చేశారు. ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడుతో గొంతుకోసుకుంటా అని కూడా బండ్ల గణేష్ చెప్పారు. ఫలితాల తర్వాత కాంగ్రెస్ ఘోర ఓటమిపాలయ్యాక బండ్ల గణేష్ మాట మార్చారు. ఫ్లోలో చాలా చెబుతాం... చెప్పినవన్నీ జరుగుతాయా ఏంటి అంటూ రివర్స్ అటాక్‌కు దిగారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి ఒక దళితుడిని చేస్తామని మాటతప్పిన కేసీఆర్ విషయం కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన్నెందుకు ప్రశ్నించరు అని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్ చేస్తే మరో టీవీ ఛానెల్లో ప్రత్యక్షమయ్యారు బండ్ల గణేష్.

రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసిన బండ్ల గణేష్

రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసిన బండ్ల గణేష్

ఇక బండ్ల గణేష్ రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ రాజకీయాలు చేయడం తనవల్ల కాదని చెప్పిన బండ్ల తొందరపడి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇదే విషయమై ఎన్నోసార్లు మదనపడ్డట్లు బండ్ల చెప్పుకొచ్చారు. తనకు ఆప్తులందరూ ప్రతి పార్టీలోనూ ఉన్నారని ... కేవలం ఒక రాజకీయ పార్టీలో చేరడం వల్ల వారంతా తనకు దూరం అవుతుంటే బాధనిపించిందని చెప్పారు. రాజకీయాల్లో అనవసరపు అబద్దాలు చెప్పాల్సి వస్తోందని, లేని నటనను ప్రదర్శించాల్సి వస్తోందని అదే సినిమాలో నటిస్తే బాగుంటుందనిపించిందని బండ్ల గణేష్ మరోకారణం చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి సేవచేయడం అనేది ఉండదని చివరకు తనసేవ తానే చేసుకోలేకపోతున్నట్లు బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. ఒక పార్టీలో ఉన్న వ్యక్తి కూడా ఎవరో తనకు తెలియనప్పుడు అతనితో శతృత్వం పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పారు బండ్ల గణేష్. రాజకీయాల్లోకి వచ్చాక తన ఆప్తులకు దూరం అవుతున్నట్లు చెప్పారు.

కేసీఆర్ కేటీఆర్‌లది మంచి సంస్కారం

కేసీఆర్ కేటీఆర్‌లది మంచి సంస్కారం

తన తండ్రి రాజకీయాలు వద్దని ఎంత చెప్పిన ఆయన్ను కాదని రాజకీయాల్లోకి వచ్చి పెద్ద తప్పుచేసినట్లు చెప్పారు. తను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హోదాలో కేసీఆర్‌పై కేటీఆర్‌పై ఎన్నో మాట్లాడానని కానీ వారు తనను ఒక్క మాట కూడా అనలేదని బండ్ల గణేష్ చెప్పారు. పైగా కేటీఆర్ కుమారుడు తన కొడుకును వారింటికి తీసుకెళ్లారని బండ్ల గణేష్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారు, ఓడిపోయినవారు టీఆర్ఎస్‌లో చేరారని తను అనుకుంటే టీఆర్ఎస్‌లో చేరొచ్చని అయితే ...రాజకీయాలు వద్దనుకున్నాను కాబట్టే ఏ పార్టీవైపు చూడట్లేదని స్పష్టం చేశారు. తన ప్రాణ మిత్రుడు చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకాలేక పోయినందుకు ఆయన తరుపున ప్రచారం చేయలేకపోయినందుకు తాను చాలా బాధపడ్డట్లు వెల్లడించారు బండ్ల గణేష్.

పవన్ కళ్యాణ్‌ను ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది

పవన్ కళ్యాణ్‌ను ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది

బండ్ల గణేష్‌ ఎప్పటికీ మారడని.. బండ్ల అంటేనే ఒక బ్రాండ్ అని చెప్పారు గణేష్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేసి బయటకు వెళ్లారని అందుకే వారు రాజకీయ నాయకులు అయ్యారని చెప్పిన బండ్ల తాను రాజకీయాలకు పనికి రానని తెలుసుకున్నాను కాబట్టే వారిలా మరో పార్టీ వైపు చూడటం లేదని స్పష్టం చేశారు. అయితే రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ను చూడాలనే కోరిక ఇప్పటికీ ఉందని చెప్పారు. ఏపీ రాజకీయాలపై స్పందించమని అడుగగా... తను ఉన్న తెలంగాణలోనే ఏమి చెప్పలేక ఉన్నానని ఇక పక్కరాష్ట్రం గురించి ఏమి చెబుతానని అన్నారు. తనే కనుక సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగే కెపాసిటీ ఉంటే ఆరునెలల్లోనే రాజకీయాలకు ఎందుకు గుడ్‌బై చెబుతానని ప్రశ్నించారు.

చిరంజీవి తిరిగి సినిమాలు తీయడాన్ని స్వాగతిస్తున్నాను

చిరంజీవి తిరిగి సినిమాలు తీయడాన్ని స్వాగతిస్తున్నాను


రాజకీయాలు సినిమాలు వేరని చెప్పారు బండ్ల గణేష్. ఖద్దర్ బట్టలు వేసుకున్న ప్రతి వాడు రాజకీయనాయకుడని వారు బ్రెయిన్‌తో పనిచేస్తారని.. ఇక సినిమా ఇండస్ట్రీ గోమాత లాంటిదని చెప్పారు. ఇక్కడ బాడీతోనే పనిచేస్తారని వ్యాఖ్యానించారు. తను త్వరలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న చిత్రంలో నటించే అవకాశం ఉందని చెప్పిన బండ్ల గణేష్... తిరిగి అదే గూటికి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌ను మరో స్థానంలో చూడాలనుకుంటున్నట్లు చెప్పిన బండ్ల గణేష్... ఆయనతో సినిమా తీయకూడదనే కోరుకుంటున్నట్లు చెప్పారు. నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి తిరిగి సినిమాలు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

మొత్తానికి ఆరునెలల పాటు రాజకీయాల్లో ఉన్న బండ్ల గణేష్ ఆ రొంపి నుంచి బయటకు వచ్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇప్పుడు తన దృష్టి అంతా తన వ్యాపారంపైనే అని..మంచి వేషాలు వస్తే సినిమాలో నటిస్తానని చెప్పారు. ఇక జీవితంలో రాజకీయాల వైపు పొరపాటున కూడా తొంగి చూడనని శపథం చేశారు.

English summary
The actor turned politician Bandla Ganesh said that he is quitting politics permanently. After facing a tough time Bandla Ganesh reitarated that he was fed up with the politics. He mentioned that he missed all his soulmates just because of politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X