హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కల్యాణ్ సీఎం కావలని కోరుకుంటున్న కాంగ్రెస్ నేత ! ఎందుకో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బండ్ల గణేశ్ మరో బాంబ్ పేల్చారు. ఏపీలో పవన్ సీఎం కావాలంటూ మనసులో మాట బయటపెట్టారు.
నిజాయితీకి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు.. అంటూ 'పీకే' ని మహా బాగా పొగిడేశారు. అంతా బాగానేఉంది కానీ.. కాంగ్రెస్ గూటిలో ఉంటూ ఈ పొగడ్తల వర్షమేంటనేది ప్రస్తుతం హాట్ టాపిక్.

నా బాస్, నా దేవుడంటూ పవన్ కల్యాణ్ ను మొదటినుంచి పిచ్చిపిచ్చిగా ఆరాధిస్తున్నారు బండ్ల గణేశ్. అయితే జనసేన తీర్థం పుచ్చుకోకుండా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ గూటికి చేరి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. రిజల్ట్స్ వచ్చాక మాత్రం కనుమరుగయ్యారు. తాజాగా పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలనేది తన ప్రగాఢమైన కోరిక అంటూ ట్వీట్ చేయడం చర్చానీయాంశమైంది.

<strong>అంబానీలను మించాడు.. పిట్టల దొర కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి..! లక్షల కోట్ల ఆస్తులు, అప్పులు</strong>అంబానీలను మించాడు.. పిట్టల దొర కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి..! లక్షల కోట్ల ఆస్తులు, అప్పులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హడావిడి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హడావిడి

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ లెవెల్లో మెరిసిపోయారు బండ్ల గణేశ్. కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందంటూ ఇంటర్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే.. బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని శపథం చేశాడు. ఎలక్షన్లు అయిపోయాయి, ఫలితాలు వచ్చాయి.. టీఆర్ఎస్ రెండోసారి అధికారపీఠం ఎక్కింది. కానీ బండ్ల గణేశ్ జాడ మాత్రం కనిపించలేదు. ఎన్నికల వేళ అంత హడావిడి చేసిన కమెడియన్ కమ్ పొలిటిషయన్.. తీరా ఫలితాలొచ్చాక కనిపించకపోయేసరికి కొన్ని మీడియా సంస్థలు బండ్లను టార్గెట్ చేశాయి. అయినా సరే ఆయన మాత్రం బయటకు రాలేదు.

ఇప్పుడు ఏపీ ఎన్నికల వేళ.. PK జపం

అలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బండ్ల గణేశ్ ఉనికి తక్కువైపోయింది. ఎక్కడ కనిపించడం లేదు.. ఏ టీవీల్లో రావడం లేదు. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. అందరూ ఏమై పోయాడబ్బా అనుకుంటున్న తరుణంలో మళ్లీ మెరుపుతీగలా ట్విట్టర్ వేదికగా ఎంట్రీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న వేళ హాట్ కామెంట్స్ చేశారు.

అటు కాంగ్రెస్ పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్న బండ్ల.. ఏపీ ఎన్నికల్లో గెలిచి పవన్ కల్యాణ్ సీఎం కావాలంటూ ఆకాంక్షించారు. నా దైవం, నా బాస్ పవన్ కల్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలనేది నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి అంటూ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ లీడరా?.. జనసేన క్యాడరా?

కాంగ్రెస్ లీడరా?.. జనసేన క్యాడరా?

కాంగ్రెస్ పార్టీ వీరాభిమానినంటూ తెగ సందడి చేశారు బండ్ల గణేశ్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని పలు సందర్భాల్లో మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు.. ఇస్తే చేస్తా, లేదంటే సైనికుడిలా పార్టీకోసం అంకితమవుతా అంటూ గంభీరంగా సమాధానామిచ్చారు. మరి అలాంటి బండ నిర్ణయం తీసుకున్న బండ్లకు.. కాంగ్రెస్ మీద అభిమానం తగ్గిందా అనే కామెంట్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న బండ్ల గణేశుడు.. పవన్ కల్యాణ్ సీఎం కావాలంటూ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

అమ్మా గణేశా..!

అమ్మా గణేశా..!

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బండ్ల గణేశ్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జనసేనానికి మద్దతు పలకడమేంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏదో ఒక చోటు నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేస్తారనే టాక్ నడిచింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ చివరకు హ్యాండిచ్చింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

మొత్తానికి హస్తం గూటిలో ఉంటూ చేయిలో గ్లాస్ పట్టుకోవాలని చూస్తున్న బండ్ల యవ్వారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ అడిగినా.. తప్పించుకోవడంలో దిట్ట ఈ గణేశుడు. సినిమాల్లో ఉండి ఉండి డైలాగులు, పంచులు నేర్చుకున్నోడు.. నా దైవానికి పూజ చేస్తే తప్పేంటని అంటాడేమో.

English summary
Bandla Ganesh has burst another bomb. He would like to see janasena president pawan kalyan as ap chief minister, mentioned in twitter platform. As he was in congress party, his sentences got hot topic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X