• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

డాక్టర్ కాదు కామాంధుడు.. ఒంటరి మహిళలే టార్గెట్.. సెల్లునిండా ఆడోళ్ల ఫోటోలే (వీడియో)

|

హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెరమీదకు తెచ్చిన బస్తీ దవాఖానాలు కొందరి కారణంగా అభాసుపాలవుతున్నాయి. వైద్యం మాట అటుంచితే.. ఓ డాక్టర్ చేసిన ఘనకార్యం వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చేలా తయారైంది పరిస్థితి. అందరికీ అందుబాటులో వైద్యం అనే స్ఫూర్తితో ప్రారంభించిన బస్తీ దవాఖానా అపకీర్తిని మూటగట్టుకోవడం చర్చానీయాంశమైంది. సాక్షాత్తు రాష్ట్ర రాజధానిలోని ఓ బస్తీ దవాఖాన డాక్టర్ చేసిన నిర్వాకం హాట్ టాపికయింది.

నువ్వా, నేనా కాదు.. మనలో గెలిచేది ఎవరు?.. రంగారెడ్డి పరిషత్ పోరులో పెరిగిన అభ్యర్థులు

వివాహిత పట్ల అసభ్య ప్రవర్తన..!

వివాహిత పట్ల అసభ్య ప్రవర్తన..!

ఉప్పల్ ప్రాంతంలోని చిలుకా నగర్ బస్తీ దవాఖానాలో జరిగిన ఘటన వైద్య వృత్తికి కళంకంలా మారింది. అక్కడి వైద్యుడు బాలరాజు.. ఓ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.

రంగారెడ్డి జిల్లా మేడిపల్లికి చెందిన డాక్టర్ బాలరాజు (28సం.).. చిలుకా నగర్ బస్తీ దవాఖానలో కాంట్రాక్ట్ బేస్ కింద సేవలందిస్తున్నారు. తలనొప్పితో బాధపడుతూ వైద్యం కోసం వచ్చిన తన పట్ల డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించారని ఓ వివాహిత (40సం.) ఆరోపించారు. అయింట్ మెంట్ రాస్తున్నాననే నెపంతో తల, మెడపై మసాజ్ చేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారని బాధితురాలు వాపోయారు.

రోగమొక్కటి.. వైద్యమొక్కటి..!

అంతేకాదు రోగమొక్కటి, వైద్యమొక్కటి అనే తీరుగా తన తల వెంట్రుకలు కత్తిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తలనొప్పి తగ్గకుంటే మరో రెండు రోజుల తర్వాత రమ్మని డాక్టర్ చెప్పినట్లు బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆయన ప్రవర్తన గురించి కూడా తెలపడంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

వైద్యుడికి దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత

వైద్యుడికి దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత

డాక్టర్ బాలరాజు నిర్వాకం వెలుగుచూడటంతో.. సదరు బాధితురాలి కుటుంబ సభ్యులు అతడికి దేహశుద్ధి చేసినట్లు సమాచారం. అంతేకాదు వాళ్లే ఉప్పల్ ఠాణాకు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారట. దాంతో డాక్టర్ బాలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను అలా చేయలేదని, కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని సదరు డాక్టర్ వాదించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

డాక్టర్ బాలరాజు లీలలు అన్నీ ఇన్నీ కావనే వాదనలు వినిపిస్తున్నాయి. అతడి మొబైల్ ఫోన్ నిండా అమ్మాయిల ఫోటోలు ఉండటం గమనార్హం. ఇదే అతడు చేసిన మొదటి తప్పా.. లేదంటే ఇంతకుముందు ఇలాంటి పనులు చేశాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad Uppal Chilluka Nagar basti dawakhana doctor balaraju facing misbehaviour allegations. One married woman came to hospital with headache. The Woman complaint to police that Doctor try to massage her on head and shoulders. Uppal Police filed a case against doctor balaraju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more