• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బస్తీ దవాఖానాల పెంపు, ఫ్రీగా మందులు, పరీక్షలు కూడా.. డైట్ చార్జీల పెంపు: హరీశ్ రావు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ బడ్జెట్ సబ్బండ వర్గాలను ఉద్దేశించి కేటాయింపులు చేశారు. వచ్చే ఏడాది ఎన్నికల సమయం అయినందున.. ఇదీ పూర్తి స్థాయి బడ్జెట్. అయితే అన్నీ వర్గాలను కలుపుకొని కేటాయింపులు ఉన్నాయి. ఏ ఒక్క రంగాన్ని విస్మరించలేదు. కాస్త తక్కువ ప్రతిపాదన చేయొచ్చు కానీ.. అందరినీ శాటిస్‌ఫై చేయడం కోసమే రూపొందించారు. వైద్యారోగ్యానికి ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రాధాన్యం ఇచ్చారు. ఆరోగ్యమే మహాబలం అని.. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏమైనా చేయొచ్చు అని పెద్దలు చెబుతుండేవారు.

57 రకాల పరీక్షలు ఫ్రీ..

57 రకాల పరీక్షలు ఫ్రీ..


హైదరాబాద్‌లో 350 కొత్త బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇదివరకు నగరంలోని బస్తీల్లో వైద్య సౌకర్యాలేవీ అందుబాటులో ఉండేవని కావని గుర్తుచేశారు. పేదలు విధి లేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుప్రతులను ఆశ్రయించాల్సి వచ్చేదని తెలిపారు. ప్రస్తుతం నగరంలో 256 బస్తీదవాఖానాలు సేవలు అందిస్తున్నాయని, వీటిలో వైద్యసేవలతోపాటు 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారని వివరించారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. తమ వద్దకే ఆసుపత్రులు రావడంతో బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, చీటికి మాటికి ప్రైవేటు ఆసుపత్రులకు వెళాల్సిన బెడద తప్పిందని సంతోషపడుతున్నారని చెప్పారు. హెచ్‌ఎండీ పరిధిలో మరో 94 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో..

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో..

బస్తీ దవాఖానాలకు వస్తున్న స్పందనను పరిగణలోకి తీసుకున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీ దవాఖానాలకు కొత్తగా ప్రారంభించామని తెలిపారు. బస్తీ దవాఖానాలు అందిస్తున్న సేవలను గుర్తించిన 15వ ఆర్థిక సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించిందని తెలిపారు. ఇలాంటి దవాఖానలు ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని సూచించింది వివరంచారు. ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని కీర్తించిందని తెలిపారు. వైద్యసేవలపై ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు. వైద్యసేవల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తలసరి ఖర్చు రూ.1698 అని తెలిపారు. ఆరోగ్యరంగంలో అత్యధికంగా తలసరి ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు.

 సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్

సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్


రాష్ట్రంలో గల దవాఖానాలన్నింటిలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తుందని, వైద్య పరీక్షల పరికరాలు, మందుల తదితర సౌకరాలన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 'తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాలు' ఏర్పాటు చేశామని, 57కు పైగా పరీక్షలను ఉచితంగా చేస్తున్నాయన్నారు. కిడ్నీ రోగులకు వైద్యం కోసం రాష్ట్రంలో 42 ఉచితడయాలసిస్‌ కేంద్రాలను, వాటిలో 313 డయాలసిస్‌ మిషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మరిన్ని డయాలసిస్‌ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయా కేంద్రాలకు వచ్చి పోవడానికి రోగులకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. 14 ఆసుపత్రుల్లో 14 చోట్ల సిటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌లో 'క్యాథ్‌లాబ్' సేవలు అందుబాటులోకి వచ్చాయని.. ఆయా ల్యాబ్‌లలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు.

 డైట్ చార్జీల పెంపు

డైట్ చార్జీల పెంపు


ప్రభుత్వ హాస్పిటళ్లలో చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందించాలని, ఇందు కోసం డైట్‌ చార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. టీబీ, క్యాన్సర్‌ తదితర రోగులకు బలవర్థకమైన ఆహారం అందించడం కోసం బెడ్‌ ఒక్కంటికి ఇచ్చే డైట్‌ చార్జీలను రూ.56 నుంచి రూ.112 పెంచాలని, సాధారణ రోగులకు ఇచ్చే చార్జిని రూ.40 నుంచి రూ.80కి పెంచాలని ప్రభుత్వం డిసిషన్ తీసుకుందని పేర్కొన్నారు. ఏటా రూ.43.5కోట్లు ఖర్చు చేయనుందని సభకు వివరించారు. హైదరాబాద్‌లో 18 మేజర్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగితో ఉండే సహాయకులకు సైతం సబ్సిడీపై భోజన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయిందని చెప్పారు. రెండు పూటలా భోజనం అందుతుందుందని, ప్రతి రోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నామని, ఇందుకు ఏడాదికి రూ.38.66 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి వివరించారు.

English summary
Basti Hospital increased in the telangana state. 57 tests are free in hospitals finance minister harish rao said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X