• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేటీఆర్ , హరీష్‌ల సరదా సంభాషణ .. బావా ..మళ్ళీ కుదరదేమో మన పాత ఛాంబర్లు చూసుకుందాం రా

|
  బావా మన పాతఛాంబర్లు చూద్దాం రా...! | Interesting Conversation Between KTR And Harish Rao || Oneindia

  టీఆర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు సెక్రటేరియట్ , అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్,శ్రీనివాస్ గౌడ్,ఎర్రబెల్లి దయాకర్ రావు,ప్రశాంత్ రెడ్డి లతో పాటు కేటీఆర్, హరీష్ రావు తదితర నేతలు పాల్గొన్నారు. ఇక అక్కడ ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది .

  పీఎస్‌, పీఏ, ఓఎస్డీలుగా కొత్తవారే.. టీడీపీ మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళు వద్దన్న సీఎం జగన్

   భూమి పూజ వేళ కేటీఆర్ , హరీష్ రావుల మధ్య ఆసక్తికర సంభాషణ

  భూమి పూజ వేళ కేటీఆర్ , హరీష్ రావుల మధ్య ఆసక్తికర సంభాషణ

  తెలంగాణ సచివాలయం, అసెంబ్లీలకు భూమి పూజ జరిగిన కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కలిసి సరదాగా మాట్లాడుకోవటం అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. 'బావా.. మళ్లీ కుదరదేమో... మన పాత చాంబర్లను ఒకసారి చూసుకుందామా?' అని హరీష్ రావుతో కేటీఆర్ అన్నారు. ఇక కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు హరీష్ చిరునవ్వులు చిందించారు . ఆ తరువాత కార్యకర్తలతో కలిసి ఇద్దరూ సరదాగా సెల్ఫీలు దిగి వెళ్లిపోయారు. ఇక మరోవైపు, వీరిద్దరినీ మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

  ఉగాదిలోపు సచివాలయం, అసెంబ్లీల నిర్మాణం పూర్తి చెయ్యాలన్న సీఎం

  ఉగాదిలోపు సచివాలయం, అసెంబ్లీల నిర్మాణం పూర్తి చెయ్యాలన్న సీఎం

  ఇక సచివాలయ, అసెంబ్లీ కొత్త భవనాల శంకుస్థాపనను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసిన అధికార పార్టీ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు,ఎంపీలు,జడ్పీ ఛైర్మన్లను ఆహ్వానించారు. వారందరికీ ప్రగతి భవన్‌లో లంచ్ ఏర్పాట్లు కూడా చేశారు. తొలుత సెక్రటేరియట్‌కు శంకుస్థాపన చేసిన కేసీఆర్ , మధ్యాహ్నాం 12 గంటలకు అసెంబ్లీ శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.100కోట్ల వ్యయంతో సచివాలయాన్ని నిర్మిస్తున్నారు.మొత్తం 16 ఎకరాల స్థలంలో అసెంబ్లీ భవనాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఉగాది లోపు కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ నిర్మాణాలు పూర్తి చెయ్యాలన్న లక్ష్యంతో పనులు కొనసాగనున్నాయి.

  సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల భూమి పూజలో స్పెషల్ అట్రాక్షన్ గా సరదాగా గడిపిన బావా , బావ మరిది

  సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల భూమి పూజలో స్పెషల్ అట్రాక్షన్ గా సరదాగా గడిపిన బావా , బావ మరిది

  ఇక మరోపక్క ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. ఉన్న భవనాలను కూల్చివేసి కొత్త భవనాలను కట్టాల్సిన అవసరం లేదని , కేసీఆర్ తన నమ్మకాల కోసం ప్రజా దానం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో స్కూళ్ళు, కాలేజీలు శిధిలావస్థకు చేరిన వాటిని నిర్మించాలని డిమాండ్ చేశారు. అయినా సరే కేసీఆర్ తాను అనుకున్నట్టు సెక్రటేరియట్ , అసెంబ్లీ భవనాల శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు . ఇక ఈ కార్యక్రమంలో సరదాగా కనిపించిన కేటీఆర్ , హరీష్ స్పెషల్ అట్రాక్షన్ గా మారారు.

  English summary
  TRS working president KTR and former minister Harish Rao had a fun conversation in the Telangana Secretariat and the assembly foundation ceremony . The two had been engaged for a while. An interesting conversation ensued between the two. 'Bava .. Can't see again ... Can we take a look of our old chambers?' KTR said and Harish smiled at these comments made by KTR.They have fun with the activists by clicking selfie . On the other hand, the news that CM KCR is planning to bring them both back to the cabinet.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more