హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనాపై మరో హైదరాబాదీ వెపన్: వ్యాక్సిన్ ప్రొడక్షన్‌పై: అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి కోసం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి హైదరాబాద్‌కే చెందిన మరో టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న బయోలాజికల్-ఇ (బీఈ) కోవిడ్ వ్యాక్సిన్ తయారీ, దాని ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి ముందుకొచ్చింది. దీనికోసం జాన్సన్ అండ్ జాన్సన్, బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో కలిపి కోవిడ్ వ్యాక్సిన్‌పై పరిశోధనలను నిర్వహించనుంది. ఈ విషయాన్ని బీఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల తెలిపారు.

కరోనా కేసుల్లో సరికొత్త వెల్లువ: 67 వేలు: 47 వేలు దాటిన మరణాలు: యాక్టివ్ కేసుల్లో ఏపీ స్థానం ఇదీకరోనా కేసుల్లో సరికొత్త వెల్లువ: 67 వేలు: 47 వేలు దాటిన మరణాలు: యాక్టివ్ కేసుల్లో ఏపీ స్థానం ఇదీ

జాన్సన్ అండ్ జాన్సన్‌తో కలిసి..

జాన్సన్ అండ్ జాన్సన్‌తో కలిసి..

జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన ఫార్మా విభాగం కంపెనీ జెన్సెన్ ఫార్మాసూటికా ఎన్వీ ఇదివరకే కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది. ఏడీ26.సీఓవీ2.ఎస్‌ పేరుతో వ్యాక్సిన్‌ను రూపొందించింది. ప్రస్తుతం మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ ఫలిస్తాయని తాము ఆశిస్తున్నట్లు మహిమా దాట్ల తెలిపారు. పెద్ద మొత్తంలో ఈ వ్యాక్సిన్‌‌ను అందుబాటులోకి తీసుకుని రావాల్సి ఉన్నందు.. దాని ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

 డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి..

డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి..

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని తాము అంచనా వేస్తున్నట్లు చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా వ్యాక్సిన్‌ను సరఫరా చేయాల్సి ఉంటుందని అంచనా వేశామని అన్నారు. దీనికి అనుగుణంగా జెన్సెన్ ఫార్మాసూటికా ఎన్వీ తయారు చేస్తోన్న ఏడీ26.సీఓవీ2.ఎస్ వ్యాక్సిన్‌ను తాము ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ప్రాణాంతక కరోనాను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ను తయారు చేయాల్సి రావడం ఆనందంగా ఉందని మహిమా దాట్ల అన్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేసేలా..

అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేసేలా..

అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్‌ను అందుకునేలా తాము వ్యాక్సిన్‌ ప్రొడక్షన్‌ను పెంచుతామని బయో-ఇ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ డైరెక్టర్ నరేందర్ దేవ్ మంతెన తెలిపారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి బయోలాజికల్-ఇ బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌ నుంచి లైసెన్సింగ్‌ను పొందింది. ఈ మేరకు బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ వెంచర్స్‌తో ప్రత్యేకంగా మరో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సరైన సమయంలో బయోలాజిక్-ఇ ఈ లైసెన్సింగ్‌ను పొందిందని బేలార్ నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్, టెక్సాస్ చిల్డ్రన్స్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ డీన్ డాక్టర్ పీటర్ హోటెజ్ వ్యాఖ్యానించారు.

 భారత్ బయోటెక్ తరువాత..

భారత్ బయోటెక్ తరువాత..


హైదరాబాద్‌కే చెందిన భారత్ బయోటెక్ ప్రస్తుతం వ్యాక్సిన్‌ను రూపొందించింది. కోవ్యాక్సిన్ పేరుతో రూపొందిన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. తొలి రెండు దశల ట్రయల్స్ ముగించుకుంది. అత్యంత కీలకమైన మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కోవ్యాక్సిన్ ధర కూడా అందుబాటులో ఉంటుందంటూ ఇదివరకే భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

English summary
Hyderabad-based Pharmaceuticals & Biologics Company Biological E. Limited (BE) has entered into an agreement with Janssen Pharmaceutica NV. This agreement concerns the development and enhancement of manufacturing capacities for drug products for 'Ad26.COV2.S', pharma giant Johnson & Johnson's Covid-19 vaccine candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X