• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పార్టీలో చేరకముందే భవిష్యత్ సీఎం నేనే అన్న కోమటి రెడ్డి ... కలకలంగా మారిన ఆడియో

|
    కలకలంగా మారిన ఆడియో ||I Am The Future CM : Komati Reddy || Oneindia Telugu

    తెలంగాణా రాష్ట్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సృష్టించిన ప్రకంపనలు ఆగటం లేదు . కాంగ్రెస్ అధిష్టానంపైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడి బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీలో చేరటానికి ముహూర్తం సిద్ధం చేసుకున్న రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరకముందే సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక ఆయన మాట్లాడిన ఒక ఆడియో ఇప్పుడు తెలంగాణా రాజకీయ వర్గాల్లో దుమారంగా మారింది.

    టీడీపీనే నమ్మక ద్రోహం చేసింది .. పార్టీ ఓటమికి కారణం ఆయనే..బీజేపీకి జై అన్న అంబికా కృష్ణ

    బీజేపీలో చెరక ముందే సంచలనం సృష్టించిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆడియో

    బీజేపీలో చెరక ముందే సంచలనం సృష్టించిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆడియో

    నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇక ఈ నేపధ్యంలో పార్టీ మార్పుపై ఓ కార్యకర్తను బుజ్జగిస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటల ఆడియో లీక్ కలకలం రేపుతోంది. కోమటిరెడ్డి బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అవుతానంటూఆ ఆడియోలో మాట్లాడటం అటు బీజేపీలో సైతం ప్రకంపనలు సృష్టిస్తుంది.

    బీజేపీలో చేరితే నేనే భవిష్యత్ సీఎం అన్న కోమటి రెడ్డి .. కార్యకర్తతో మాట్లాడిన ఆడియో లీక్

    బీజేపీలో చేరితే నేనే భవిష్యత్ సీఎం అన్న కోమటి రెడ్డి .. కార్యకర్తతో మాట్లాడిన ఆడియో లీక్

    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడుతున్నారని తెలిసిన నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయనకు ఫోన్ చేశారు. ఇక ఆయనతో కోమటిరెడ్డి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మిమ్మల్ని ఎమ్మెల్యే చేసేందుకు తాను ఎంతో కష్టపడ్డానని, పాదయాత్ర కూడా చేశానని అయితే ఇప్పుడు పార్టీ మారడం సరికాదంటూ ఆ కార్యకర్త కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు . కాంగ్రెస్ పార్టీని వీడొద్దంటూ కోరారు. అయితే ఎవరూ బాధపడొద్దని అంతా కలిసే బీజేపీలో చేరదామంటూ చెప్పిన కోమటిరెడ్డి బీజేపీలో చేరితో భవిష్యత్తులో తానే సీఎం అవుతానంటూ ఆ కార్యకర్తను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ కార్యకర్త సైతం తమను సీఎంగా చూడాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ గెలుస్తోందని తానే సీఎం అవుతానన్నారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి .

    కాంగ్రెస్ లో కుమ్ములాటలు తట్టుకోలేకే రాహుల్ సైతం రాజీనామా చేశారన్న కోమటి రెడ్డి

    కాంగ్రెస్ లో కుమ్ములాటలు తట్టుకోలేకే రాహుల్ సైతం రాజీనామా చేశారన్న కోమటి రెడ్డి

    ఇక అంతే కాదు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలను తట్టుకోలేక రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నా పట్టించుకోవడంలో ఉత్తమ్, కుంతియా ఫెయిల్ అయ్యారని తెలిపారు కోమటి రెడ్డి . దేశప్రజలంతా ప్రధాని నరేంద్రమోడీ పాలన కోరుకుంటున్నారని బీజేపీలో చేరితే భవిష్యత్ లో సీఎం కావచ్చు అని ఆయన చెప్పారు . అంతా కలిసి పోదామని తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని రాహుల్ గాంధీకి సైతం తెలుసని పేర్కొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

    బీజేపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్న కోమటి రెడ్డి తాజా వ్యాఖ్యలు

    బీజేపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్న కోమటి రెడ్డి తాజా వ్యాఖ్యలు

    ఇకపోతే ఈనెల 28న ఢిల్లీలోని బీజేపీ జాతీయ నేతల సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనే కాదు మరి కొందరు నేతలు కూడా బీజేపీ తీర్ధం తీసుకోటానికి సిద్ధం అయినట్టు తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గడ్డు కాలం వచ్చింది. ఇక బీజేపీలో చేరనున్న కోమటి రెడ్డి భవిష్యత్ సీఎం తానేనని చేసిన వ్యాఖ్యలు బీజేపీ నాయకులకు మింగుడు పడటం లేదు. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అసలు పార్టీలోనే చేరలేదు. అప్పుడే ఈ సీఎం గోలేంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు బీజేపీ నాయకులు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    English summary
    Nalgonda district MLA Komatireddy Rajagopal Reddy is planning to say goodbye to the Congress party. He is planning to join in BJP. In this context, audio that appeals to an activist on party change is going viral on social media. Telangana State Politician Komatireddi Rajagopal Reddy's Speaking Audio Leak is in turmoil. Talking in audio and creating a vibe in the BJP as Komatireddy joins the BJP. before joining the party he said if a join in the party I am the future CM. komati reddy said to the follower.
    Get Instant News Updates
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more