హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో ఘరానా మోసం.. నగల తయారీలో బెంగాలీల చేతివాటం

|
Google Oneindia TeluguNews

బంగారం ఒక ఆస్తి. బంగారం ఒక పెట్టుబడి సాధనం. బంగారం ఒక నమ్మకం. కష్టకాలంలో ఆదుకుంటుందనే భరోసా. అందుకే మగువలకు బంగారమంటే మక్కువ ఎక్కువ. కొంత డబ్బు పోగైనా దాన్ని బంగారం రూపంలోకి మార్చేస్తారు. అయితే మనం కొంటున్నది అసలు బంగారమేనా? 22 క్యారెట్ పేరుతో విక్రయించే ఆభరణాల్లో ఉండే బంగారం ఎంత? హాల్ మార్క్ వేసినంత మాత్రన అది నాణ్యమైనదని భావించవచ్చా? బ్రాండెడ్ షాపుల్లో విక్రయిస్తున్న ఆభరణాలు 916 బంగారంతోనే తయారు చేస్తున్నారా?

<strong>ముసలాయన ఆశ పడ్డారు..! డేటింగ్ వెబ్‌సైటోళ్లు 46 లక్షలు గుంజారు</strong>ముసలాయన ఆశ పడ్డారు..! డేటింగ్ వెబ్‌సైటోళ్లు 46 లక్షలు గుంజారు

నగల తయారీలో నయా మోసం

నగల తయారీలో నయా మోసం

మెరిసేదంతా బంగారం కాదన్నట్లే.. నగలన్నీ 22క్యారెట్ల బంగారంతో తయారైనవి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. బెంగాలీ స్వర్ణకారులు చేసిన మోసమే ఇందుకు నిదర్శనం . ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో రెండోస్థానంలో ఉన్న భారత్‌లో దొరికినన్ని నగల డిజైన్లు మరెక్కడా దొరకవు. అలాంటి డిజైన్ల తయారీలో బెంగాలీ స్వర్ణకారులను మించిన వారు లేరు. ఆ కారణంగానే బడా బడా జ్యుయెలరీ షాపులు ఆర్డర్లపై బెంగాలీ స్వర్ణకారులకు స్వచ్ఛమైన బంగారాన్ని ఇచ్చి నగలు తయారీ చేయించుకుంటాయి. ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు కొత్త తరహా మోసానికి తెరతీశారు.

క్వాలిటీలో గోల్‌మాల్

క్వాలిటీలో గోల్‌మాల్

నగల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని వాడతారు. నగలు తయారు చేయించుకునే షోరూంల యజమానులు బెంగాలీ స్వర్ణకారులకు ఇచ్చేది కూడా ఇదే. అలా ఇచ్చే బంగారాన్ని కల్తీ చేస్తున్న కొందరు బెంగాలీలు 916 ప్యూరిటీ బదులు కేవలం 75శాతం నాణ్యత కలిగిన బంగారంతో నగలు తయారు చేసి ఇస్తున్నారు. వారు చేసే నగలపై హాల్‌మార్క్ ఉండటంతో ఎవరికీ అనుమానం రాదు. ఒకవేళ స్కిన్ టెస్ట్ చేసినా రిజల్ట్ 916 బంగారం అని చూపిస్తుంది. అలాంటి బంగారాన్ని కరిగించినప్పుడు మాత్రమే అసలు విషయం బయటపడుతుంది. అది 916 బంగారం కాదు కేవలం 75శాతం ప్యూరిటీ కలిగిన బంగారం అని తెలుస్తుంది.

ఫిర్యాదు చేసిన స్వర్ణకారులు

ఫిర్యాదు చేసిన స్వర్ణకారులు

బెంగాలీ డిజైనర్లు బడా గోల్డ్ షోరూములకు సైతం ఆర్డర్లపై ఇలాంటి నగలు తయారుచేసి ఇచ్చారు. ఈ మధ్య కాలంలో కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో స్వర్ణకారులు మహంకాళీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. కేసు బుక్ చేసిన పోలీసులు ఒక బెంగాలీ స్వర్ణకారున్ని అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది.

English summary
Hyderabad police arrested one bengali gold worker for cheating local goldsmiths by duping hall mark. and returning low purtity gold ornaments against 916 gold. they made low purity ornaments in such a manner that, even skin test also show that it was 916 gold. police registered a case and investigation underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X