హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సర్కార్ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలేవీ..? కేసీఆర్‌పై భట్టి విక్రమార్క ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఫైరయ్యారు. రాష్ట్ర ప్రజలు జ్వరాలతో బాధపడుతుంటే కళ్లకు గంతలు కట్టుకున్నారా అని ప్రశ్నించారు. ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు లేవని విమర్శించారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు.

కొత్త ట్రాఫిక్ రూల్స్ తిప్పలు...!టూ వీలర్‌తో తోసుకుంటూ వెళుతున్న రైడర్స్..!హల్‌చల్ చేస్తున్న వీడీయోకొత్త ట్రాఫిక్ రూల్స్ తిప్పలు...!టూ వీలర్‌తో తోసుకుంటూ వెళుతున్న రైడర్స్..!హల్‌చల్ చేస్తున్న వీడీయో

రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవన్నారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, బ్లడ్ ప్లేట్ లెట్ సేపరేటర్ ఎక్విప్ మెంట్, ఈసీజీ, ఎక్స్ ప్లాంట్ లేవని మండిపడ్డారు. ఆస్పత్రుల్లో పడకలు కొరత కూడా ఉందని పేర్కొన్నారు.

bhattti vikramarka fire on cm kcr

కొన్నిచోట్ల స్త్రీ, పురుషులను ఒకే బెడ్ మీద పడుకోబెట్టి చికిత్స అందించడాన్ని తప్పుపట్టారు. అలా ట్రీట్ మెంట్ చేయించుకునే వారు కూడా వేర్వేరు కుటుంబాలకు చెందిన వారని వివరించారు. సర్కార్ దవాఖానల్లో సరైన మందులు లేవన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా స్పందించే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో సర్కార్ దవాఖానల్లో సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.

English summary
Congress leader Bhatti Vikramarka fire against CM KCR and minister Rajender. The people of the state have fever. He criticized the lack of minimum facilities in government hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X