• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Big Boss 4: గంగవ్వ-నాగార్జునల మధ్య ఏజ్ గ్యాప్‌ ఎంతో తెలుసా..? సోషల్ మీడియాలో బిగ్ డిబేట్

|

బిగ్ బాస్-4 తెలుగు... గత ఆదివారం ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైన షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు కింగ్ నాగార్జున. అయితే ఈ సారి బిగ్‌ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు ఒకరిద్దరు తప్ప ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. దీంతో షో పై అంతకుముందున్న క్రేజ్ సీజన్ 4కు దక్కడం లేదు. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న ఒకే ఒక ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ యూట్యూబర్ గంగవ్వ. గంగవ్వ హౌజ్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి చాలామంది ప్రేక్షకులు ఆమె కదలికలను గమనిస్తూ ఉన్నారు. అయితే గంగవ్వ మాట్లాడుతున్న మాటలు కాస్త క్లారిటీ మిస్ అయ్యిందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని హోస్ట్ నాగార్జున కూడా చెప్పారు. ఇక సోషల్ మీడియాలో గంగవ్వ నాగార్జునలపై ఒక పోస్టు వైరల్ అవుతోంది. ఈ పోస్టు చాలా ఆసక్తికరంగా మారింది.

 ఆరుపదుల వయసులో మన్మథుడు

ఆరుపదుల వయసులో మన్మథుడు

కింగ్ నాగార్జున వయస్సు మీద పడుతున్నప్పటికీ మన్మధుడులానే ఇప్పటికీ కుర్రహీరోలతో పోటీ పడుతుంటారు. అంతలా తన ఫిట్‌నెస్‌ను మెయిన్‌టెయిన్ చేస్తాడు మన్మధుడు. అందుకే నాగార్జున అంటే అమ్మాయిలకు ఇప్పటికీ డ్రీమ్ బాయ్‌గానే కనిపిస్తారు. వయసు ఆరుపదులు దాటినా కింగ్ మాత్రం అదే ఫిట్‌నెస్‌ను అదే అందాన్ని మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు. "డాన్‌"ను ఎవరు ఇంటర్వ్యూ చేసిన తప్పకుండా అడిగే ప్రశ్న ఫిట్‌నెస్ రహస్యం ఏంటనే... ఈ ప్రశ్న లేకుండా నాగార్జునతో ఇంటర్వ్యూ ముగియదు. గత నెల ఆగష్టు 29న నాగార్జున 60 ఏళ్లు పూర్తిచేసుకుని 61వ ఏటాలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా... ఇక్కడే అసలు కథ ఉంది.

అవ్వా స్పష్టంగా మాట్లాడవా...

అవ్వా స్పష్టంగా మాట్లాడవా...

బిగ్‌బాస్-4 సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున వయస్సు 61 ఏళ్లు. నాగార్జున పుట్టింది 1959 ఆగష్టు 29. ఇక ఇక్కడే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఉన్న గంగవ్వను నాగార్జున "అవ్వా" అని పిలవడంపై పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే గంగవ్వ కూడా 1959వ సంవత్సరంలోనే పుట్టారు. అయితే ఆమె పుట్టిన తేదీ జూలై 25 అని సమాచారం. నాగార్జున కంటే ఒక్క నెలరోజులు గంగవ్వ వయస్సులో పెద్దదని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. గంగవ్వ పేరులోనే అవ్వ ఉందికదా అందుకే అలా పిలిచి ఉంటారని కొందరు నెటిజెన్లు కామెంట్ చేస్తుండగా మరికొందరు మాత్రం అవ్వా అని ప్రత్యేకంగా పిలుస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో "అవ్వా మీరు కాస్త స్పష్టంగా మాట్లాడండి " అంటూ నాగార్జున చెప్పారు. నాగార్జున గంగవ్వను అవ్వా అని పిలవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

 గంగవ్వ బయోడేటా ఇదే...

గంగవ్వ బయోడేటా ఇదే...

ఇక గంగవ్వ విషయానికొస్తే ఆమె పూర్తి పేరు మిల్కూరి గంగవ్వ. వయస్సు 61 ఏళ్లు. ఆమె తెలంగాణలోని జగిత్యాల జిల్లా లంబాడిపల్లిలో 1959లో జన్మించింది. మై విలేజ్‌ షో అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వ తెగ పాపులర్ అయిపోయింది. ఇక ఒకటో తరగతి మాత్రమే గంగవ్వ చదివినట్లు సమాచారం. గంగవ్వకు ముగ్గురు పిల్లలు ఎనిమిది మంది మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు. ఇక గంగవ్వను లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చింది మాత్రం ఆమె అల్లుడు శ్రీకాంత్ శ్రీరాం. శ్రీకాంత్ ఫిల్మ్‌మేకర్ కావడంతో గంగవ్వలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయించాడు. గ్రామీణ సంస్కృతిని చాటుతున్న వీడియోలను పోస్టు చేసేవాడు. సామాజిక స్పృహకు కాస్తంత హ్యూమర్ టచ్ ఇచ్చి చేసిన వీడియోలను పోస్టు చేసేవారు.

యూట్యూబ్ నుంచి గంగవ్వకు గోల్డ్ ప్లే బటన్

యూట్యూబ్ నుంచి గంగవ్వకు గోల్డ్ ప్లే బటన్

అంతకు ముందు గంగవ్వ వ్యవసాయం చేస్తుండేది. ఆ తర్వాత కూలీగా పనిచేసి బీడీలు చుట్టే పనికూడా చేసింది. ఇక యూట్యూబ్‌ స్టార్ట్ అయ్యాక ఫాలోవర్లను విపరీతంగా సంపాదించుకోవడంతో ఈ మధ్యే యూట్యూబ్ నుంచి గోల్డ్ ప్లే బటన్ లభించింది. కొన్ని సినిమాల్లో కూడా గంగవ్వ నటించి నటి కావాలన్న ఆమె కోరికను నెరవేర్చుకుంది. ఇస్మార్ట్ శంకర్, కేజీఎఫ్, మల్లేశం లాంటి సినిమాల్లో నటించి ఆమె తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. ఇక చాలా అవార్డులను కూడా గంగవ్వ దక్కించుకుంది. వుమెన్ అచీవర్ అవార్డు దక్కించుకున్న గంగవ్వకు తన యూట్యూబ్ ఛానెల్ పై 1.5 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీరిలో పలువురు ఫిల్మ్ మేకర్స్ సెలిబ్రిటీలు కూడా ఉండటం విశేషం.ఇన్స్‌టాగ్రామ్‌లో 46వేల ఫాలోవర్స్ గంగవ్వకున్నారంటే ఆమె టాలెంట్ మామూలుగా లేదుగా...

English summary
Youtuber and Big Boss-4 contestant Gangavva has all the praises from the viewers. In this back drop a small debate is making rounds on social media with host Nagarjuna calling Gangavva as "Avva" which means grandmother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X