హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Big Boss: ఓ బిగ్ క‌న్‌ఫ్యూజ‌న్ మాస్ట‌ర్ బాస్: తెలుగోళ్ల మైండ్‌సెట్ అర్థం చేసుకోవ‌డం క‌ష్ట‌మే!

|
Google Oneindia TeluguNews

అమ‌రావతి: బిగ్‌బాస్‌. రెండు తెలుగు రాష్ట్రాల‌వారికి ఓ స‌రికొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లే రియాలిటీ షో. కొందరు వ్యక్తుల మధ్య చెలరేగే కోపతాపాలు, భావోద్వేగాలు, రాగధ్వేషాలు, వారి ప్రవర్తన..దీనికి మూలాధారం. బిగ్‌బాస్ హౌస్ కోసం ఎంపికైన కంటెస్టెంట్‌ల మైండ్‌సెట్ ఎలాంటిదో.. దాన్ని చూసే వీక్ష‌కుల‌కు అర్థమౌతోంది. ఫ‌లానా కంటెస్టెంట్ స‌హ‌జంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడంటే అత‌నికి ఓటు వేస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో మ‌రి కొన్ని రోజుల పాటు కొన‌సాగే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నారు. ఆ ఎపిసోడ్‌ల‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్క‌డిదాకా బాగానే ఉంది. బిగ్‌బాస్ ప‌రిస్థితే దీనికి భిన్నంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

హోస్ట్‌ల కొన‌సాగింపుపై లోపించిన క్లారిటీ..

హోస్ట్‌ల కొన‌సాగింపుపై లోపించిన క్లారిటీ..

కంటెస్టెంట్‌ల మైండ్‌సెట్ ఎలాంటిదో బిగ్‌బాస్ అర్థం చేసుకుంటున్నాడు గానీ.. తెలుగు వీక్ష‌కుల మైండ్‌సెట్‌ను మాత్రం ఆయ‌న బుర్రకు ఎక్క‌ట్లేదు. కంటెస్టెంట్‌ల ప్ర‌వ‌ర్త‌న‌పై బిగ్‌బాస్‌కు ఓ క్లారిటీ ఉంది గానీ.. వీక్ష‌కుల‌కు దేన్ని ప్ర‌జెంట్ చేయాలన్న అంశంపై క్లారిటీని కోల్పోతున్నాడు. దీనికి ఉదాహ‌ర‌ణ‌- హోస్ట్‌ల మార్పు. బిగ్‌బాస్ రియాలిటీ షో ప్ర‌తి సీజ‌న్‌కు హోస్ట్‌ను మార్చుతున్నారు. దీనికి కార‌ణం- ఏ హోస్ట్‌నూ మ‌న తెలుగు వీక్ష‌కులు అంగీక‌రించ‌క‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అనుకోవ‌చ్చు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో కొన‌సాగుతున్న బిగ్‌బాస్ సీజ‌న్‌ల‌కు ఒక్క‌రే హోస్ట్‌గా ఉంటూ వ‌స్తున్నారు. ఒక్క తెలుగులోనే సీజ‌న్‌కు ఒక‌రు చొప్పున మారుతున్నారు.

మిగిలిన భాష‌ల్లో ఆరంభం నుంచీ ఒకరే హోస్ట్‌

మిగిలిన భాష‌ల్లో ఆరంభం నుంచీ ఒకరే హోస్ట్‌

తెలుగుతో పాటు మిగిలిన ద‌క్షిణాది భాష‌ల‌న్నింట్లోనూ బిగ్‌బాస్ రియాలిటీ షోను నిర్వ‌హిస్తున్నారు. బ‌హుభాషా న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ త‌మిళం బిగ్‌బాస్‌ను హోస్ట్ చేస్తున్నారు. సీజ‌న్ ఆరంభం నుంచీ ఆయ‌నే. మార్చాల‌నే ఆలోచ‌నే బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్‌కు రాలేదు. బిగ్‌బాస్ క‌న్న‌డంలో శాండిల్‌వుడ్ సూప‌ర్‌స్టార్ సుదీప్ హోస్ట్‌గా ఉన్నారు. ఆరంభం నుంచీ ఆయ‌న‌ ఒక్క‌రే. క‌న్న‌డంలో బిగ్‌బాస్ రియాలిటీ షో కార్య‌క్ర‌మాలు ఏడు సీజ‌న్‌లు ముగిశాయి. అయిన‌ప్ప‌టికీ- హోస్ట్‌ను మార్చ‌లేదు. క‌న్న‌డిగుల‌కూ బోర్ కొట్ట‌లేదు. సుదీప్‌ను నెత్తినెత్తుకున్న‌ట్టే.. బిగ్‌బాస్ రియాలిటీషోనూ ఆద‌రిస్తున్నారు. ఇక మ‌ల‌యాళం- గ‌త ఏడాదే మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు బిగ్‌బాస్‌. మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ దీనికి యాంక‌ర్‌. ఈ ఏడాది ఇంకా టెలికాస్ట్ కావాల్సి ఉంది. మ‌ల‌యాళం బిగ్‌బాస్ సీజ‌న్‌- త్వ‌ర‌లో ఆరంభం కానుంది. బిగ్‌బాస్ హోస్ట్‌ను మార్చుబోతున్నారంటూ ఎక్క‌డా వార్త‌లు లేవు. హిందీలో కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌.. ఎన్నేళ్ల‌యినా ఆయ‌నే!

యంగ్ టైగ‌ర్‌.. ఒక్క సీజ‌న్‌కే ప‌రిమితం

యంగ్ టైగ‌ర్‌.. ఒక్క సీజ‌న్‌కే ప‌రిమితం

2017లో బిగ్‌బాస్ తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆట్ట‌హాసంగా ఆరంభ‌మైన బిగ్‌బాస్ సీజ‌న్‌-1ను యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. హోస్ట్ అంటే ఎలా ఉండాలో ఓ ట్రెండ్ సెట్ చేశారు. బిగ్‌బాస్ సీజ‌న్‌-1 హోస్ట్‌గా ఉన్నందుకు ఎన్టీఆర్‌కు సుమారు ఎనిమిది కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ అందిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అంత గ్రాండ్‌గా సీజ‌న్‌-1ను నిర్వ‌హించిన‌ప్ప‌టికీ.. నెక్స్ట్ సీజ‌న్‌కు ఆయ‌న లేరు. బిగ్‌బాస్ యాజ‌మాన్యం ఆయ‌న‌ను తొల‌గించింది. నేచుర‌ల్ స్టార్ నానికి హోస్ట్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది.

నేచుర‌ల్ స్టార్‌.. నేచుర‌ల్‌గా..

నేచుర‌ల్ స్టార్‌.. నేచుర‌ల్‌గా..

తెలుగు ప్రేక్ష‌కుల్లో నేచుర‌ల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న నాని.. త‌న‌దైన స్టైల్‌లో సీజ‌న్‌-2ను అవ‌లీల‌గా లాగించేశాడు. ఎక్క‌డా ఓవ‌ర్ యాక్ష‌న్ చేయ‌లేదు. బిగ్‌బాస్ రియాలిటీ షో కార్య‌క్ర‌మానికి త‌న రియాలిటీని ప‌రిచ‌యం చేశాడు నాని. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ ఎంత స‌హ‌జంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారో.. అంతే స‌హ‌జంగా యాంక‌రింగ్ చేశాడు. అయిన‌ప్ప‌టికీ- బిగ్‌బాస్ సీజ‌న్‌-3 వ‌చ్చేసరికి ఆయ‌న మాయం అయ్యారు. నాని స్థానంలో అక్కినేని అంద‌గాడు నాగార్జున‌ను తీసుకున్నారు. ఎన్టీఆర్‌ను ఎందుకు తొల‌గించారో.. నాని ఎందుకు దూరం అయ్యారనే విష‌యాల‌ను వీక్ష‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు పెద్ద‌గా క‌నిపించ‌ట్లేదు.

క‌ట్టి ప‌డేస్తోన్న టాలీవుడ్‌ కింగ్.. నాగ్‌

క‌ట్టి ప‌డేస్తోన్న టాలీవుడ్‌ కింగ్.. నాగ్‌

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్‌-3లో అక్కినేని నాగార్జున వీక్ష‌కుల‌ను త‌న యాంక‌రింగ్‌తో క‌ట్టి ప‌డేస్తున్నారు. చూపు తిప్పుకోనివ్వ‌ని ఎన‌ర్జీతో ఆక‌ట్టుకుంటున్నారు. నిజానికి- నాగార్జున యాంక‌ర్‌గా అవ‌తారం ఎత్త‌డం కొత్తేమీ కాదు. ఇదివ‌ర‌కు ఆయ‌న మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఆ అనుభవం ఎలాగూ ఆయ‌న‌కు ఉంది. ఫ‌లితంగా- తొట్రుపాటు క‌నిపించ‌ట్లేదు. స్టేజీ మీద దుమ్ము దులిపేస్తున్నారు. త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఆరంభం నుంచీ ఒక్క‌రే హోస్ట్‌గా ఉంటూ వ‌స్తుండ‌గా.. తెలుగులో మాత్రం సీజ‌న్‌కు ఒక‌రు చొప్పున ఛేంజ్ అయ్యారు. దీనికి కార‌ణాలు ఎవ‌రికీ తెలియ‌వు. ఎందుకంటే అది బిగ్‌బాస్ కాబ‌ట్టి. హోస్ట్‌ను ఎందుకు కొన‌సాగిస్తున్నారు? ఎందుకు తొల‌గిస్తున్నారు? అనే అంశాల‌ను మ‌నం ప్ర‌శ్నించ‌లేం. ఆ నిర్ణ‌యం ఒక్క బిగ్‌బాస్‌దే.

 బిగ్‌బాస్.. బేస్ వాయిస్‌

బిగ్‌బాస్.. బేస్ వాయిస్‌

ఎక్క‌డా ఉంటాడో తెలియ‌దు? ఎలా ఉంటాడో తెలియ‌దు? చూసిన వాళ్లెవ‌రూ లేరు చివ‌రికి హౌస్‌మేట్స్ స‌హా. బిగ్‌బాస్‌ బేస్ వాయిస్ మాత్ర‌మే వీక్ష‌కుల‌కు చిర‌ప‌రిచితం. ఆయ‌న మాట వినిపించ‌గానే హౌస్‌మేట్స్ అంద‌రూ అల‌ర్ట్ కావ‌డం, న‌చ్చ‌క‌పోయినా చెప్పింది చేయ‌డం, చెప్పిన‌ట్లు విన‌డం మాత్ర‌మే మ‌నం చూస్తున్నాం. బిగ్‌బాస్ అయిన‌ప్ప‌టికీ.. హోస్ట్‌ల విష‌యంలో మాత్రం క‌న్‌ఫ్యూజ‌న్‌కు గురి అవుతున్నారు. మిగిలిన భాషల్లో లేని గంద‌ర‌గోళం ఆయ‌న‌ను ఒక్క తెలుగులో మాత్ర‌మే వెంటాడుతోంది.

English summary
Big Boss Telugu Season-3 launched with new host as Akkineni Nagarjuna. Young Tiger Jr. NTR and Natural Star Nani were act as host Big Boss previous seasons. Change of the host continues in the Big Boss Telugu only. Another South Indian languages as Kannada, Tamil and Malayalam seasons host will be the same. Sudeep in Kannada, Kamal Hasan in Tamil and Mohan Lal in Malayalam. But, in Telugu Three seasons got Three Hosts separately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X