• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigboss Telugu:దేవీ ఎలిమినేషన్‌కు పవన్ ఫ్యాన్స్‌ కారణమా..? రీఎంట్రీ,పర్సనల్ లైఫ్ గురించి ఏమన్నారు.?

|

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 క్రమంగా రక్తి కట్టిస్తోంది. అప్పటి వరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా బరిలోకి దిగిన ప్రముఖ ఛానెల్ న్యూస్ ప్రెజెంటర్ దేవీ నాగవల్లి ఒక్కసారిగా నామినేషన్స్‌లోకి వెళ్లడం ఆ తర్వాత ఎలిమినేట్ కావడం చాలా మందిని షాక్‌కు గురిచేసింది. కారణాలు ఏవైనా.. దేవీ నాగవల్లి మాత్రం షో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కానీ ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూస్తే కచ్చితంగా టాప్ టూ కంటెస్టెంట్స్‌లో ఒకరుగా ఉంటారని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఇంతలోనే బిగ్‌బాస్ దేవీ నాగవల్లికి షాక్ ఇచ్చాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాంకర్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. కమ్ బ్యాక్ దేవీ అంటూ నెటిజెన్లు పెద్ద చర్చే పెడుతున్నారు. ఇక దేవీ బిగ్ బాస్ హౌజ్ నుంచి వచ్చిన తర్వాత పలు యూట్యూబ్ ఛానెళ్లు ఆమె ఇంటర్వ్యూ కోసం వెంటపడ్డాయి. ఈ సందర్భంగా చాలా ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.

దేవీ నాగవల్లి ఎ కమిటెడ్ జర్నలిస్ట్

దేవీ నాగవల్లి ఎ కమిటెడ్ జర్నలిస్ట్

దేవీ నాగవల్లి... తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వృత్తి జర్నలిజం. మైక్ పట్టి కెమెరా ముందు నిల్చుందంటే చాలు.. రిపోర్టింగ్‌తో ప్రేక్షకులను అలానే కట్టిపడేయగల సత్తా ఉన్న యాంకర్. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన దేవీ నాగవల్లి..ఇప్పుడు అదే ప్రముఖుల స్థానంలో ఉండి పలు ఛానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఈ బోల్డ్ లేడీ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. అదే సమయంలో బిగ్ బాస్ హౌజ్ గురించి కూడా ఎన్నో విషయాలను చెబుతున్నారు. దీంతో ఏ సోషల్ మీడియా చూసినా దేవీ నాగవల్లిపైనే డిస్కషన్ జరుగుతోంది. అంతేకాదు దేవీ నాగవల్లి ఆర్మీ అంటూ కొత్తగా ఫ్యాన్స్ ఒక గ్రూప్ క్రియేట్ చేసినా చేస్తారనేలా పరిస్థితి కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్ర ప్రజల మనసుల్లో స్థానం

తెలుగు రాష్ట్ర ప్రజల మనసుల్లో స్థానం

దేవీనాగవల్లి బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ... తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. దేవీ నాగవల్లిని ఎప్పుడూ టీవీలో తన బోల్డ్ యాంకరింగ్‌తో చూసిన ప్రేక్షకులు ది అదర్ సైడ్ ఆఫ్ దేవీ ఏంటో బిగ్ బాస్ చూపించాడు. హౌజ్‌లో తనలా తను ఉండటం.. టాస్క్‌ను కంప్లీట్‌ చేయడం, మంచి క్రమశిక్షణతో దేవీ వ్యవహరించారు. అది ప్రపంచమంతా చూసింది. ఇక దేవీ నాగవల్లి ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలు ఇటు బిగ్ బాస్ హౌజ్ గురించి అటు తన వ్యక్తిగత విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చారు. దేవీని తన వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించినప్పుడు ఎంతో కాన్ఫిడెంట్‌గా ఎంతో ధైర్యంగా సమాధానం ఇచ్చారు. బహుశా ఆమె కూడా పలు ఇంటర్వ్యూలు చేసినప్పుడు అదే తరహా ప్రశ్నలు అతిథులను వేయడం చూశాం. అదే ఇప్పుడు తాను అలవర్చుకుని ఉంటారని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

వ్యక్తిగత విషయాలను వెల్లడించిన దేవీ

వ్యక్తిగత విషయాలను వెల్లడించిన దేవీ

ఇక తాజాగా దేవీ తన పర్సనల్‌ లైఫ్ గురించి వెల్లడించింది. బిగ్‌బాస్ స్టేజ్‌ పైనే తన గురించి వివరించారు దేవీ నాగవల్లి. కానీ ఇప్పుడు ఇంకాస్త డీప్‌గా చెప్పారు. తన మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పారు. తనకు అమెరికాలో ఉండటం ఇష్టం లేక, ఇటు తన జర్నలిజం ప్రొఫెషన్‌ను వీడటం ఇష్టంలేక తాను తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు చెప్పారు. కట్ చేస్తే దేవీ ఒక మంచి జర్నలిస్టుగా పేరు సంపాదించారు. తనకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పిన దేవీ ఎన్నో విపత్తులను దగ్గరుండి కవర్ చేసినట్లు గుర్తు చేశారు. తాను విధుల్లో ఉండగా కళ్లముందే మృతదేహాలను చూసినట్లు చెప్పుకొచ్చారు. విదేశాల్లో భారీ భూకంపాలు వచ్చిన సమయంలో తాను కవర్ చేసినట్లు చెప్పారు. ఇలా ఒక్కొక్కటిగా దేవీ ఎంతో ధైర్యంగా చెబుతుంటే ఆమె ఒరిజినల్‌గా ఇలానే ఉంటారనే క్లారిటీ ప్రేక్షకులకు వచ్చింది.

పవన్ ఫ్యాన్స్ కారణమా..?

పవన్ ఫ్యాన్స్ కారణమా..?

ఇక దేవీ నాగవల్లి ఎలిమినేషన్‌కు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా అప్పట్లో వార్తలు చదివారన్న కోపంతోనే పవన్ ఫ్యాన్స్ దేవీకి వ్యతిరేకంగా కూడబలుక్కుని ఓట్లు వేశారనే ప్రచారం జరుగుతోంది. గతవారం ఎలిమినేషన్ సందర్భంగా మెహబూబ్ లగేజీ సర్దేసుకుని బయటకు వస్తారని భావించారు కానీ అనూహ్యంగా దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు. ఇక దేవీ నాగవల్లి దర్శకరత్న దాసరికి బంధువవుతారని కూడా చెప్పారు. అయితే తనకు తానుగా ఎప్పుడూ చెప్పదల్చుకోలేదని తన తల్లి ద్వారా ఆ విషయం ప్రపంచానికి తెలిసిందని దేవీ చెప్పారు.

  Bigg Boss Telugu 4: Devi Nagavalli On Marriage ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఆలోచిస్తా...! | Oneindia Telugu
  దేవీ తిరిగి బిగ్‌బాస్ హౌజ్‌లోకి..

  దేవీ తిరిగి బిగ్‌బాస్ హౌజ్‌లోకి..

  మొత్తానికి దేవీ నాగవల్లి బిగ్ బాస్ మిస్ కావడం లేదని.. బిగ్‌బాసే దేవీ నాగవల్లిని మిస్ అవుతోందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పుడంతా దేవీ కమ్ బ్యాక్ అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. ఇక గత సీజన్‌లో ఎలిమినేట్ అయిన అలీ రెజా తిరిగి హౌజ్‌లోకి ఎలాగైతే అడుగుపెట్టారో దేవీ కూడా అలా అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటే తప్పకుండా బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళతానని దేవీ చెప్పారు. అదే కనుక జరిగితే పిచ్చ క్లారిటీతో ఉన్న దేవీ నాగవల్లి బిగ్ బాస్ హౌజ్‌ టైటిల్ కచ్చితంగా ఎగురేసుకుపోవడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

  English summary
  After the elimination of Devi Nagavalli from BigBoss 4 house, Social Media erupted in support of her asking Devi to make a comeback.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X