హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ ఫైర్ యాక్సిడెంట్.. ఎస్ఐ చొరవతో 500 మంది విద్యార్థులు సేఫ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఓ ఎస్ఐ చూపిన చొరవ.. 500 మంది విద్యార్థులను కాపాడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారుల ప్రాణాలను కాపాడారు. హైదరాబాద్ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది ఈ ఘటన. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఎస్ఐ సత్వరమే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ప్రాణహాని జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు.

ఎగిసిపడ్డ మంటలు.. విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి

ఎగిసిపడ్డ మంటలు.. విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి

కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలోని మైలార్‌దేవుపల్లిలో.. బుధవారం ఉదయం 10-11 గంటల మధ్య ఓ పరుపుల తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. పరుపుల తయారీలో వినియోగించే యంత్రం నుంచి నిప్పురవ్వలు ఎగిరిపడి అగ్ని ప్రమాదానికి దారితీశాయి. ప్రమాదం పసిగట్టిన కార్మికులు, సిబ్బంది బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.

అయితే సదరు కంపెనీ పక్కనే ఓ ప్రైవేట్ పాఠశాల ఉంది. అందులో దాదాపు 500 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. క్షణాల్లో మంటలు వ్యాపించి పాఠశాల భవనానికి వీపరీతమైన పొగ విస్తరించడంతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పై అంతస్థుల్లో ఉన్న విద్యార్థులు బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు.

వేగంగా స్పందించిన ఎస్ఐ.. విద్యార్థులు సేఫ్

వేగంగా స్పందించిన ఎస్ఐ.. విద్యార్థులు సేఫ్

పరిస్థితి తీవ్రతను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నం చేశారు. మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్య ఫోన్ కు కాల్ చేయగా కలవలేదు. అదే సమయంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఎస్ఐ నదీమ్ అటువైపుగా వచ్చారు. పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్న విద్యార్థుల గురించి తెలుసుకుని అలర్టయ్యారు. ఒకవైపు పరిస్థితి సమీక్షిస్తూనే.. మరోవైపు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. ఇంకోవైపు కొందరికి సమాచారం అందించి ఘటనాస్థలికి రప్పించి సహాయకచర్యలు ముమ్మరం చేశారు.

సమయానికి రాకుంటే..!

సమయానికి రాకుంటే..!

పొగతో ఉక్కిరిబిక్కిరైన విద్యార్థులు హాహాకారాలు చేశారు. ఎస్ఐ నదీమ్ తనదైన శైలిలో స్టెప్ బై స్టెప్ చర్యలు తీసుకున్నారు. అంతేకాదు స్థానిక టీఆర్ఎస్ లీడర్ ఫయీం సహకారంతో కొంతమంది యువకుల్ని పోగుచేశారు. మరోవైపు వివిధ ఫ్యాక్టరీల నుంచి నిచ్చెనలు తెప్పించారు. ఇలా క్షణాల్లో అంతా సిద్ధం చేశాక రక్షణ చర్యలను ప్రారంభించారు. పై అంతస్థులకు నిచ్చెనలు వేసి నెమ్మదిగా విద్యార్థులను కిందకు దించారు. అటు ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మొత్తానికి ఎస్ఐ నదీమ్ వేగంగా స్పందించడంతో విద్యార్థులు సేఫ్ గా ప్రాణాలతో బయటపడ్డారు.

English summary
The initiative shown by SI of police has saved 500 students. He saved the lives of the young children with a zealous spirit. The incident took place at Hyderabad Katedan Industrial Area. The SI in patrolling duties responded quickly and reduced a high risk and saved the children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X