హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిగ్‌బాసే తోప్.. రేటింగ్‌లో బాప్‌రే బాప్ అనిపిస్తున్న షో..!! ఎన్టీఆర్, నానిని వెనక్కినెట్టిన నాగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బిగ్ బాస్ .. బిగ్గర్ దెన్ బిగ్గెస్ట్ .. ఔను అన్నట్టుగానే మూడో సీజన్‌లో దూసుకెళ్తోంది. ఎన్టీఆర్, నానిని తలదన్ని దూసుకెళ్తున్నాడు కింగ్ నాగార్జున. టీఆర్పీ రేటింగ్‌లో టాప్ గేరులో వెళ్తున్నాడు. బిగ్ బాస్ ఫస్ట్ వీక్ గడవడంతో టీఆర్సీ రేటింగులు విడుదలయ్యాయి. అయితే మొదటిరోజు నుంచే రియాలిటీ షోను తెగ చూసేస్తున్నారు జనం. ఫస్ట్ వీక్ టీఆర్పీ రేటింగ్‌లో బిగ్ బాస్ రాజసం ఒలకబోసింది. సెకండ్ వీక్ నుంచి టాస్కుల పేరిట మరింత రసవత్తరంగా షో సాగడంతో .. యూజర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

టీఆర్పీలో టాప్

టీఆర్పీలో టాప్

ఇప్పటికే కంటెస్టెంట్లకు సపరేట్‌గా ఆర్మీ ఉంది. వారు తెగ చూసేసి ఓట్లు వేస్తున్నారు. దీంతో టీఆర్పీ రేటింగ్ కూడా దండిగానే వచ్చింది. హైదరాబాద్‌లో బిగ్ బాస్ షో గురించి రేటింగ్ టాప్ గేరులో దూసుకెళ్లింది. ఓవరాల్‌గా బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ డే 17.9తో రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో 19.7 రికార్టులకెక్కింది. అయితే సీజన్-1లో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సమయంలో 16.18 మాత్రమే వచ్చింది. గతేడాది నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌కు 15.05 రేటింగ్ వచ్చింది. వీరిద్దరినీ తలదన్ని ముందుకెళ్లారు కింగ్ నాగార్జున. తన మార్కు చూపిస్తూ .. బిగ్ బాస్‌కు మరింత హైప్ తీసుకొచ్చారు.

4.5 కోట్ల మంది ప్రేక్షకుల వీక్షణ

4.5 కోట్ల మంది ప్రేక్షకుల వీక్షణ

మొత్తంగా 4.5 కోట్ల మంది బిగ్ బాస్ వీక్షించారు. మొదటి వారం దాదాపు 60 శాతం మంది చూశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు షోను 44 శాతం మంది వీక్షించినట్టు తెలిపారు. దీంతోపాటు సోషల్ మీడియాలో ఫస్ట్ డే వరల్డ్ వైడ్ ట్రెండింగ్‌లో ఉన్నది. దీంతోపాటు వన్ మిలియన్ ట్వీట్స్, లైక్స్, హ్యాష్ ట్యాగ్‌లు వచ్చాయి. వీటన్నింటిని కలుపుకుని ట్విట్టర్ ట్రెండింగ్‌లో షోలకు బాప్ షో బిగ్ బాస్ మొదటిస్థానంలో ఉన్నదని నిర్వహకులు ప్రకటించారు.

 మరింత హైప్ ..

మరింత హైప్ ..

ఇప్పటికే హేమ ఎలిమిట్ అయి తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చినా సంగతి తెలిసిందే. దీంతోపాటు ఈసారి ఎలిమినేషన్‌లో వరుణ్ దంపతులతోపాటు ఐదారుగురు ఉండటంతో షో రసవత్తరంగా సాగుతుంది. టీంలుగా వీడిపోయి .. టాస్క్‌లు చేస్తున్నారు. దీంతో టాస్క్ చేసి ఏం టీం గెలుస్తుందో .. ఎవరు నామినేషన్ నుంచి బయటపడతారోనన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే షోకి మరింత క్రేజ్ వచ్చింది. మొదటి వారం కంటే .. షో రంజు మీద కొనసాగుతోంది. అంటే ఈ వీక్ నుంచి టీఆర్పీ మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహాం లేదు.

English summary
King Nagarjuna is heading towards NTR, Nani. Going into the top gear of the TRP rating forr big boss. TRP ratings were released after the Big Boss First Week was over. The tribe has been watching the reality show since the first day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X