హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bigg Boss 10th week Elimination:మోనాల్ కోసం అతను బలి..ఈ రోజు బిగ్‌బాస్‌ను వీడేది ఇతనే..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో ముగింపు దశకు చేరుకుంటోంది. ఇక ఇప్పటికే ఇంట్లో అన్ని ఎమోషన్స్‌ను ప్రేక్షకులు చూసేశారు. ఒకరితో అప్పటి వరకు చాలా ప్రేమతో వ్యవహరించే కంటెస్టెంట్లు మరు నిమిషానికే మారుతున్నారు. అప్పటి వరకు ఒకరితో ఎంతో స్నేహంగా మెలిగిన కంటెస్టెంట్లు నెక్ట్స్ మినిట్ వారిని శతృవులుగా చూస్తున్నారు.

దీంతో ప్రేక్షకులు కూడా కంటెస్టెంట్ల గురించి బాగానే చర్చించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న ఈక్వేషన్స్‌తో బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో రంజుగా మారుతోంది. ఇక బిగ్‌బాస్ షో 10వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక ఈ వారం ఎలిమినేట్ ఎవరవుతారన్నదానిపై క్లారిటీ వచ్చేసింది.

 ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

బిగ్‌బాస్ షో 10వ వారం కంప్లీట్ చేసుకుంది. ఇక ఆనవాయితీగా ఎలిమినేషన్ జరగాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఎవరు ఈవారం ఎలిమినేట్ అవుతారనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే దీపావళి పండగ సందర్భంగా ఎలిమినేషన్ ఉండకపోవచ్చనే వార్తలు వచ్చాయి. కానీ బిగ్‌బాస్ ఎవరి మాట వినేలా కనిపించడం లేదు. అందుకే ఈ వారం ఎలిమినేషన్ జరిగిపోయింది. అఖిల్‌ ఎలిమినేట్ అవుతారని అంతా భావించినప్పటికీ బిగ్‌బాస్ షాక్ ఇస్తూ సర్ప్రైజ్ ఇస్తూ అతన్ని ఇంటికే పరిమితం చేసేశాడు. అది శనివారం జరిగిన ఎపిసోడ్‌లో టెలికాస్ట్ అయ్యింది కూడా.

 మెహబూబ్ ఔట్..?

మెహబూబ్ ఔట్..?

ఇక బిగ్‌బాస్ 10వ వారం ఎలిమినేషన్‌లో ఇంటిలో మొత్తం 9 మంది సభ్యులు ఉండగా అందులో ఆరు మంది నామినేషన్ జాబితాలో ఉన్నారు. వీరిలో అరియానా, అభిజీత్, మోనాల్, హారికా, మెహబూబ్, సోహెయిల్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిలో మోనాల్‌- మెహబూబ్‌లకు తక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చాయి. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం బిగ్‌బాస్ ఫేవరెట్ కంటెస్టెంట్ మెహబూబ్ ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది.

మెహబూబ్‌ను సేవ్ చేసేందుకు...

మెహబూబ్‌ను సేవ్ చేసేందుకు...

బిగ్‌బాస్ హౌజ్ నుంచి మెహబూబ్ ఎలిమినేట్ అయి లగేజ్ కూడా ప్యాక్ చేసుకుని బయటకు వచ్చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఎలిమినేషన్ ప్రక్రియలో బిగ్‌బాస్ పై సర్వత్రా ఆరోపణలు వచ్చినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా మోనాల్- మెహబూబ్‌లను సేవ్ చేస్తూ వచ్చాడు బిగ్‌బాస్. కానీ ఆట ముగింపు దశకు చేరుకుంటుండటంతో ఇక ఈ పప్పులు ఉడకవని బిగ్‌బాస్ గ్రహించినట్లు ఉన్నారు. అందుకే తన ఫేవరెట్ కంటెస్టెంట్‌ మెహబూబ్‌ను లగేజ్ ప్యాక్ చేసుకోమని చెప్పేసినట్లు తెలుస్తోంది. మెహబూమ్-మోనాల్‌ను సేవ్ చేసేందుకు బిగ్‌బాస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లను సైతం ప్రేక్షకుల ఓట్లతో పనిలేకుండా ఎలిమినేట్ చేశారనే అపవాదు మూటకట్టుకున్నాడు. ఇలా ఈ ఇద్దిరి కోసం బలైన వారిలో దేవీ నాగవల్లి, కుమార్ సాయి, దివిలు ఉన్నారు.

Recommended Video

Is Punarnavi Bhupalam Engagement Ring For Sreemukhi Womaniya Show ?
మోనాల్ కోసం మెహబూబ్ బలి

మోనాల్ కోసం మెహబూబ్ బలి

బిగ్‌బాస్ ఇప్పటికే మెహబూబ్‌ను సేవ్ చేసేందుకు పలు అవకాశాలు ఇచ్చాడు. అయినప్పటికీ మెహబూబ్ వీటిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేయలేదు. నో డౌట్ మెహబూబ్ కూడా ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంటే... కానీ రియాల్టీ షో ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ సారి మాత్రం ప్రేక్షకుల ఓట్లను బట్టే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సారి మోనాల్ కోసం మెహబూబ్‌ను బిగ్‌బాస్ బలి చేశాడని తెలుస్తోంది. దీనికి కారణం అఖిల్ తిరిగి ఇంటిలోకి ఎంటర్ కావడంతో మళ్లీ మోనాల్-అఖిల్ మధ్య ఏదైనా స్టోరీ నడుస్తుందేమో అన్న భావన షో నిర్వాహకుల్లో ఉన్నట్లు సమాచారం. ఈ ట్రాక్ మళ్లీ నడిస్తే టీఆర్పీ రేటింగ్‌లు కూడా తిరిగి గాడిన పడుతాయని బిగ్‌బాస్ షో నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం.

మొత్తానికి మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. శనివారం ఎలిమినేట్ అయిన ఎపిసోడ్ ఆదివారం టెలికాస్ట్ అవుతుంది. అయితే అధికారికంగా ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది మాత్రం హోస్ట్ నాగార్జున చెప్పే వరకు వేచిచూడాల్సిందే.

English summary
As the 10th week elimination is approaching in Bigg Boss Telugu-4, Buzz is going on social media that this week it would be Mehboob who will be eliminated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X