• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:బిగ్‌ ట్విస్ట్: ఎలిమినేట్ అయ్యేది ఆ బ్యూటీనే.. అవినాష్ తప్పించుకున్నట్లేనా..!

|

హైదరాబాదు: బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో ముగింపు దశకు చేరుకుంటోంది. డిసెంబర్ 20వ తేదీన ఫైనల్స్ ఉంటుందని సమాచారం. ఈ క్రమంలోనే ప్రతివారం ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. గతవారం ఎలిమినేషన్ నుంచి జబర్దస్త్ అవినాష్ తృటిలో తప్పించుకున్నాడు. ఈ సారి అవినాష్ ఎలిమినేట్ అవుతారని అంతా అనుకుంటున్న సమయంలో ఎలిమినేషన్‌కు సంబంధించి తాజా అప్‌డేట్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు..?

 టాప్ ఫైవ్‌లో ఉండేందుకు ఆరాటం

టాప్ ఫైవ్‌లో ఉండేందుకు ఆరాటం

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ -4 ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో కంటెస్టెంట్లు తమ మన అన్న బేధం లేకుండా ఎవరి గేమ్ పై వారు ఫోకస్ చేస్తూ టాప్ ఫైవ్‌లో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులను కంప్లీట్ చేసేందుకు సర్వం ఒడ్డుతున్నారు. ఒకప్పుడు ఒకరి కోసం మరొకరు త్యాగం చేసిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం తమకోసమే అన్నట్లుగా గేమ్ ఆడుతున్నారు. దీంతో బిగ్‌బాస్ షో రంజుగా మారింది. ఇక మరో ఎలిమినేషన్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ఇటు ప్రేక్షకుల్లో అటు కంటెస్టెంట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న చర్చ ప్రారంభమైంది. పాలు పట్టే టాస్క్‌లో అసహనంకు గురైన అవినాష్ తనను ఎలిమినేట్ చేయాల్సిందిగా బాహాటంగానే చెప్పాడు. అయితే బిగ్‌బాస్ మదిలో ఎవరున్నారనేది ఇంకా స్పష్టత రాలేదు.

 దేత్తడి హారిక జర్నీ ముగిసిందా..?

దేత్తడి హారిక జర్నీ ముగిసిందా..?

ఇక ఈ వారం ఎలిమినేషన్‌కు ఐదుగురు నామినేషన్‌లో ఉన్నారు. అభిజీత్, హారిక, మోనాల్, అఖిల్, అవినాష్‌లు ఉన్నారు. ఈ ఐదుగురు కంటెస్టెంట్లు ఫైనల్‌కు చేరుతామనే కాన్ఫిడెన్స్‌తో కూడా ఉన్నారు. అందరికీ గెలుపుపై సమూల అవకాశాలున్నాయనే భావన ఉంది. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో ఓట్లను పరిశీలిస్తే దేత్తడి హారికకు అతి తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కంటెస్టెంట్లకు వచ్చిన ఓట్లను చూస్తే హారిక చివరి స్థానంలో ఉంది. దీంతో ఆమె ఈ వారం ఇంటిని వీడే అవకాశం ఉంది. అంటే హారికా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే హారికాకు ఉన్న ఫ్యాన్స్ కచ్చితంగా షాక్‌కు గురవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఉన్నవాళ్లలో హారికా కూడా టైటిల్ పోరులో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉంది.

  Is Punarnavi Bhupalam Engagement Ring For Sreemukhi Womaniya Show ?
  ఆ కంటెస్టెంట్ కోసం హారికా బలికానుందా..?

  ఆ కంటెస్టెంట్ కోసం హారికా బలికానుందా..?

  హారికా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గేమ్‌లో కొనసాగుతున్నప్పటికీ మరొకరిని సేవ్ చేసేందుకు ఈ సారి హారికాను బలి చేయబోతున్నారంటూ అప్పుడే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ప్రారంభమయ్యాయి. మళ్లీ నాగార్జున బిగ్‌బాస్ షో నిర్వాహకులపై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. కొందరైతే అభిజీత్ ఫ్యాన్స్ మద్దతు లేకపోతే హారికా ఇంతవరకు వచ్చేది కాదన్న అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. హారికా హౌజ్‌లో చాలా కన్నింగ్‌ గేమ్ ఆడుతోందంటూ మరికొందరు తమ ఒపీనియన్ చెప్పారు. మరికొందరైతే అద్భుతంగా ఆడుతున్న హారికాను ఎలిమినేట్ చేయడం ద్వారా బిగ్‌బాస్ షో నిర్వాహకులకు నచ్చిన కంటెస్టెంట్‌ను సేవ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాజకీయాలు చేసేదానికైతే బిగ్‌బాస్ షో నిర్వహించడం దేనికంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హారికా..అవినాష్‌లు బ్యాక్‌ టూ బ్యాక్ ఎలిమినేట్ అవుతారని జోస్యం చెబుతున్నారు.

  మొత్తానికి హారికా ఎలిమినేషన్ కేవలం సోషల్ మీడియాలో నెటిజెన్లు చర్చించుకుంటున్న టాపిక్ మాత్రమే. ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆదివారం ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున రివీల్ చేసేవరకు వేచి చూడక తప్పదు.

  English summary
  As the Bigg Boss Telugu-4 is coming to an end, there is a buzz that this week Harika might get eliminated from the house.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X