• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss 12th week Elimination -ఈసారి బయటికెళ్లేది ఎవరంటే -ఓవరాక్షన్‌ ఫలితం?

|

రోజులు గడుస్తున్నకొద్దీ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మరింత రసవత్తరంగా మారింది. నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలేకు తేదీలు కూడా బయటికిరావడంతో టాప్-5లో ఎవరుంటానేది ఉత్కంఠగా మారింది. ఈక్రమంలోనే 12 వారం ఎలిమినేషన్ కోసం సోమవారం జరిగిన నిమినేషన్ల ప్రక్రియ అత్యంత నాటకీయంగా సాగింది. ఈవారంతంలో ఇంటి నుంచి బయటికి వెళ్లేది ఎవరంటే..

దుబాయ్ రాజుగారి ఆరో భార్య గుట్టు రట్టు -బాడీగార్డుతో ప్రిన్సెస్ హాయా అఫైర్ -అందుకు రూ.12కోట్లు

జాబితాలో నలుగురు..

జాబితాలో నలుగురు..

బిగ్ బాస్ తెలుగు సీజన్-4కు సంబంధించి 12వ వారం నామినేషన్ లో నలుగురు కంటెస్టెట్లు నిలిచారు. కారణాలు చెప్పి నామినేట్ చేసే గత పద్ధతులకు భిన్నంగా 12వ వారం ప్రక్రియ ఆద్యాంతం వినూత్నంగా సాగింది. ఆకుపచ్చ రంగున్న టోపీలు ధ‌రించి సోహైల్‌, మోనాల్ తొలుత సేవ్ కాగా, ఎరుపు రంగున్న టోపీలు ధ‌రించిన అరియానా, అఖిల్‌, అభిజిత్‌, అవినాష్ నామినేట్ అయ్యారు. అయితే, శ‌వ పేటిక‌లో నిల‌బడి స్వైపింగ్ కు అవకాశంరాగా, చివరికి కెప్టెన్ హారిక తన పవర్ తో మోనాల్ ను స్వాప్ చేసి అభిని నామినేష్ నుంచి కాపాడింది. తద్వారా అవినాష్, అఖిల్, అరియానా, మోనల్ లు నామినేషన్ లో నిలిచారు. వీళ్లలో..

ఎలిమినేషన్‌పై ఎర్లీగా..

ఎలిమినేషన్‌పై ఎర్లీగా..

ఆదివారం నాటి ఎలిమినేషన్ కు సంబంధించి సాధారణంగా గురు లేదా శుక్రవారాల్లో లీకేజీలు రావడం పరిపాటిగా మారింది. కానీ ఈసారి ఈ సీజన్ లోనే తొలిసారిగా నామినేషన్లరోజే ఎలిమేనేట్ అయ్యేదెవరో దాదాపు ఖరారైపోయిందని నెటిజన్లు అంటున్నారు. జాబితాలోని అవినాష్, అఖిల్, అరియానా, మోనల్ లలో ఒక్కొక్కరి బలాలు, బలహీనతలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. హౌజ్ లో ఓవరాక్షన్ కు మారు పేరుగా ఉన్న ఓ భామ, ఆమెకు సన్నిహితంగా వ్యవహరిస్తూ, పేవల ప్రదర్శన చేస్తోన్న కంటెస్టెంట్లలో ఒకరే ఈవారం బ్యాగు సర్దేయబోతున్నట్లు జనం అభిప్రాయపడుతున్నారు.

మోనాల్ మళ్లీ సేఫ్?

మోనాల్ మళ్లీ సేఫ్?

ఇష్టంతోనో, అయిష్టంగానో అభి కోసం నామినేట్ అయిన మోనల్ కు కచ్చితంగా అభి, హారిక ఓట్లు అన్నీ పడటం ఖాయం అయిపోయింది. దాంతో ఆమె సేవ్ అవ్వడం కూడా లాంఛనమే. టాప్-5 ప్లేయర్ గా తొలి నుంచీ రేసులో ఉన్న అఖిల్ కు ఒక దశలో అభిజిత్ కు సవాలు విసిరే స్థాయిలో ఓట్లు పడ్డాయి. అఖిల్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో సేఫ్ కావడం కూడా దాదాపు ఖరారే. అయితే..

  'Still The Boss'- Chris Gayle, The Only Cricketer To Score 1000 Sixes In T20 History | #UniverseBoss
  ఓవరాక్షన్ ఫలితంగా ఔట్?

  ఓవరాక్షన్ ఫలితంగా ఔట్?

  మోనాల్, అఖిల్ సేవ్ కావడం దాదాపు ఖాయమైపోగా, మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లు అవినాష్, అరియానాల్లో ఎవరికి తక్కువ ఓట్లొస్తే వాళ్లు ఇంటికెళతారు. అయితే హౌజ్ లో నిత్యం గొడవలు పడుతూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలని రచ్చకు దిగుతూ, కెప్టెన్సీ టాస్కులో కూడా కాస్త ఓవరాక్షన్ చేసిందనే అపవాదు మూటగట్టుకున్న అరియానానే ఈసారి ఇంటికెళ్లబోతోందనే ప్రచారం జరుగుతోంది. కానీ ‘లేడీ కంటెస్టెంటే విన్నర్ కావాలి'అన్న అరియానా కల ఆమెకు ఓట్లు రప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అవినాష్ కు జబర్దస్త్ క్రేజ్ కాస్త పని చేస్తుందని భావించినా, గడిచిన రెండు వారాలుగా అతని కామెడీ ట్రాక్ తప్పడం, హోస్ట్ నాగార్జున సైతం సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం తదితర పరిణామాలు.. 12వ వారం ఎలిమినేషన్ ను టెన్షన్ గానే ఉంచుతున్నాయి. రాబోయే నాలుగు రోజుల్లో ఈ ఇద్దరిలో ఒకరు బెస్ట్ పెర్మార్మెన్స్ ఇస్తే తప్ప బచాయించలేరు. కాగా, షో గడువు ముగుస్తుండటంతో 12వ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశాలున్నాయని, టాప్-5తోనే చివరి మూడు వారాలు షోను లాగిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది.

  English summary
  Bigg Boss Telugu Season 4 enters its 12th week and the nominations list for week 12 is out. Four contestants were nominated for elimination this week. in an early trends, here is how netizens comments on who is going to eliminate next weekend.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X