హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

bigg boss-5:అదిరిన హోస్ట్ నాగ్: బ్లాక్ డ్రెస్, గాగుల్స్, గన్‌తో.. ప్రొమోషూట్

|
Google Oneindia TeluguNews

బిగ్ బాస్-5 సీజన్ మరికొద్దీరోజుల్లో స్మార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి ప్రోమో షూట్ కూడా జరిగింది. వరసగా మూడోసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. కంటెస్టెంట్ల వివరాలు కూడా బయటకు వస్తోన్నాయి. ప్రోమో షూట్‌లో నాగార్జున లుక్ అదిరిపోయింది. మరోవైపు కంటెస్టెంట్లను నాగ్ మేనేజ్ చేస్తోన్న తీరు.. షో రేటింగ్ నేపథ్యంలో బిగ్ బాస్ హోస్ట్‌ను మార్చడం లేదు.

అదరగొట్టేశారు..

అదరగొట్టేశారు..

నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడుతో బుల్లితెర ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. తర్వాత బిగ్ బాస్ మూడు, నాలుగు సీజన్లతో అదరగొట్టేశారు. 'బిగ్ బాస్' ఫస్ట్ సీజన్ ఎప్టీఆన్, సెకండ్ సీజన్ నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. 3, 4 సీజన్ల తర్వాత ఇప్పుడు 5వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. వరుసగా మూడోసారి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చెయ్యబోతున్నారు. హాట్ సీట్‌లో కూర్చుని ప్రశ్నలడిగినా, హౌస్‌లో కంటెస్టెంట్లను కంట్రోల్ చేసినా.. అదీ నాగార్జునకే సొంత అనేలా చేస్తున్నారు.

హైప్..

హైప్..

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు ఆడియన్స్‌ని మరింత ఆసక్తిగా ఎంటర్‌టైన్ చెయ్యడానికి రెడీ అవుతోంది. వరుసగా నాలుగు సీజన్‌లతో టీవీ ప్రేక్షకులలో హైప్ క్రియేట్ చేస్తూ ఆకట్టుకుంటున్న బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 5 త్వరలో స్టార్ మాలో స్టార్ట్ కానుంది. 'బిగ్‌ బాస్' విజువల్ ఐడెంటిటీతోపాటు గేమ్‌లోని డిఫరెంట్ వేరియేషన్స్‌ను తెలియజేసేలా డిజైన్ చేసిన లోగో ఫస్ట్‌లుక్ వీడియో ఆకట్టుకుంటోంది. గతంలో కన్నా.. అభిమానుల ఇంప్రెస్ చేయనుందని నిర్వహకులు అంటున్నారు.

Recommended Video

Delta Variant Spreads From Nanjing to Beijing In China | Oneindia Telugu
సీక్రెట్..

సీక్రెట్..

కంటెస్టెంట్లకు సంబంధించిన వివరాలను మరింత సీక్రెట్‌గా ఉంచుతున్నారు. రీసెంట్‌గా నాగార్జున 'బిగ్ బాస్ 5' ప్రోమో షూట్‌లో పాల్గొన్నారు. అప్పుడు తీసిన పిక్స్ బయటకొచ్చాయి. సరికొత్త గెటప్‌లో 'కింగ్' లుక్ అదిరిపోయింది. బ్లాక్ డ్రెస్‌లో గాగుల్స్‌తో స్టైల్‌గా నడుస్తున్న పిక్, చేతిలో పెద్ద గన్ పట్టుకుని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

English summary
bigg boss-5 promo: king nagarjuna promo shoot is super. black dress, glasses, gun with nag. video viral in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X