• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu Elimination:ఈ వారం సర్ప్రైజ్ ఎలిమినేషన్.. ఎవరో తెలుసా..?

|

హైదరాబాద్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో ముగింపు దశకు చేరుకుంటోంది. ఇక ఇప్పటికే ఇంట్లో అన్ని ఎమోషన్స్‌ను ప్రేక్షకులు చూసేశారు. ఒకరితో అప్పటి వరకు చాలా ప్రేమతో వ్యవహరించే కంటెస్టెంట్లు మరు నిమిషానికే మారుతున్నారు. అప్పటి వరకు ఒకరితో ఎంతో స్నేహంగా మెలిగిన కంటెస్టెంట్లు నెక్ట్స్ మినిట్ వారిని శతృవులుగా చూస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా కంటెస్టెంట్ల గురించి బాగానే చర్చించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న ఈక్వేషన్స్‌తో బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో రంజుగా మారుతోంది. ఇక బిగ్‌బాస్ షో 10వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే అంతకంటే పెద్ద సస్పెన్స్ మరొకటుంది.

 ఈ వారం నో ఎలిమినేషన్

ఈ వారం నో ఎలిమినేషన్

బిగ్‌బాస్ షో 10వ వారం కంప్లీట్ చేసుకుంది. ఇక ఆనవాయితీగా ఎలిమినేషన్ జరగాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఎవరు ఈవారం ఎలిమినేట్ అవుతారనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ పై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం దీపావళి సందర్భంగా ఈ వారం ఎలిమినేషన్‌ ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే సాధారణంగా ఆదివారం రోజున ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి... పండగవేళ ఒకరిని ఎలిమినేట్ చేసి బాధను మిగల్చడం ఎందుకని బిగ్‌బాస్ షో నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 ఎలిమినేషన్ ఉంటే ఎవరు...?

ఎలిమినేషన్ ఉంటే ఎవరు...?

ఇక ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఈవారం మెహబూబ్ షో నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెహబూబ్‌తో పాటుగా మోనాల్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నప్పటికీ... ఆమె సేఫ్ అవుతారని చాలామంది భావిస్తున్నారు. ఇక ఈ మధ్యే అఖిల్ సీక్రెట్‌ గదిలోకి ఎంటర్ అయ్యాక మోనాల్ అభిజీత్‌కు దగ్గరైనట్లు కనిపిస్తోంది. కానీ దీపావళి సందర్భంగా ఈ సారి ఎలిమినేషన్ ఉండకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ఇదే జరిగితే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్‌కు హౌజ్‌లో గడిపేందుకు మరో వారం రోజులు దక్కినట్లే. అంటే ఈ సమయంలో ఆ కంటెస్టెంట్ బిగ్‌బాస్‌ను ఇంప్రెస్ చేసి మళ్లీ హౌజ్‌లో ఉండేందుకు మంచి అవకాశం అని చెప్పుకోవాలి.

  Bigg Boss Telugu 4 : Divi Vadthya Eliminated From Bigg Boss Show || Oneindia Telugu
   గెస్ట్ హోస్ట్‌గా నాగచైతన్య

  గెస్ట్ హోస్ట్‌గా నాగచైతన్య

  ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారిలో అభిజీత్, హారికా, సోహెయిల్, అరియానా, మెహబూబ్‌లు ఉన్నారు. అయితే వీరిలో మెహబూబ్, మోనాల్‌లకే ఇంటిని వీడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక దసరా రోజున అక్కినేని కోడలు సమంతా బిగ్‌బాస్ షోను హోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ దీపావళి రోజున గెస్ట్ హోస్ట్‌గా నాగచైతన్య వస్తారని తెలుస్తోంది. తన చిత్రం లవ్‌స్టోరీ ప్రమోషన్‌లో భాగంగా చైతూ షోను హోస్ట్ చేస్తారని సమాచారం. అయితే సమంతా కంటే చక్కగా క్యారీ చేస్తారా అనే అంశంపై నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం చిరంజీవికి కరోనావైరస్ పాజిటివ్ వచ్చిందనే వార్తలు వచ్చాయి. ఆ సమయంలో నాగార్జునతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలిశారు. దీంతో నాగార్జున క్వారంటైన్‌లోకి వెళ్లారనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో షూట్ మిస్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాగార్జున బదులు మరొక గెస్ట్ హోస్ట్ వస్తారని సమాచారం. వాస్తవానికి చిరంజీవికి కరోనా వైరస్ రాలేదని అది టెస్ట్ కిట్ల లోపంతో అలా వచ్చిందని మెగాస్టార్ క్లారిటీ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  English summary
  Bigg Boss Telugu, Bigg Boss telugu-4, Bigg Boss 10th week elimination, Bigg Boss elimination, Monal and Mehboob in race for elimination, Who is the title winner in Bigg Boss Telugu-4, Who are the top five contestants in Big Boss telugu, Bigg Boss Telugu title winner Abhijeeth, Lasya and Abhijeeth in finals,Akhil Ariyana, Avinash to get eliminated, elimination process, latest updates on Bigg Boss telugu-4,
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X