Bigg Boss 11th week Elimination:మోనాల్ సేఫ్.. ఈ వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు..?
హైదరాబాదు: బిగ్‌బాస్ తెలుగు -4 సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. హౌజ్‌లో ఈ వారంలో కంటెస్టెంట్ల సొంతవారు ఎంటర్ అవడంతో కాస్త భావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. ఇక 76 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ రియాలిటీ షో... గ్రాండ్ ఫినాలే వైపు దూసుకెళుతోంది. డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్ ఫినాలే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 8 మంది మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నారు. అయితే హౌజ్‌లో కంటెస్టెంట్లు కూడా చాలా స్ట్రాంగ్‌గా తయారవుతున్నారు.

చివరి మూడు స్థానాల్లో ఉన్నది వీరే...
బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షోలో ఎలిమినేషన్ వీక్ వచ్చేసింది. 11వ వారంలో ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక ఈ సారి ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారిలో అభిజీత్, అరియానా, మోనాల్, హారిక, సోహెయిల్, లాస్యలు ఉన్నారు. వీరిలో ఓటింగ్ పరంగా చూస్తూ చివరి మూడు స్థానాల్లో మోనాల్, లాస్య, అరియానాలు ఉన్నారు. ఇక మోనాల్ ఎలిమినేట్ అవుతుందా అంటే... అంత ఛాన్స్ లేదని నెటిజెన్లు చెబుతున్నారు. మోనాల్‌ను ఎలిమినేట్ చేసే ధైర్యం బిగ్‌బాస్ నిర్వాహకులు చేయరని సమాచారం.

అరియానా ఓవరాక్షన్.. లాస్య సేఫ్ గేమ్
ఇక హారికా కెప్టెన్సీ రేసుకు మోనాల్ మద్దతుగా నిలవడంతో చాలామంది ప్రేక్షకులు ఈ ఉత్తరాది భామను అభినందించారు. అంతేకాదు మోనాల్ ఆటను మరింత బలంగా ఆడాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులు కూడా మోనాల్‌కు బాగానే ఓట్లు వేసినట్లు సమాచారం. లాస్య అరియానాలు.. ఓటింగ్‌లో మోనాల్ తర్వాతే ఉన్నట్లు సమాచారం. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో అరియానా చేస్తున్న రచ్చతో ప్రేక్షకులు ఒక్కింత విసుగెత్తి పోయినట్లు తెలుస్తోంది. అరియానా ఇంట్లో గట్టిగా కేకలు పెట్టడం, ఓవరాక్షన్ చేయడం వంటివి చూసి ఇదేం తలనొప్పిరా నాయనా అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు పోస్టింగులు పెడుతున్నారు. ఇక లాస్య విషయానికొస్తే... ఈ రెడ్డి వారి అమ్మాయి తనకు ఇచ్చిన టాస్కును పూర్తిచేయలేక చేతులెత్తేస్తోందన్న అభిప్రాయం నెలకొంది. అంతేకాదు యాక్టివ్‌గా కూడా కనిపించడం లేదని అదే సమయంలో బిగ్‌బాస్ హౌజ్‌లో ఒక్క వంటగదికి మాత్రమే పరిమితమై సేఫ్ గేమ్ ఆడుతోందన్న అభిప్రాయం ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

మోనాల్‌కే నెటిజెన్ల ఓటు
ఈ క్రమంలోనే నెటిజెన్లు ఎలిమినేషన్ సందర్భంగా తమ వాదనలు సోషల్ మీడియా వేదికగా బిగ్‌బాస్‌కు విన్నవించారు. ఈ సారి అరియానా.. లాస్యలను ఎలిమినేట్ చేసి మోనాల్‌ను సేవ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు మోనాల్ ఈసారి గేమ్‌ను చాలా చక్కగా ఆడుతోందని కితాబిచ్చారు. ఇక త్వరలోనే నోయల్ సీన్ లేదా కుమార్ సాయి బిగ్‌బాస్ హౌజ్‌లోకి త్వరలోనే ఎంటర్ కానున్నట్లు సమాచారం. ఇక డేంజర్ జోన్‌లో లాస్య-అరియానాలు ఉన్నట్లు సమాచారం. ఇదే కనక నిజమైతే లాస్య అరియానాల్లో ఒకరు ఈవారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
మొత్తానికి మోనాల్ ఈ సారి కూడా బిగ్‌బాస్ హౌజ్‌లో సేఫ్ అవుతుందని సమాచారం. ఇప్పటికే కెప్టెన్ అఖిల్, అవినాష్‌లు ఎలిమినేషన్‌కు జరిగిన నామినేషన్‌లో లేరు. ఇక హారికా కూడా దాదాపుగా సేఫ్ అయినట్లే కనిపిస్తోంది. అంతేకాదు ఈ సారి కెప్టెన్సీ రేసులో ఉంది. సో... ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే కిగ్ నాగార్జున హోస్ట్ చేసే బిగ్‌బాస్ ఎపిసోడ్‌ను మిస్ కాకుండా చూడాల్సిందే మరి..!