• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Elimination:స్పెషల్ గెస్ట్‌గా కిచ్చా సుదీప్.. అతని జబర్దస్తీ ముగిసినట్టేనా..ఎలిమినేషన్‌లో ట్విస్ట్..!

|

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో మరో ఎలిమినేషన్ వీక్ వచ్చేసింది. ఈ సారి ఎవరి ఎలిమినేట్ అవుతారా అని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరగుతోంది. ఈ సారి అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండటంతో ప్రేక్షకులు ఎవరు ఎలిమినేట్ అవుతారనేదానిపై ఒక అంచనాకు రాలేకున్నారు. ఈ క్రమంలోనే ఓ తాజా అప్‌డేట్ బిగ్‌బాస్ నుంచి తెలిసింది. ఇంతకీ ఈవారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు..?

ఎలిమినేట్ అయ్యేది ఎవరు.?

ఎలిమినేట్ అయ్యేది ఎవరు.?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ముగింపు దశకు చేరుకుంటున్న క్రమంలో చాలా మలుపులు చోటుచేసుకుంటున్నాయి. అదే సమయంలో షో ఆసాంతం రక్తి కడుతోంది. వివిధ రకాల టాస్కులతో బిగ్‌బాస్ కంటెస్టెంట్లను పరీక్షిస్తున్నాడు. ఇక ప్రతి వారంలానే ఈ సారి కూడా ఎలిమినేషన్ వీక్ రానే వచ్చింది. అయితే అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉండగా ఎవరు ఎలిమినేట్ అవుతారా అని నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి ఎలిమినేట్ అవుతున్నారో ఓ లుక్కేద్దాం.

అవినాష్‌ జబర్దస్తీ ముగిసనట్టేనా..?

అవినాష్‌ జబర్దస్తీ ముగిసనట్టేనా..?

బిగ్‌బాస్ ఇంటిలో ఒకరు కొనసాగాలంటే ఇటు ప్రేక్షక దేవుళ్లతో పాటు అటు బిగ్‌బాస్ కటాక్షం కూడా ఉండాలి. ఈవారంలో ఎలిమినేషన్‌లో అవినాష్, మోనాల్, అఖిల్, అరియానాలు నామినేట్ అవగా.. వీరిలో మోనాల్ సేఫ్ అయ్యింది. ఇది షరామామూలుగానే జరిగే ప్రక్రియ.ఇక ఈసారి వాస్తవానికి మోనాల్‌కు 58.7శాతం ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వారంలో మిగితా ఒక్క జబర్దస్త్ అవినాష్ తప్ప మిగతా వారంతా సేఫ్ అయ్యారు. జబర్దస్త్ అవినాష్ వాస్తవానికి అందరినీ ఎంటర్‌టెయిన్ చేస్తూ ఓ రకమైన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అయినప్పటికీ తను ఇంటిని వీడటం ఖాయంగా కనిపించింది.

ఈ వారం నో ఎలిమినేషన్

ఈ వారం నో ఎలిమినేషన్

ఇక ఈ సారి ఎలిమినేషన్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నెటిజెన్లకు ఈ వార్త నిరాశ కలిగిస్తుండగా... అవినాష్ అభిమానులకు మాత్రం గుడ్ న్యూస్. ఈ వారంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండబోదని విశ్వసనీయవర్గాల సమాచారం. అంటే ఇంటిలో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్లు మరో వారం పాటు కొనసాగుతారని తెలుస్తోంది. వాస్తవానికి అవినాష్ ఎలిమినేట్ కావాల్సి ఉన్నప్పటికీ... అతనికి ఎవిక్షన్ పాస్‌తో ఈవారానికి అవినాష్ సేవ్ అయినట్లు సమాచారం.

  Is Punarnavi Bhupalam Engagement Ring For Sreemukhi Womaniya Show ?
  కిచ్చా సుదీప్ ప్రత్యేక అతిథి

  కిచ్చా సుదీప్ ప్రత్యేక అతిథి

  ఈ వారంలో మరో సర్ప్రైజ్ బిగ్‌‌బాస్ ప్రేక్షకులకు ఉంది. కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ ఈ వారం గెస్ట్‌గా బిగ్‌బాస్ షోకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తానే స్వయంగా ట్విటర్‌లో పోస్టు చేశారు కిచ్చా సుదీప్. కన్నడలో బిగ్‌బాస్ హోస్ట్ చేయడం ఎంతో ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చిన సుదీప్.. తెలుగు బిగ్‌బాస్ షోకు అతిథిగా వెళ్లడం అది కూడా నాగార్జున గారి పక్కన ఉండటం నిజంగా సంతోషాన్నిస్తోందంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు కంటెస్టెంట్లతో మాట్లాడటం కూడా చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.

  English summary
  As the Bigg Boss Telugu season -4 is coming to an end 7contestants are locked up in the house. As per the reports, there is no elimination this week end.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X