• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss:ఆ కంటెస్టెంట్‌పై అమల అక్కినేని ప్రశంసల వర్షం.. విజేత పై మరో లీకు..?

|

హైదరాబాదు: బిగ్‌బాస్ తెలుగు సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. కంటెస్టెంట్ల తల్లిదండ్రులను లేదా వారికి దగ్గరగా ఉన్న మనుషులను బిగ్‌బాస్ ఇంటిలోకి అనుమతిచ్చారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్లు వారి తల్లిదండ్రులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఇక గేమ్‌లో భాగంగానే తాము గొడవపడుతున్నాం తప్ప నిజంగా ఒకరిపై ఒకరికి ద్వేషం అంటూ ఏమీ లేదని ఇంటిలోకి వచ్చిన తల్లిదండ్రులతో కంటెస్టెంట్లు చెప్పడంతో వారి గేమ్ స్పిరిట్‌ను చూసి నెటిజెన్లు శభాష్ అంటున్నారు. ఇక టైటిల్ కోసం పోటీ పడుతున్న వారిలో ఎక్కువ ఛాన్సెస్ ఆ కంటెస్టెంట్‌కే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తాజాగా ఒక వార్త కూడా లీక్ అయ్యింది.

 అభిజీత్ పై ప్రశంసలు

అభిజీత్ పై ప్రశంసలు

బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో ముగింపు దశకు చేరుకుంటోంది. అయితే విజేతలు ఎవరు నిలుస్తారా అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ఎందుకంటే ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా కాకుండా.. షో నిర్వాహకులే ఎవరిని ఎలిమినేట్ చేయాలో డిసైడ్ చేస్తుండటంతో షోను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారిలో టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలోనే విజేత ఎవరై ఉంటారా అనేది జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సారి విజేత అభిజీత్ అయ్యే అవకాశాలున్నాయని కొన్ని గణాంకాల ద్వారా పలువురు చెబుతున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో వెండితెర హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అభిజీత్ తెలుగు ప్రజలకు పెద్దగా దగ్గరకాలేకపోయాడు. ఈ చిత్రంలో అమల అక్కినేని అభిజీత్ తల్లి పాత్ర పోషించింది.

 నాటి సందర్భాన్ని గుర్తు చేసుకున్న అమల

నాటి సందర్భాన్ని గుర్తు చేసుకున్న అమల

ఇక అభిజీత్ గురించి షో హోస్ట్ నాగార్జున అక్కినేని భార్య అమల మాట్లాడుతూ తన సపోర్టు అభిజీత్‌కే నంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అభిజీత్‌ను నిజంగానే తన సొంత బిడ్డలా భావిస్తానని అమల చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలో అభిజీత్ తనతోనే ఎక్కువ సమయం గడిపేవాడని అమల గుర్తుచేసుకున్నారు. అంతేకాదు పెద్దవాళ్లంటే అభిజీత్‌కు ఎంతో గౌరవం అని చెప్పారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం షూటింగ్ సమయంలో తన కన్నతల్లిని ఎలాగైతే చూసుకుంటాడో అలానే తనను కూడా చూసుకున్నాడని అమల చెప్పారు. అంతేకాదు అమలకు జంతువులంటే అమితమైన ప్రేమ అని అందరికీ తెలిసిందే. తనలానే అభిజీత్ కూడా జంతుప్రేమికుడని ఆ విషయమే ఇద్దరినీ మరింత కనెక్ట్ అయ్యేలా చేసిందన్నారు అమల. షూటింగ్ సమయాల్లో జంతువుల గురించి చాలా చర్చించుకున్నట్లు చెప్పారు.

 విజేత ఎవరో హింట్ ఇచ్చేశారా..

విజేత ఎవరో హింట్ ఇచ్చేశారా..

అభిజీత్ చాలా మెచ్యూర్ పర్సన్ అని కితాబు ఇచ్చిన అమల... సినిమా షూటింగ్ సమయంలో అభిజీత్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదివుతుండేవాడని చెప్పుకొచ్చారు. ఇక అమల అక్కినేని అభిజీత్ పై ప్రశంసల వర్షం కురిపించడంతో అభిజీత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంబురాలు చేసుకుంటున్నారు. దీంతో బిగ్‌బాస్ -4 విజేత ఎవరో చెప్పకనే తెలిసిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. అయితే అమల అక్కినేని సర్టిఫికేట్‌తో బిగ్‌బాస్ షో నిర్వాహకులు కన్విన్స్ అవుతారా లేక వారి మదిలో విజేతగా మరొకరున్నారా అన్నది తెలియాలంటే వచ్చే నెల వరకు వేచి చూడాల్సిందే..!

English summary
Amala Akkineni had all praises for the Bigg Boss telugu-4 contestant Abhijeet for his love for pets and shared their relationship during Life is Beautiful shoot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X