• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:గంగవ్వ రెమ్యునరేషన్ ఎంతో చెప్పేసింది... వారిపై ఘాటుగా...!

|

హైదరాబాదు: బిగ్‌బాస్... తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దూసుకుపోతున్న ఏకైక టెలివిజన్ రియాల్టీ షో. బిగ్‌బాస్ ప్రారంభంలో ఎవరూ అంత ఆసక్తి చూపని ఈ షో క్రమంగా జోరందుకుంది. షోలో కంటెస్టెంట్లు ఎమోషన్స్, ఫైటింగ్స్, ఫ్రెండ్షిప్, గెలవాలన్న కసి, మాటల యుద్ధాలతో రక్తి కడుతోంది. ఇప్పటి వరకు బిగ్‌బాస్ హౌజ్ నుంచి పది మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు.

ఇక షో కూడా ముగింపు దశకు వస్తోంది. ఇక బిగ్‌బాస్‌లో తొలిసారిగా 65 ఏళ్ల వృద్ధురాలు అయినటువంటి గంగవ్వను తీసుకొచ్చి నిర్వాహకులు ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. గంగవ్వ కూడా ఐదు వారాల పాటు బిగ్‌బాస్ హౌజ్‌లో కొనసాగింది. తాజాగా గంగవ్వ గురించి ఒక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.

అనారోగ్యంతో ఇంటి నుంచి బయటకు...

అనారోగ్యంతో ఇంటి నుంచి బయటకు...

గంగవ్వ... యూట్యూబ్ ఛానెల్ మై విలేజ్ షో‌తో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యింది. తెలంగాణలో ఓ మారుమూల గ్రామంకు చెందిన గంగవ్వ అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఇందుకు కారణం బిగ్‌బాస్. నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్‌బాస్ షోలో గంగవ్వను చాలా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేశారు. ఆమె అమాయకత్వం చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐతే గంగవ్వ అనారోగ్య కారణంగా బిగ్‌బాస్ ఇంటినుంచి వైదొలిగింది.

సీక్రెట్స్ రివీల్ చేసిన గంగవ్వ

సీక్రెట్స్ రివీల్ చేసిన గంగవ్వ

గంగవ్వ బిగ్‌బాస్ హౌజ్‌లోకి 65 ఏళ్ల వయస్సులో అడుగుపెట్టి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్ సీజన్లలో ఎప్పుడూ ఇలాంటి ఒక సీనియర్ సిటిజెన్‌ను చూడలేదు. అయితే ఓ ఇంటర్వ్యూలో గంగవ్వ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆడిషన్స్ తర్వాత షో నిర్వాహకులు కంటెస్టెంట్లు అందరినీ ఓ హోటల్ గదిలో క్వారంటైన్‌లో ఉంచినట్లు చెప్పుకొచ్చింది. తను కూడా 20 రోజుల పాటు అక్కడే గడిపినట్లు చెప్పిన గంగవ్వ... షో ప్రారంభం నాటికే కాస్త జబ్బు చేసినట్లుగా అనిపించిందని చెప్పింది. అప్పటికే కాస్త బలహీనంగా ఉన్నట్లు తనకు అనిపించిందని గంగవ్వ చెప్పుకొచ్చింది. సాధారణంగా తాను పల్లెటూరు నుంచి వచ్చినందున ఇక్కడి వాతావరణానికి అలవాటు పడలేకపోయినట్లు చెప్పుకొచ్చింది.

 అఖిల్ -మోనాల్ లవ్ స్టోరీ గురించి...

అఖిల్ -మోనాల్ లవ్ స్టోరీ గురించి...

ఇక అఖిల్-మోనాల్‌ గురించి చెప్పిన గంగవ్వ మోనాల్ చాలా తెలివైన పిల్లని చెప్పుకొచ్చింది. ఇక అఖిల్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన గంగవ్వ... మోనాల్ అంటే తనకు ఇష్టం లేదని కుండబద్దలు కొట్టింది. ఇంటిలోని సభ్యుల ఎమోషన్స్‌తో మోనాల్ ఆడుకుంటోందని చెప్పింది. అఖిల్-మోనాల్ మధ్య ఎలాంటి ప్రేమ లేదని పైకి కనిపించేదంతా ఒట్టిదేనని గంగవ్వ చెప్పడంతో చాలామంది నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసమే మోనాల్ అఖిల్‌లను ఇలా లవ్ ట్రాక్ నడుస్తోందనే అనుమానం వచ్చేలా షో నిర్వాహకులు ప్రవర్తించమన్నారనేది గంగవ్వ మాటలతో స్పష్టమవుతోందని చెబుతున్నారు.

  'Still The Boss'- Chris Gayle, The Only Cricketer To Score 1000 Sixes In T20 History | #UniverseBoss
  గంగవ్వ వారానికి రెమ్యునరేషన్ ఎంతంటే..?

  గంగవ్వ వారానికి రెమ్యునరేషన్ ఎంతంటే..?

  ఇక చివరిగా గంగవ్వ తన రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చింది. గంగవ్వకున్న పాపులారిటీని బట్టి షో నిర్వాహకులు కూడా ఆమెకు న్యాయం చేశారని సోషల్ మీడియాలో నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. గంగవ్వ వారానికి రూ. 2 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. అంటే ఆమె ఐదు వారాలు ఇంటిలో ఉన్నందుకు గాను షో నిర్వాహకులు ఆమెకు రూ.10 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అనారోగ్యం కారణంగా బయటకు వచ్చిన గంగవ్వకు ఇళ్లు కట్టిస్తామని హోస్ట్ నాగార్జున మాటిచ్చారు. అయితే నాగార్జున మాట తప్పరని తప్పకుండా ఇళ్లు కట్టిస్తారని గంగవ్వ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక గంగవ్వ తాజాగా అదే మా టీవీలో మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ సుజాతతో కలిసి హెల్త్ షో ఒకటి చేస్తోంది.

  English summary
  Bigg Boss Contestant Gangavva revealed her remuneration. Gangavva said that the Bigg boss show organisers had paid her Rs.2 lakhs per week.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X