• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu winner:విజేతపై లీకులు వచ్చేశాయి...ఆ లాజిక్ ప్రకారమే, భారీ ప్రైజ్ మనీతో..!

|

బిగ్‌బాస్ తెలుగు చివరి వారంకు చేరుకుంది. డిసెంబర్ 20వ తేదీన బిగ్‌బాస్ ఫైనల్స్ జరగనున్నాయి. ఆ రోజు విజేత ఎవరో అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. కానీ అంతకంటే ముందే బిగ్‌బాస్ విజేత ఎవరు నిలుస్తారో అనేదానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. ఇంతకీ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 విజేత ఎవరైఉంటారు..?

 బిగ్‌బాస్ విజేతపై జోరుగా చర్చ

బిగ్‌బాస్ విజేతపై జోరుగా చర్చ

నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ముగింపుదశకు వచ్చింది. షో ప్రారంభమైన మొదట్లో కంటెస్టెంట్ల పరంగా ప్రేక్షకులు షో చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత షో నిర్వాహకులు తమ ప్రణాళికను మార్చడంతో బిగ్‌బాస్ షో కాస్త ఆసక్తిని కలిగించింది. అనంతరం బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ల మధ్య ఎమోషన్స్, సందడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ వచ్చేసరికి బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు నాగార్జునపై కూడా విమర్శలు వచ్చాయి. ఇక ఇవన్నీ పక్కన బెడితే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 విజేతపై జోరుగా చర్చ జరుగుతోంది.

 చిన్న తప్పిదం చాలు...

చిన్న తప్పిదం చాలు...

ఈ సారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ విజేతగా అభిజీత్ పేరు తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం వస్తున్న లీకులు, ప్రచారం చూస్తే అభిజీత్‌ విన్నర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు అభిజీత్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ కూడా బాగా ఉంది. తన అభిమానులు సోషల్ మీడియాలో అలుపు లేకుండా ఓటింగ్ చేస్తున్నారు.అయితే ఇది బిగ్‌బాస్ హౌజ్ కనుక ఇక్కడ ఏమైనా జరిగే అవకాశాలున్నాయి. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ ఎలా అయితే ఎలిమినేట్ అయ్యారో అలానే బలమైన కంటెస్టెంట్ కాకకుండా మరొకరు కూడా విజేతగా నిలిచే అవకాశం ఉంది. ఇందుకోసం ఒక చిన్న తప్పిదం చేస్తే చాలు.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

అభిజీత్ బిగ్ బాస్ విన్నర్..?

అభిజీత్ బిగ్ బాస్ విన్నర్..?

ఇక బిగ్‌బాస్ సీజన్ 3లో అంతా శ్రీముఖి టైటిల్ ఎగురేసుకుపోతుందని భావించారు. కానీ అంచనాలు తప్పాయి. చివరి నిమిషంలో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విజేతగా నిలిచారు. ఈ సారి కూడా ఒక చిన్న పొరపాటు చాలు అభిజీత్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ టైటిల్‌కు దూరం కావడానికంటూ చర్చ జరగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తటస్థ ఓటర్లు కీలకం కానున్నారు. ఒక కంటెస్టెంట్ నుంచి మరో కంటెస్టెంట్‌కు వీరు ఓటు వేసే అవకాశం ఉంది. ఆయా కంటెస్టెంట్ ప్రదర్శన బట్టి ఈ న్యూట్రల్ ఓటర్లు అప్పటికప్పుడు నిర్ణయం మార్చుకుని మరొకరికి ఓటు వేసే అవకాశాలున్నాయి. ఇక ఎలాగూ తమ అభిమాన కంటెస్టెంట్‌కు ఓట్లు వేసే వారు ఉన్నారు. ఆ కంటెస్టెంట్ ఆటతీరు ఎలా ఉన్నా అతనికే లేదా ఆమెకే ఓటు వేస్తారు. ఆ థియరీ ప్రకారం అభిజీత్ ఇప్పటి వరకు 11 సార్లు నామినేట్ అయినప్పటికీ అతని అభిమానులు విపరీతంగా ఓట్లు వేయడంతో గ్రాండ్ ఫినాలే వరకు చేరుకున్నాడు.

విన్నర్‌ను డిసైడ్ చేసే లాజిక్

విన్నర్‌ను డిసైడ్ చేసే లాజిక్

సీజన్ 2లో కౌషల్, సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్‌లు కూడా 11 సార్లు నామినేట్ అయి కూడా టైటిల్ విజేతగా నిలిచారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందంటూ అభిజీత్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇదే లాజిక్ ప్రకారం బిగ్‌బాస్ షో నిర్వాహకులు వెళితే మాత్రం అభిజీత్ టైటిల్ ఎగురేసుకుపోవడం కచ్చితమని తెలుస్తోంది. ఒకవేళ అభిజీత్ టైటిల్ విజేతగా నిలిస్తే భారీగా డబ్బులు అందుతాయని ప్రచారం జరుగుతోంది. అభిజీత్‌కు వారానికి రూ.4 లక్షలు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ లెక్క ప్రకారం అభిజీత్ విజేతగా నిలవకుంటే అతనికి అందే డబ్బులు 60 లక్షలు. ఇక అదే విజేతగా నిలిస్తే మాత్రం మరో 50 లక్షలు ప్రైజ్ మనీ వస్తుంది కనుక మొత్తం మీద బిగ్‌బాస్ హౌజ్ నుంచి రూ.1.10 కోట్లతో అభిజీత్ తన ఇంటికి చేరుకుంటాడు.

మొత్తానికి ఇది బిగ్‌బాస్ హౌజ్ కనుక బండ్లు ఓడలు కావొచ్చు... ఓడలు బండ్లు కావొచ్చు అనే సంగతి మర్చిపోకూడదు. అంతా ఆశిస్తున్నట్లుగా అభిజీత్ టైటిల్ విన్నర్ కావొచ్చు లేదా మరొకరు ట్రోఫీని ఎగురేసుకుపోవచ్చు. ఎందుకంటే ఇది బిగ్‌బాస్... ఇక్కడ ఏమైనా జరగొచ్చు..

English summary
As the Bigg Boss Telugu season 4 is coming to an end, the news is making rounds on social media that Abhijeet would take away the title along with Huge bounty of Rs.1.10 Cr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X