Bigg Boss:టైటిల్ విన్నర్, రన్నర్ అప్, టాప్ ఫైవ్ కంటెస్టెంట్ వివరాలు లీక్..!
హైదరాబాదు: బిగ్‌బాస్ తెలుగు సీజన్ -4 రియాల్టీ షో ప్రారంభమైన కొత్తలో కాస్త మందకొడిగా సాగినప్పటికీ ఆ తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోవడం మొదలు పెట్టింది. ప్రేక్షకులను ఆకట్టుకుని టీఆర్పీ రేటింగ్లను పెంచుకునేందుకు హోస్ట్ నాగార్జునతో పాటు షో నిర్వాహకులు కూడా తెరవెనక చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు బిగ్‌బాస్ షో తెలుగు రాష్ట్రాల్లో ఓ రకంగా నడుస్తోందంటే ఇందుకు కారణం షోలో క్రమంగా మార్పులు చేయడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బిగ్‌బాస్ ఎపిసోడ్ విన్నర్ ఎవరో ఇదివరకే వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీకోసం...

బిగ్‌బాస్ టైటిల్ పై చర్చ
బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో గ్రాండ్‌గా రన్ అవుతోంది. ఆర్గనైజర్ల పుణ్యమాని షోలో పలు మార్పులు చేయడం, షోను రక్తి కట్టించాలని కంటెస్టెంట్లకు చెప్పడంతో ప్రేక్షకుల చూపు తిరిగి బిగ్‌బాస్ హౌజ్ వైపు పడింది. ఇప్పటికే 60 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో ఇక ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ టైటిల్‌ను ఎవరు ఎగురేసుకుపోతారా అన్న చర్చ సర్వత్రా ప్రారంభమైంది. అంతేకాదు రన్నర్ అప్‌గా ఎవరు నిలుస్తారు.. టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ఎవరు నిలుస్తారనే చర్చ సోషల్ మీడియాలో బాగానే జరుగుతోంది.

మోనాల్ కోసం ఇతరులు బలి
ఇక గత మూడు సీజన్లతో పోలిస్తే ఈ సారి అంటే నాల్గవ సీజన్లో మాత్రం కొన్ని భారీ మార్పులు కనిపించాయి. ముఖ్యంగా మోనాల్-అఖిల్-అభిజీత్‌లతో పాటుగా సోహెయిల్ను ఎక్కువ సమయం చూపించడం జరిగింది. గత ఎపిసోడ్లలో ఇలా ఒక్కరిని లేదా ఒక బృందాన్ని స్క్రీన్ పై ఎక్కువగా చూపించిన సందర్భాలు లేవు.అంతేకాదు మోనాల్, మెహబూబ్, అమ్మరాజశేఖర్లను సేవ్ చేసే క్రమంలో వారికి స్పెషల్ ఇమ్యూనిటీని కూడా బిగ్‌బాస్ ఇవ్వడం జరిగింది. మరోవైపు స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉన్న దేవీ నాగవల్లి, దివి, సాయి కుమార్‌లను మోనాల్ కోసం బలి చేయడం జరిగింది. ఈ అపవాదు కూడా బిగ్‌బాస్ మూటగట్టుకున్నారనే చెప్పాలి. ప్రేక్షకుల ఓట్లకు వ్యతిరేకంగా ఈ ఎలిమినేషన్ జరిగిందనే వార్తలు బోలెడు వచ్చాయి.దీంతో ఏవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ప్రేక్షకులు అంచనా వేయడం కష్టంగా మారింది.

అభిజీత్ - అఖిల్‌కు స్క్రీన్ స్పేస్
ఇక ఈ సారి టైటిల్ విన్నర్‌కు ఫేవరెట్‌గా ఎవరున్నారో ఒకసారి విశ్లేషిద్దాం. ఉత్తరాది భామ అయిన మోనాల్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి పెద్దగా మద్దతు లేదు కాబట్టి ఆమె టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం లేదు.ఇక అరియానా హౌజ్‌లో గొడవ ఎక్కువ పడుతుండటంతో ఆమె ప్రేక్షకుల మద్దతు కోల్పోయిందనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు అవినాష్ ఎంటర్టెయినర్గా నిలిచినప్పటికీ అభిజీత్ నోయల్ గొడవతో ప్రేక్షకులు అతని వైపు నుంచి పక్కకు వెళ్లారనేది ఓట్లను చూస్తే అర్థమవుతోంది. దీంతో టైటిల్ విజేత అభిజీత్ అవుతాడని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిజీత్-అఖిల్‌లకు ఎక్కువగా స్క్రీన్ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పరోక్షంగా వీరిలో ఒకరు విజేతగా నిలుస్తారనే హింట్ బిగ్‌బాస్ షో నిర్వాహకులు ఇచ్చినట్లయ్యింది.

టైటిల్ విజేత ఎవరంటే...
ఇక టాప్ ఫైవ్‌కు ఎవరు చేరతారనే దానిపై కూడో సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అభిజీత్, అఖిల్, అవినాష్, సోహెయిల్, లాస్య టాప్ ఫైవ్‌కు చేరుతారని తెలుస్తోంది. ఇక వీరిలో సోహెయిల్, ముక్కు అవినాష్, అఖిల్‌లు ఎలిమినేట్ అవుతారాని తెలుస్తోంది. వీరికి ప్రేక్షకుల నుంచి తక్కువ మద్దతు ఉండటంతో వీరిని తప్పించే అవకాశాలున్నాయని సమాచారం. ఆ తర్వాత లాస్య అభిజీత్‌ల మధ్య విజేత ఎవరో నిర్ణయించే ఛాన్స్ బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఇవ్వనున్నాడు. ఇక సోషల్ మీడియాతో పాటు తనకంటూ బయట ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్న అభిజీత్ టైటిల్ విన్నర్‌గా ఆవిర్భవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లాస్య రన్నరప్‌గా నిలిచే అవకాశం ఉంది.
పైన చెప్పినదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. కానీ షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వారికి కూడా ఇదే నిజం అనిపించేలా ఉంది. బిగ్‌బాస్ సీజన్-3లో కూడా అంతా శ్రీముఖి టైటిల్ విన్నర్‌గా నిలుస్తారని భావించినప్పటికీ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు.