• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu Breaking Update:జూనియర్ ఎన్టీఆర్ రీ-ఎంట్రీ..ఎప్పడో తెలుసా..?

|

హైదరాబాద్ : బిగ్‌బాస్ తెలుగు సీజన్ -4 వచ్చే నెల 20తో ముగుస్తుందన్న సమాచారం బయటకు వస్తోంది. అయితే ఇప్పటికే బిగ్‌బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్ల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది. గ్రాండ్ ఫైనల్స్‌లో నిలిచేందుకు ఎవరి ఆట వాళ్లు చాలా క్లెవర్‌గా ఆడుతున్నారు. అంతేకాదు బయటకు అంతా కలసి ఉన్నారన్న ఫీలింగ్ కలిగిస్తున్నప్పటికీ ఫైనల్స్‌లో మాత్రం విజేతగా నిలిచేందుకు అంతా కష్టపడుతున్నారు. ఇక గ్రాండ్ ఫినాలేకి ఎప్పుడూ ఒక ప్రత్యేక అతిథి వస్తుంటారు.. ఇప్పుడు ఆ గెస్ట్ ఎవరుంటారా అనేదానిపై లీకులు వస్తున్నాయి.

 లాస్య పై వంటలక్క ముద్ర

లాస్య పై వంటలక్క ముద్ర

బిగ్‌బాస్ తెలుగు-4... రియాల్టీ షో ముగింపు దశకు చేరుకుంటోంది. వచ్చేనెల 20తో ఎపిసోడ్ క్లోజ్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటి నుంచి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. తాజాగా ఇంటిలో వంటలక్కగా పాపులర్ అయిన లాస్య ఎగ్జిట్ అయ్యింది. లాస్య స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అంతా భావించినప్పటికీ కేవలం వంటగదికి మాత్రమే పరిమితి కావడంతో ప్రేక్షకులు ఆమెపై ముందు చూపినంత ఆదరణ ఓట్ల రూపంలో చూపలేకపోయారు. దీంతో ఆమె ఎలిమినేట్ కాక తప్పలేదు. ఇదంతా అటుంచితే ఈ సారి బిగ్‌ బాస్ గ్రాండ్ ఫినాలేకు చేరుతుండటంతో ముఖ్య అతిథి ఎవరై ఉంటారా అనే చర్చ జరుగుతున్న క్రమంలో ఓ టాలీవుడ్ టాప్ స్టార్ పేరు లీక్ అయ్యింది.

 చీఫ్ గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్

చీఫ్ గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్

బిగ్‌బాస్ తెలుగు -4లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో అభిజీత్, సోహైల్, అఖిల్, హారికా, అరియానాలు ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సారి గ్రాండ్ ఫినాలే చాలా ఘనంగా నిర్వహించాలని నాగార్జునతో పాటు షో నిర్వాహకులు కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఈసారి గ్రాండ్ ఫినాలే గురించి భవిష్యత్తులో కూడా మాట్లాడుకోవాలని అంత ప్రత్యేకంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే ఈ సారి గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలు తెలుగులో బిగ్‌బాస్ ప్రారంభమైన తొలి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. హోస్టింగ్‌లో అనుభవం లేనప్పటికీ కూడా చాలా చక్కగా సీజన్‌ను క్యారీ చేసి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

  Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ కంటెస్టెంట్!
   సీజన్ 3 చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్

  సీజన్ 3 చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్

  బిగ్‌బాస్ సీజన్ -3 గ్రాండ్ ఫినాలే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశారు. విజేతలను ప్రకటించారు. ఇక ఈ సారి జూనియర్ ఎన్టీఆర్ విజేతలను ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా వస్తారని ఇంకా నిర్వాహకులు అధికారికంగా ప్రకటించలేదు. యంగ్ టైగర్ స్టేజ్ మీదకు వస్తే అక్కడి వాతావరణం చాలా ఎలక్ట్రిఫయింగ్‌గా మారిపోతుందని సోషల్ మీడియాలో నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. బిగ్‌బాస్ సీజన్ -2 విజేతను ప్రకటించేందుకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా వచ్చారు.

  మొత్తానికి బిగ్‌బాస్ తెలుగు -4 సీజన్‌ ప్రారంభంలో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం, పైపెచ్చు ప్రత్యేక పరిస్థితుల్లో షోను నిర్వహించాల్సి రావడంతో షో సరిగ్గా రన్ కాలేదు. ఆ తర్వాత షో నిర్వాహకులు టీఆర్‌పీ రేటింగ్స్ కోసం ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. అంతేకాదు 11 వారం ఎలిమినేషన్‌కు 9 కోట్లు మేరా ఓట్లు వచ్చాయని నాగార్జున ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తూ ప్రేక్షకులు బిగ్‌బాస్‌ను బాగా ఫాలో అవుతున్నారన్న విషయం ఇట్టే అర్థమవుతోంది.

  English summary
  If reports are to be believed the chief guest for the Bigg Boss telugu-4 might be Jr.NTR. News is making rounds on social media that the game will conclude by December 20.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X