• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:కుమార్ సాయి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మోనాల్-అభిజీత్‌లకు అక్కడే చెడిందట..!

|

హైదరాబాద్ : బిగ్‌బాస్ హౌజ్‌ నుంచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ కుమార్ సాయి ఎగ్జిట్ ఇచ్చాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన కుమార్ సాయి మోనాల్-అభిజీత్‌ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇంతకీ కుమార్ సాయి చెప్పిన ఇంట్రెస్టింగ్ విశేషాలు ఏమిటి..? మోనాల్ స్థానంలో ఎలిమినేట్ అయిన కుమార్ సాయి చెప్పిన ఫ్యాక్ట్స్ ఏంటి..?

    Bigg Boss Telugu 4: Monal Akhil Hugs మోనాల్‌ను సేవ్ చెయ్యటం కోసం కుమార్ సాయిని ఎలిమినేట్ !!
     ఇంటి సభ్యుల గురించి...

    ఇంటి సభ్యుల గురించి...

    బిగ్‌బాస్ ఆరవ వారం ఎలిమినేషన్‌లో భాగంగా కుమార్ సాయి ఇంటి నుంచి ఎగ్జిట్ అయ్యాడు. కుమార్ సాయి ఎగ్జిట్ అవడంపై నెటిజెన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన కుమార్ సాయి పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఇంటి గురించి ఇంటి సభ్యుల గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలను షేర్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అభిజీత్ మోనాల్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కుమార్ సాయి వెల్లడించాడు.

     అగ్రెసివ్‌గా అభిజీత్

    అగ్రెసివ్‌గా అభిజీత్

    ఇంట్లో మోనాల్-అభిజీత్-అఖిల్ మధ్య జరుగుతున్న ట్రయాంగిల్ లవ్‌స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో అభిజీత్ మోనాల్‌తో మాట్లాడకుండా కాస్త అవాయిడ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే విషయమై కుమార్ సాయి మాట్లాడాడు. అభిజీత్ చాలా కూల్‌గా ఉంటాడని అయితే టాస్కుల విషయం దగ్గరకు వచ్చేసరికి చాలా అగ్రెసివ్‌గా మారిపోతుంటాడని కుమార్ సాయి చెప్పాడు. ప్రతిఒక్కరిని కంట్రోల్ చేస్తూ టీమ్‌ను నడిపించాలనుకుంటాడని కుమార్ సాయి వివరించాడు. ఇక మోనాల్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్లు ఫీల్ అవుతోంది కానీ ఆ అతి తెలివి మంచిది కాదని కుమార్ సాయి పరోక్షంగా చెప్పాడు.

     మోనాల్ చాలా తెలివిగా...

    మోనాల్ చాలా తెలివిగా...

    అఖిల్ లేని సమయంలో అభిజీత్ గురించి, అభిజీత్ లేని సమయంలో అఖిల్ గురించి మోనాల్ చెడుగా మాట్లాడుతుంటుందని కుమార్ సాయి చెప్పాడు. ఇక వీరిమధ్య ఉన్న లవ్ స్టోరీ ఏంటో ఇప్పటికీ తనకు అర్థం కాలేదని కుమార్ సాయి కుండ బద్దలు కొట్టాడు. వీరిద్దరినీ కన్ఫ్యూజ్‌ చేసి ఒక ఆట ఆడేసుకుంటోందని కుమార్ సాయి చెప్పాడు.ఇక ఈ విషయం తెలుసుకున్న అభిజీత్ మోనాల్‌ను విస్మరించడం మొదలు పెట్టాడని ఆమెతో మాట్లాడటం మానేశాడని వెల్లడించాడు. ఇది కేవలం బిగ్‌బాస్ మాత్రమే దీనికి ఎండ్ కార్డు వేయాలని నిర్మొహమాటంగా చెప్పేశాడు కుమార్ సాయి.

     కుమార్ సాయి ఎలిమినేషన్‌ పై భగ్గుమన్న నెటిజెన్లు

    కుమార్ సాయి ఎలిమినేషన్‌ పై భగ్గుమన్న నెటిజెన్లు

    ఇదిలా ఉంటే కుమార్ సాయి ఎలిమినేషన్ పై నెటిజెన్లు ఆగ్రహంతో ఉన్నారు. ఆ ప్రక్రియ సరిగ్గా జరగలేదని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రెండోవారంలో ఇంటిలోకి ప్రవేశించిన కుమార్ సాయి... మొత్తం మూడు వారాల పాటు హౌజ్‌లో ఉన్నాడు. ఆదిలో కొంత ఇబ్బంది పడినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్న కుమార్ సాయి గేమ్‌పై దృష్టి సారించడం ప్రారంభించాడు. అయితే కుమార్ సాయి ఎలిమినేషన్ చాలామంది ప్రేక్షకులు జీర్ణించుకోలేకున్నారు. మోనాల్‌ పట్ల బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎందకంత ఆసక్తి చూపుతున్నారనే ప్రశ్నలను సంధిస్తున్నారు ప్రేక్షకులు. ఇక బిగ్ బాస్ పై అలానే నాగార్జునపై కూడా నెటిజెన్లు ట్విటర్ వేదికగా కామెంట్స్‌తో దుమ్ము దులుపుతున్నారు.

    English summary
    The sixth week eliminator from the bigg boss house Kumar sai had made some interesting comments on Monal and Abhijeet.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X