Bigg Boss Telugu:పోలీసులకు మోనాల్ ఫిర్యాదు.. గ్రాండ్ ఫినాలే ముందు రచ్చ..ఆ కంటెస్టెంట్ పై..!
హైదరాబాద్ : బిగ్ బాస్ తెలుగు -4 సీజన్ ముగిసేందుకు మరికొన్ని రోజులు మాత్రమే ఉండగా అప్పుడే ఈ షో నుంచి తాజాగా బయటకు వచ్చిన మోనాల్ గజ్జర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే మోనాల్ పోలీస్ స్టేషన్లో ఎవరిపై ఫిర్యాదు చేసిందో తెలుసా..? అది తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
అభిజీత్ పై మోనాల్ సంచలన వ్యాఖ్యలు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 టైటిల్ విన్నర్ ఎవరో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఈ ఆదివారం రోజున టైటిల్ విన్నర్‌ను ప్రకటిస్తారు. ఇప్పటికే అభిజీత్ బిగ్‌బాస్ విజేతంటూ లీకులు రావడంతో పాటు సోషల్ మీడియాలో కూడా ఇదే వార్త ప్రచారంలో ఉంది. ఇక ఈ విషయం కాస్త పక్కనపెడితే తాజాగా షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ అభిజీత్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అభిజీత్ అభిమానులపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూ చేసింది కూడా ఎవరో కాదు.. అదే బిగ్‌బాస్ హౌజ్ కంటెస్టెంట్‌గా ఉన్న జోర్దార్ సుజాత.
సోదరిని చంపేస్తామంటూ...
ఇక అసలు విషయానికొస్తే... అభిజీత్ ఫ్యాన్స్, మరియు పీఆర్ టీమ్‌లు సోషల్ మీడియాపై తన సోదరి హేమాలిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మోనాల్ గజ్జర్ తెలిపింది. తాను లేని చోట అభిజీత్ తన గురించి చెడుగా మాట్లాడుతున్నాడని తన సోదరి హేమాలీ చెప్పిందని మోనాల్ వెల్లడించింది. అదే విషయాన్ని హౌజ్‌లోకి వచ్చినప్పుడు అభిజీత్‌కు కూడా చెప్పిందని మోనాల్ స్పష్టం చేసింది. మోనాల్ చాలా ముక్కుసూటి మనిషని కూడా అభిజీత్‌కు గుర్తుకు చేసిన విషయాన్ని వివరించింది. ఈ విషయం అభిజీత్‌కు చెప్పడంతో అది రుచించని అభిమానులు హేమాలీని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసినట్లు వెల్లడించింది. కొందరైతే చంపేస్తానంటూ కూడా బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మోనాల్ చెప్పుకొచ్చింది.
Recommended Video
మోనాల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ఇదిలా ఉంటే మోనాల్ ఇంటి నుంచి బయటకొచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఇక బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్‌కు అత్యధికంగా నామినేట్ అయిన వ్యక్తిగా మోనాల్ నిలిచినప్పటికీ... ఆమెను బిగ్‌బాస్ సేవ్ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు 14వ వారంలో మోనాల్ ఎలిమినేట్ కాక తప్పలేదు. అయితే మోనాల్ 14 వారాల పాటు హౌజ్‌లో ఉన్నందుకుగాను ఆమెకు నిర్వాహకులు భారాగానే డబ్బులు చెల్లించారనే వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం మోనాల్‌కు రూ.50 లక్షలు భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక గ్రాండ్ ఫినాలేకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండగా టైటిల్‌ను ఎవరు ఎగురేసుకుపోతారో అన్న అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.