• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu: మోనాల్‌ను సేవ్ చేస్తోంది అందుకేనా...ఆ ఓట్లు ఎక్కడినుంచి వస్తున్నాయ్...?

|

బిగ్ బాస్‌ షో తెలుగులో క్రమంగా ఆసక్తికరంగా మారుతోంది. షో ప్రారంభంలో హౌజ్‌లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్లు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవడంతో చాలా చప్పగా సాగింది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంటర్ అయిన జబర్దస్త్ అవినాష్, కుమార్ సాయిలతో షో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారింది. తర్వాత మళ్లీ షో చప్పగా సాగింది. మళ్లీ షోను రక్తి కట్టించేందుకు హౌజ్‌లో కాస్త గ్లామర్ డోస్ పెరిగినట్లు కనిపిస్తోంది. అరియానా, దేత్తడి హారికా, మోనాల్ గజ్జర్‌లు ఇంటిలో గ్లామర్‌ను పెంచుతున్నారు. ఇప్పుడు ఇదే విషయమై సోషల్ మీడియాలో బిగ్‌బాస్‌ను ఫాలో అవుతున్నవారు యమ జోరుగా చర్చించుకుంటున్నారు.

  Bigg Boss Telugu 4: Monal Gajjar Cried నేషనల్ చానెల్.. అందరూ చూస్తుంటారు అంటూ బోరును ఏడ్చిన మోనాల్‌!
   హౌజ్‌లో మోనాల్ గ్లామర్ డోస్

  హౌజ్‌లో మోనాల్ గ్లామర్ డోస్

  బిగ్‌బాస్ షోలో గ్లామర్ డోస్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్ ఔట్ ఫిట్స్ కుర్రకారుకు మత్తెకిస్తున్నాయి. దీంతో ఇప్పుడు బిగ్‌బాస్ షోను చూడనివారు కూడా శని ఆదివారాల్లో మాత్రం టీవీలకు అతుక్కుపోతున్నారు. బిగ్‌బాస్ హౌజ్‌లో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న లేడీస్ దివి, మోనాల్, దేత్తడి హారికా ,అరియానా. అంతకుముందు సుజాత హౌజ్‌లో ఉన్నప్పటికీ ఆమె గ్లామర్ వరల్డ్‌తో అంతగా పరిచయం లేనందున్న ఏదో పక్కింటి అమ్మాయిలా కనిపించిందని నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం దేత్తడి హారిక, అరియానాలు ధరించిన ఔట్‌ఫిట్ పై కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇక తాజాగా ఆదివారం జరిగిన ఎలిమినేషన్ ఎపిసోడ్‌లో మోనాల్ గజ్జర్ గ్లామర్ డోస్‌ను కాస్త పెంచిందని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు.

   బ్లూకలర్ ఔట్‌ఫిట్‌తో కిరాక్

  బ్లూకలర్ ఔట్‌ఫిట్‌తో కిరాక్

  మోనాల్ గజ్జర్ ధరించిన బ్లూ కలర్ డ్రెస్ మిగతా కంటెస్టెంట్ల డ్రెస్ కలర్స్‌ను డామినేట్ చేసిందని నెటిజెన్లు చెబుతున్నారు. ఇక మోనాల్ ఉత్తరాది భామ కనుక ఔట్‌ఫిట్స్ ధరించడంలో కాస్త ఓపెన్‌గానే ఉంటుందని ఆమెను చూసిన మరికొందరు నెటిజెన్లు చర్చించుకుంటు్న్నారు. ఇదిలా ఉంటే మోనాల్ అంటే నచ్చని వారు ఆమె ఏదో ఒకటి చేసి దృష్టిని తనవైపు మరల్చుకునేందుకు పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తోందని చెప్పుకుంటున్నారు. ఇక మోనాల్ డ్రెస్ విషయానికొస్తే ఆదివారం రోజున డీప్‌ నెక్ బ్లౌజ్ ధరించడంపై కొందరు కుర్రకారు సూపర్ అంటుంటే మరికొందరు మాత్రం... టూమచ్‌ ఎక్స్‌పోజింగ్ చేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

   గ్లామర్‌ కోసమే మోనాల్‌ను కొనసాగిస్తున్నారా

  గ్లామర్‌ కోసమే మోనాల్‌ను కొనసాగిస్తున్నారా

  ఇక మోనాల్ గజ్జర్ ప్రతి చిన్న విషయానికి కన్నీళ్లు పెట్టుకోవడం ఇటు ప్రేక్షకులకు నచ్చడం లేదనే చెప్పాలి. అయినప్పటికీ షోలో కొనసాగుతుండటం వెనక మతలబేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మోనాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ హౌజ్‌లో నడుపుతోందని ఇదే ప్రేక్షకులను కట్టిపడేస్తూ షోను రక్తి కట్టిస్తున్నందున ఆమెను నిర్వాహకులే సేవ్ చేస్తున్నారన్న ఆరోపణలు కొందరు నెటిజెన్లు చేశారు. ఇక మోనాల్ ఇంటిలోనుంచి ఎగ్జిట్ అయితే ఆ స్థాయిలో స్కిన్ షో చేసేవారు ఉండరు కాబట్టి ఎంతో కొంత గ్లామర్ పండిస్తుంది కనకే ఆమెను షోలో నిర్వాహకులు కొనాసాగిస్తున్నారని చెబుతున్న నెటిజెన్లూ ఉన్నారు.

  మొత్తానికి శనివారం ఆదివారం వస్తే చాలు.. కంటెస్టెంట్లంతా చాలా చక్కగా తయారై నాగార్జున కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అదే సమయంలో కుర్రకారు కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు.ఇందుకు కారణం బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండే ముద్దుగుమ్మలు ఓ రేంజ్‌లో రెడీ అయి కుర్రకారుకు మతిపోగుడుతున్నారు.

  English summary
  In the latest Sunday episode of Bigg Boss show, Monal Gajjar was seen with deep neck where the attention was caught.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X