• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:సోనూ సూద్‌కు - మోనాల్‌కు సంబంధం ఏంటి..? సోషల్ మీడియాలో మరో చర్చ!

|

హైదరాబాదు: ఆపదలో ఉన్నవారెవరైనా సరే సహాయం చేయండంటూ బాలీవుడ్ స్టార్ సోనూ సూద్‌ను అడిగితే చాలు.. సహాయం చేసేందుకు ముందు వరసలో ఉండే సోనూ సూద్ ఇప్పుడు బిగ్‌బాస్ హౌజ్‌లో మోనాల్‌కు కూడా సహాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. గుజరాత్‌కు చెందిన మోనాల్ గజ్జర్‌ను సోషల్ మీడియా వేదికగా కొంతమంది నెటిజెన్లు టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఈ సమయంలోనే మోనాల్ గజ్జర్‌ కోసం ముందుకొచ్చాడు సోనూసూద్. ఇంతకీ ఈ కథేంటో ఓ లుక్కేద్దాం...!

 లాక్‌డౌన్ సమయంలో లైమ్‌లైట్‌లో సోనూ సూద్

లాక్‌డౌన్ సమయంలో లైమ్‌లైట్‌లో సోనూ సూద్

సోనూ సూద్... కరోనా కారణంగా దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిన సమయంలో ట్రెండ్ అయిన పేరు. భారత సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుని అభిమానులను సంపాదించుకున్న సోనూ సూద్... లాక్‌డౌన్‌లో వలసదారులకు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేసి మరింత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సహాయం కావాలని ఎవరడిగినా లేదంటూ వారిని ఆదుకున్నాడు. ఇలా ఈ మధ్యకాలంలో సోనూ సూద్ పేరు వార్తల్లో ఎక్కువగా నిలబడింది. తను ముంబైకి కొత్తలో వచ్చినప్పుడు తానెదుర్కొన్న పరిస్థితులు గుర్తొచ్చి ఇతరులకు సహాయం చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక సోనూ సూద్‌ బిగ్‌బాస్‌ తెలుగుతో కనెక్ట్ అయ్యాడు. ఎలా కనెక్ట్ అయ్యాడో ఓ సారి చూద్దాం.

 సోషల్‌ మీడియాలో మోనాల్ పై ట్రోలింగ్స్

సోషల్‌ మీడియాలో మోనాల్ పై ట్రోలింగ్స్

బిగ్‌బాస్ తెలుగులో ఉత్తరాది భామ మోనాల్ కంటెస్టెంట్‌గా ఉంది. మోనాల్ ఇంటిని వీడితే షోకు ఉన్న అట్రాక్షన్ తగ్గిపోతుందంటూ నిర్వాహకులే ఆమెను ఎలిమినేట్ చేయడం లేదనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి. మోనాల్‌ అఖిల్ మధ్య నడిచే లవ్‌ట్రాక్‌తో షో రక్తికడుతోంది. ఇక సోషల్ మీడియాలో మోనాల్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తూ, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు కొందరు. ఇది కచ్చితంగా బిగ్‌బాస్ షో అయ్యాక కూడా తన కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మోనాల్ మోడల్ నుంచి హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో ఆమె లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఎదుర్కొంటోంది. క్రమంగా తెలుగు నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తోంది.

 మోనాల్‌కు అండగా ఉంటారా..

మోనాల్‌కు అండగా ఉంటారా..

ఇక మోనాల్ అభిమానులు ఈ సమయంలో ఆమెకు అండగా నిలుస్తున్నారు. పరభాష మాట్లాడినంత మాత్రాన ఆమెను టార్గెట్ చేయడం అన్యాయమని మోనాల్ అభిమానులు చెబుతున్నారు. అలాంటప్పుడు హారిక అభిజీత్‌లు తెలుగువారైనప్పటికీ బిగ్‌బాస్ హౌజ్‌లో ఎందుకు ఇంగ్లీషు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే మోనాల్ అభిమానులు సోనూ సూద్‌కు లేఖ రాశారు. ఈ సమయంలో ఆమెకు అండగా ఉండాలని సోనూసూద్‌ను కోరారు. అంతేకాదు ఆమె అఖిల్‌ను కానీ అభిజీత్‌ను కానీ ప్రేమించడం లేదని వారిద్దరు ఆమెకు మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని లేఖలోపేర్కొన్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమెపై మరో కథనాన్ని అల్లుతున్నారని సోనూసూద్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

 సోనూసూద్‌కు మోనాల్ ఫ్యాన్స్ లేఖ

సోనూసూద్‌కు మోనాల్ ఫ్యాన్స్ లేఖ

"సోనూసూద్ సర్, మోనాల్ గజ్జర్ మీకు తెలిసి ఉంటే గనక ఆమెకు అండగా నిలవండి. బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న ఆమెకు ఓట్లు వచ్చేందుకు కాదు.. సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న ట్రోలింగ్స్ నుంచి కాపాడండి. ఒక వర్గం ప్రజలు మోనాల్‌ గురించి ఉన్నవీ లేనివీ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ ఆమెను కించపరుస్తున్నారు. తెలుగు రాష్ట్రంకు సంబంధించినది కాదు కాబట్టే ఇదంతా చేస్తున్నారు. దయచేసి మోనాల్‌కు మద్దతు ఇవ్వండి" అంటూ మోనాల్ ఫ్యాన్స్ సోనూ సూద్‌కు లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సహాయం కావాలని కోరిన ప్రతిఒక్కరికీ స్పందించే సోనూసూద్... మోనాల్ విషయంలో రియాక్ట్ అవుతారో లేదో చూడాలి మరి.

English summary
Monal fans had written a letter to Sonusood asking him to support her as she was being trolled on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X