• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:అందుకే ఈ వారం నో ఎలిమినేషన్.. "జెస్సీ" ఏంమాయ చేస్తుందో?

|

హైదరాబాదు: తెలుగు బిగ్‌బాస్ షో క్రమంగా రక్తి కడుతోంది. ఇక ఈ షోకు హైలైట్‌గా నిలిచారు హోస్ట్ నాగార్జున. వీకెండ్స్‌లో నాగార్జున వస్తున్నారంటే చాలు ఈ మన్మధుడి కోసం చాలామంది ఎదురు చూస్తారు. అయితే ఈ వీకెండ్ మాత్రం నాగార్జున కనిపించకపోవచ్చని సమాచారం. అయితే నాగార్జున ప్లేస్‌ను ఎవరు రీప్లేస్ చేస్తారు... ఇప్పుడు ఇదే నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. అయితే ఈ వీకెండ్ మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ వ్యక్తి షోను హోస్ట్ చేస్తున్నట్లు సమాచారం.

  Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ కంటెస్టెంట్!

  ఈ వారం నాగార్జున ఉంటారా..?

  బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో..తెలుగులోనే అతిపెద్ద సక్సెస్‌తో దూసుకుపోతున్న ఏకైక రియాల్టీ షో. వారంలో ఐదు రోజులు ఒకలా ఉంటే... శనివారం ఆదివారం మాత్రం ఎపిసోడ్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఎందుకంటే ఈ రెండు రోజుల్లో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున తెరపైకొచ్చి ఇంటి సభ్యులను పలకరిస్తారు. అంతేకాదు వారంలో ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్కులు గురించి మాట్లాడటమే కాకుండా వారి ప్రదర్శనపై కూడా కాస్త చర్చిస్తారు. ఇక అన్నిటికంటే ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి... ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తారు. అందుకే వీకెండ్‌లో బిగ్‌బాస్ షో క్రేజ్ మరికాస్త పెరుగుతుంది. ఇక ఈ వీకెండ్ మాత్రం నాగార్జున షోలో కనిపించరనే వార్తలు వస్తున్నాయి.

   హోస్ట్‌గా రోజా పేరు

  హోస్ట్‌గా రోజా పేరు

  బిగ్‌బాస్ షో హోస్ట్ నాగార్జున ఈ వీకెండ్‌లో కనిపించరట. నాగార్జున తన చిత్రం వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలికి వెళ్లినట్లు సమాచారం. గత బిగ్‌బాస్ సీజన్‌లో కూడా నాగార్జున వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్లిన సమయంలో హోస్ట్‌గా రమ్యకృష్ణ వ్యవహరించారు. ఆమె హోస్ట్‌గా ఫుల్ మార్క్స్ కొట్టలేకపోయినప్పటికీ పర్వాలేదనిపించారు. ఇక ఈ వీకెండ్‌లో నాగార్జున స్థానంలో మరొకరు షోను హోస్ట్ చేస్తారని పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వీరిలో రోజా పేరు వినిపించింది. రోజా జబర్దస్త్‌తో పాటు పలు బుల్లితెర షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందున రోజా ఈ వారంతంలో కనిపిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అంతేకాదు రోజా వాయిస్ కూడా చాలా కమాండింగ్‌గా ఉంటుందని బిగ్‌బాస్ షో నిర్వాహకులు భావించారట. అయితే ఏ కారణం చేతనో తెలియదు కానీ... రోజా ప్లేస్‌లో మరో పేరు తాజాగా వినిపిస్తోంది.

   బిగ్‌బాస్ ఇంట్లో అక్కినేని కోడలు సమంతా

  బిగ్‌బాస్ ఇంట్లో అక్కినేని కోడలు సమంతా

  నాగార్జున షూటింగ్ నిమిత్తం మనాలీకి వెళ్లిపోవడంతో ఈ వారం ఆయన కోడలు సమంతా అక్కినేని షోను హోస్ట్ చేస్తారని తాజాగా ఫిల్మ్‌నగర్‌లో వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాదు ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయ్యిందనే న్యూస్ కూడా వినిపిస్తోంది. రోజా, సమంతా పేర్లు వినిపించడానికి ముందు నాగచైతన్య పేరు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తారనే వార్త చక్కర్లు కొట్టింది. ఇక ఫైనల్‌గా అక్కినేని సమంతా హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే బిగ్‌బాస్ ప్రేక్షకులను జెస్సీ ఎంత మాయ చేస్తుందో చూడాలి. షోను తన మామయ్య నాగార్జునలా క్యారీ చేయగలదా అనేది నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. ఒకవేళ సమంతా హోస్ట్‌గా సక్సెస్ అయితే భవిష్యత్తులో బిగ్‌బాస్ షోలను ఈ అక్కినేని కోడలితోనే చేయించే అవకాశం ఉంది.

   సమంత కాబట్టి మోనాల్ సేఫ్...?

  సమంత కాబట్టి మోనాల్ సేఫ్...?

  ఇక సమంతా కేవలం రెండు ఎపిసోడ్‌లకు మాత్రమే హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నందున... ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే డేంజర్ జోన్‌లో ఉన్న నోయల్ సీన్, మోనాల్ గజ్జర్‌లలో మోనాల్‌ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ డబులు ఎలిమినేషన్ ఉంటే మాత్రం అరియానా కూడా మోనాల్‌ను ఇంటి నుంచి ఎగ్జిట్ అయ్యేందుకు జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అఖిల్, అభిజీత్‌ అమ్మా రాజశేఖర్‌, అవినాష్‌లు సేఫ్ అయ్యారు. మొత్తానికి ఈ సారి సమంతా హోస్ట్‌గా కనిపిస్తే మోనాల్‌కు మరో వారం పాటు హౌజ్‌లో కొనసాగే ఛాన్స్ దక్కినట్లే.

  English summary
  Since the Bigg boss Host Nagarjuna is away for his upcoming film shoot, his daughter-in-law Samantha Akkineni may host this weekend show, if sources are to be believed.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X