హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bigg Boss Telugu:సమంతా అదరగొట్టింది.. నెటిజెన్లు ఫిదా.. హోస్ట్‌గా ఎప్పటి వరకు..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బిగ్‌బాస్ తెలుగు సీజన్ ఈ వీకెండ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రోగ్రామ్‌కు షూటింగ్ కారణంగా బ్రేక్ ఇవ్వడంతో ఆయన కోడలు సమంతా షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే సమంతా హోస్టింగ్‌ పై నెటిజెన్లు ఏమని చర్చించుకుంటున్నారు..? ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు...?

దసరా రోజున బిగ్‌బాస్ తెలుగు సీజన్ అట్రాక్టివ్‌గా మారింది. నాగార్జున ప్లేస్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన సమంతా అక్కినేని షోను చాలా చక్కగా క్యారీ చేశారనే అభిప్రాయంను నెటిజెన్లు వ్యక్తం చేశారు. గత సీజన్‌లో నాగార్జున వ్యక్తిగత ట్రిప్‌ పై విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన స్థానంలో హోస్ట్ చేసిన శివగామి రమ్యకృష్ణ కంటే సమంతా బాగా చేసిందని నెటిజెన్లు ఫుల్ మార్క్స్ వేసేశారు. సమంతా అక్కినేని బిగ్‌బాస్ షోను హోస్ట్ చేయడంపై మెజార్టీ నెటిజెన్లు అద్భుతంగా ఉందని కామెంట్ చేశారు.

ఇక గతంలో షోను హోస్ట్ చేసిన రమ్యకృష్ణ కంటే సమంతానే బాగా చేసిందని అభిప్రాయపడ్డారు. దీనిపై సోషల్ మీడియాలో పోలింగ్ నిర్వహించగా 74శాతం మంది సమంతా చాలా చక్కగా హోస్టింగ్ చేసిందని చెప్పారు. ఇక మూడు గంటల పాటు సాగిన దసరా స్పెషల్ బిగ్‌బాస్ షో... ముందుగా నాగార్జున తన కోడలు సమంతాను వీడియో ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు.ఇక సమంతాను వేదికపైన చూసిన కంటెస్టెంట్లు కూడా సర్ప్రైజ్ అయ్యారు.

Bigg Boss Telugu-4: Netizens Praise for Samantha, says she has done a better job than Ramya Krishna

ఇక షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సమంతా ముందుగా తెలుగు అంత చక్కగా మాట్లాడలేనని తనను క్షమించాల్సిందిగా కోరింది. ఆ తర్వాత కంటెస్టెంట్లపై ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది. ఇక అరియానా ఆడుతున్న గేమ్‌ను ప్రశంసించింది సమంతా. ఇక సమంతా తన స్మైల్‌తో అభిమానులను మెస్మరైజ్ చేసిందని నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. అంతేకాదు ఈ మెగా షోను చాలా కాన్ఫిడెంట్‌గా క్యారీ చేసిందని చెప్పుకొచ్చారు. మొత్తానికి సమంతా బిగ్‌బాస్ షోకు గెస్ట్ హోస్ట్‌గా వ్యవహరించి వందశాతం మార్కులు కొట్టేసింది.

English summary
Samantha was praised by netizens the way she carried the Bigg Boss show in absence of Nagarjuna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X