Bigg Boss Telugu:ఏంమాయ చేసిందో... టైటిల్ ఆమెకే ఫిక్స్..ఈ సారి మహిళా కోటా..!
హైదరాబాదు: బిగ్‌బాస్ తెలుగు సీజన్ క్రమంగా రక్తి కడుతోంది. షోను ఇంట్రెస్టింగ్‌గా మార్చేందుకు నిర్వాహకులు ఏ ఒక్క అవకాశాన్ని జారవడవడం లేదు. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి షో రన్ చేసేవరకు బిగ్‌బాస్ నిర్వాహకులపై ఏదో ఒక ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా వస్తూనే ఉన్నాయి. ఇక ఎలిమినేషన్ ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను కుండబద్దలు కొడుతున్నారు. ఇక బిగ్‌బాస్ విషయానికొస్తే విన్నర్ అప్పుడే డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పైకి మాత్రం షో చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ సారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరు..? ప్రేక్షకుల ఓట్లతో పనిలేకుండా విజేతను నిర్ణయించడం జరిగిందా..?

ఆది నుంచి షో పై ఆరోపణలే...
బిగ్ బాస్ షో ప్రారంభం అయినప్పటి నుంచి ఈ రియాల్టీ షోపై ఏదో ఒక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ముందుగా కంటెస్టెంట్ల ఎంపిక సరిగ్గా లేదని, ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియపై అనుమానాలున్నాయని ఇలా చాలా ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ సారి కంటెస్టెంట్లు చాలా మంది కొత్తవారే ఉండటం విశేషం. అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం లేని వారు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇక వీరిలో లాస్య తెలుగు ప్రజలకు సుపరిచితురాలే. ఇక లాస్య గురించి ఒకసారి మాట్లాడుకుంటే.. ఈ యాంకర్ తన రెండేళ్ల బాబును వీడి బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. ఇక బిగ్‌బాస్ షోలో పాల్గొన్నందుకు ఆమెకు మంచి రెమ్యునరేషనే ముట్టచెప్తున్నట్లు సమాచారం.

అభిజీత్- అఖిల్ ట్విస్ట్
బిగ్‌బాస్ హౌజ్‌లో అభిజీత్, హారికాతో మంచి సంబంధాలను నడుపుతోంది లాస్య. అదే సమయంలో వివాదాలకు చాలా దూరంగా కూడా ఉంటోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సారి బిగ్‌బాస్ విన్నర్ అంతా అనుకుంటున్నట్లుగా అభిజీత్ లేదా అఖిల్ కాదని సమాచారం. అభిజీత్‌కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ టాస్కులు ఇచ్చిన సమయంలో ఆరోగ్యం కారణాల రీత్యా సరిగ్గా పెర్ఫార్మ్ చేయడం లేదనే అంశం అందరికీ తెలిసిందే. ఇక అఖిల్ విషయానికొస్తే టాస్కులు బాగానే పూర్తి చేస్తున్నప్పటికీ... ఎక్కడో మోనాల్ విషయంలో తన రిలేషన్‌షిప్ జెన్యూన్‌గా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడప్పుడు సహనం కోల్పోయి సోహెయిల్, మెహబూబ్‌లపై కూడా నోరు జారుతున్న విషయాన్ని షో నిర్వాహకులు గమనిస్తున్నారని సమాచారం. దీంతో వీరిద్దరికీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండదనే సమాచారం.

లాస్య టైటిల్ ఎగురేసుకుపోతుందా..?
అయితే తాజా అప్‌డేట్ ప్రకారం షో నిర్వాహకులు మరొకరిని విజేతగా ప్రకటించాలని ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వ్యక్తే లాస్యా. అవును లాస్యా ఈ సారి బిగ్‌బాస్ ట్రోఫీ దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు మూడు సీజన్లు జరుగగా.... మూడింటిలో విజేతలుగా మగవారే నిలిచారు. ఈ సారి మహిళను విజేతగా ప్రకటించాలనే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తన రెండేళ్ల బాబును వదిలి షోలో పాల్గొనేందుకు వచ్చిన లాస్యను విజేతగా ప్రకటించాలన్న ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది కేవలం వస్తున్న వార్తలు మాత్రమే. పైన చెప్పిందంతా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్న విషయం మాత్రమే. ఇక నిజంగానే లాస్య బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 విజేత అవుతుందా లేదా అనేది మాత్రం గ్రాండ్ ఫినాలేలోనే చూడాలి.