• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:ఒక ఎపిసోడ్‌కు సమంతా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..మైండ్ బ్లాక్ అవుద్ది..!

|

బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో క్రమంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హోస్ట్ నాగార్జున ఈ షోకు ప్లస్ పాయింట్‌గా మారారు. బిగ్‌బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్లు కూడా తమ టాస్కులు తమ మాటలతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎలిమినేషన్ ప్రక్రియపై మాత్రం ప్రేక్షకులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇక నాగార్జున తన చిత్రం వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలీ వెళ్లడంతో ఆయన స్థానంలో గత వీకెండ్‌ను కోడలు సమంతా అక్కినేని హోస్ట్ చేశారు. అయితే సమంతా హోస్టింగ్‌కు ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకున్నారనేది చాలా ఆసక్తికరంగా మారింది.

సమంతా వర్సెస్ రమ్యకృష్ణ

సమంతా వర్సెస్ రమ్యకృష్ణ

బిగ్‌బాస్ తెలుగు గత వీకెండ్‌లో హోస్ట్‌గా వ్యవహరించింది అక్కినేని కోడలు సమంతా. ఈ షోను ఆమె బాగానే క్యారీ చేశారని కొందరు చెబుతుండగా మరికొందరు మాత్రం తెలుగుతో ఇబ్బంది పడ్డ సమంతా హోస్ట్‌గా వ్యవహరించడంపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఇదంతా సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. మరికొందరు గత సీజన్‌లో ఓ ఎపిసోడ్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన రమ్యకృష్ణ కంటే సమంతానే బాగా చేసిందని చెబుతుండగా.. మరికొందరు మాత్రం రమ్యకృష్ణకే ఓటువేశారు. మొత్తానికి మామ నాగార్జున ప్లేస్‌లో ఈ సారి సమంతా వచ్చి మామా టీవీ అంటూ అందరినీ సప్రైజ్ చేశారు.

సక్సెస్‌ఫుల్‌గా సమంతా కెరీర్

సక్సెస్‌ఫుల్‌గా సమంతా కెరీర్

ఇక సమంతా నాగచైతన్యతో కలిసి ఏం మాయ చేశావే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. జెస్సీ క్యారెక్టర్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరస సినిమాలతో దూసుకెళ్లింది. ఇటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి కూడా సక్సెస్ సాధించింది. కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా మలుచుకుంది. తాజాగా బుల్లితెరపై ఒక మెగా రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహరించి సత్తా చాటింది. అయితే బిగ్‌బాస్ షోకు సమంతా ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ప్రధాన చర్చగా సోషల్ మీడియాలో సాగుతోంది.

  Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, దివి లేకుండా బిగ్‌బాస్ చూడలేను అంటూ నెటిజన్లు!!
  దిమ్మదిరిగే పారితోషికం

  దిమ్మదిరిగే పారితోషికం

  సమంతా బిగ్‌బాస్ షోను హోస్ట్ చేసేందుకు మొత్తం ఎపిసోడ్‌లకు రూ.2.5 కోట్లు తీసుకుంటోందని విశ్వసనీయ సమాచారం. మామ నాగార్జున షూటింగ్‌లో బిజీ కావడంతో ఆయన స్థానంలో హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించిన ఈ అక్కినేని కోడలు భారీ పారితోషికమే తీసుకుంటోంది. ఇక ఈ వారం కూడా సమంతానే షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తారని సమాచారం. అయితే ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. మరోవైపు నాగార్జున ఈ మొత్తం సీజన్‌కు రూ.8 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయమై సోషల్ మీడియాలో నెటిజెన్లు పెద్ద చర్చే పెట్టారు. సమంతాకు ఆమాత్రం పారితోషికం ఇవ్వడం న్యాయమే అని కొందరు చెబుతుండగా... బిగ్‌బాస్ షోను అక్కినేని కుటుంబం కబ్జా చేసేసిందని మరికొందరు చర్చించుకుంటున్నారు.

  ఇక ప్రొఫెషనల్ కెరీర్ పరంగా చూస్తే సమంత చివరి చిత్రం జాను. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను బీట్ చేయలేకపోయింది. ఇక సమంతా ముందు కొన్ని కథలు వచ్చాయని వాటిని ఫైనలైజ్ చేయాల్సి ఉందని సమాచారం.

  English summary
  Samantha who hosted the Bigg Boss show in the absence of Nagarjuna had taken a whooping remuneration of Rs.2.5 Cr per weekend episode if sources are to be believed
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X