• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu-5: కంటెస్టెంట్ల పేర్లు లీక్...ప్రచారంలో ఆ సింగర్, ఆ టిక్‌టార్ స్టార్ పేర్లు

|

బిగ్‌బాస్ తెలుగు సీజన్ -4 ఎంతటి సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మొదట్లో సెలిబ్రిటీల ఎంపిక సరిగ్గా లేదనే విమర్శలు వచ్చినప్పటికీ ఆ తర్వాత క్రమంగా నాగార్జున షోను తన భుజాలపైకి వేసుకుని చక్కగా క్యారీ చేశారు. దీంతో బిగ్‌బాస్ సీజన్-4 సక్సెస్ రేట్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక బిగ్‌బాస్ సీజన్‌-4 గతేడాది నవంబర్‌లో ముగియగానే... అప్పుడే బిగ్‌బాస్ సీజన్-5 పై నిర్వాహకులు ఫోకస్ పెట్టారు. అప్పుడే సెలబ్రిటీల ఎంపికను కూడా చేస్తున్నట్లు ఫిలింనగర్‌ వర్గాల్లో వార్తలు జోరందుకున్నాయి. అయితే ఈ సారి ఓ ఇంట్రెస్టింగ్ సెలిబ్రిటీని బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రవేశింపజేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు..?

కంటెస్టెంట్‌గా షణ్ముఖ్ జస్వంత్

కంటెస్టెంట్‌గా షణ్ముఖ్ జస్వంత్

బిగ్‌బాస్ తెలుగు సీజన్-4, కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన ఈ రియాల్టీ షోకు యమ క్రేజ్ వచ్చేసింది. బిగ్‌బాస్ -4 విజేతగా అభిజీత్ నిలవగా అఖిల్ రన్నరప్‌గా నిలిచారు. అయితే వీరిద్దరికీ దక్కని నేమ్, ఫేమ్ పాపులారిటీ సెకండ్ రన్నరప్‌ సోహెయిల్‌కు దక్కింది. ఇక ఈ విషయం అటుంచితే.. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 5 పై ఫోకస్ పెట్టారు షో నిర్వాహకులు. ఇప్పటికే ఆ మెగా షో కోసం ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఇందుకోసం షణ్ముఖ్‌కు భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో షణ్ముఖ్‌ కూడా ఓకే చెప్పగా అతన్ని లాక్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన దీప్తి సునయినతో ఈ కుర్రాడు రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న సునీత పేరు

సోషల్ మీడియాలో వినిపిస్తున్న సునీత పేరు

ఇక బిగ్‌బాస్‌ సీజన్‌-5కు కంటెస్టెంట్‌గా మరో సెలిబ్రిటీ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన తియ్యటి స్వరంతో కొన్ని వందల పాటలు పాడి శ్రోతలను ఆకట్టుకున్న సింగర్ సునీత పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సునీత అంటే తెలియని వారుండరు. అంతేకాదు సునీతను బిగ్‌బాస్ షోకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఫిలింనగర్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే దీన్ని ఎవరూ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఒకవేళ బిగ్‌బాస్ హౌజ్‌లోకి సునీత అడుగుపెట్టేందుకు ఒప్పుకుంటే ఆమెకు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా షో నిర్వాహకులు వెనకాడటం లేదట.

 సునీత పాల్గొంటే విజేత ఆమె అని...

సునీత పాల్గొంటే విజేత ఆమె అని...

ఇక ఇటీవలే సునీత ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకుంది. ఈ కపుల్ ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా కనిపిస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న సునీతకు పలువురు సినీ ప్రముఖులు అభినందించారు కూడా. అయితే రామ్‌ను పెళ్లాడిన తర్వాత సునీతకు అన్నీ కలిసొస్తున్నాయని ఫిలింనగర్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజాగా సునీతకు బిగ్‌బాస్ ఆఫర్ లైన్‌లో ఉన్నప్పటికీ ఆమె ఒప్పుకుంటుందా లేదా అనే అనుమానం కూడా పలువురిలో ఉంది.

అయితే కొద్ది రోజుల క్రితమే సునీత పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె దాదాపుగా బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశాలు లేవని చాలామంది సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఒక వేళ సునీత ఓకే చెబితే... కచ్చితంగా షో విజేతగా నిలిచే ఛాన్సెస్ ఉన్నాయంటూ అప్పుడే డిబేట్‌లు మొదలెట్టేశారు ఆమె అభిమానులు.

దుర్గారావు పంట పండినట్లే

దుర్గారావు పంట పండినట్లే

ఇక బిగ్‌బాస్ సీజన్-5లో మరో ఇంట్రెస్టింగ్ వ్యక్తిని నిర్వాహకులు తీసుకొస్తున్నట్లు సమాచారం. టిక్‌టాక్, యూట్యూబ్‌లో తన డ్యాన్స్, తన యాక్టింగ్‌తో ఇరగదీసిన దుర్గారావును బిగ్‌బాస్ హౌజ్‌లోకి తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దుర్గారావు అంటే కూడా తెలియని తెలుగు ప్రజలు లేరు. అంతలా తన డ్యాన్స్‌తో అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బుల్లి తెరపై జరిగే ఈవెంట్స్‌లో సైతం అప్పుడప్పుడు కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దుర్గారావు దంపతులు. పలాస చిత్రంలోని నాదీ నక్కిలీసు గొలుసు పాటలో దుర్గారావు వేసిన స్టెప్పులు యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఫేమస్ అయ్యాయి. ఇక పలు రియాల్టీ షోలల్లో ఈ దంపతులు కనిపిస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఈ క్రమంలోనే దుర్గారావును కూడా బిగ్‌బాస్ సీజన్‌-5లో ఒక కంటెస్టెంట్‌గా పెట్టేందుకు షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మొత్తానికి సింగర్ సునీత దుర్గారావులు బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొనేందుకు ఓకే చెబితే ఇంకేముందు అభిమానులకు పండగే. అటు సునీత పాటలు ఇటు దుర్గారావు స్టెప్పులు, మరో వైపు షణ్ముఖ్ డ్యాన్స్‌లో షో హోరెత్తిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
News is making rounds that singer Sunitha would be one of the contestants in Bigg Boss Telugu season-5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X