• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:బిగ్‌బాస్ తర్వాత ఆ షోలోకి అవినాష్..ఆయనే ఈ డీల్ సెట్ చేశారా..?

|

హైదరాబాదు: బుల్లితెరపై లేదా వెండితెరపై కనిపించాలన్న తపనతో చాలామంది ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇలా ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూసేవారు హైదరాబాదులోని కృష్ణానగర్‌లో చాలామంది కనిపిస్తుంటారు. అంతెందుకు ఇప్పుడు జబర్దస్త్ షోలో టాప్ కమెడియన్స్ కూడా ఒకప్పుడు కృష్ణా నగర్‌లో ఉండి అవకాశం కోసం ప్రయత్నాలు చేసినవారే ఉన్నారు. ఇక ఈ ఈ కామెడీ ఆర్టిస్టులకు జబర్దస్త్ షో ఒక జీవితాన్నే ఇచ్చిందని చెప్పాలి. అందుకే ఈ వేదికను ఉపయోగించుకుని జీవితంలో సెటిల్ అయిన కమెడియన్స్ జబర్దస్త్ అన్నా మల్లెమాల అన్న ఎనలేని అభిమానం చూపుతారు అదే సమయంలో ఎప్పటికీ మర్చిపోలేరు. జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి సినిమాల్లో నటించే వరకు ఈ కమెడియన్స్ ఎదిగారు. అంతేకాదు పలు రియాల్టీ షోల్లో కూడా పాల్గొంటున్నారు. తాజాగా జబర్దస్త్ నుంచి బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ముక్కు అవినాష్. ఇప్పుడు ముక్కు అవినాష్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

 జబర్దస్త్‌ నిర్వాహకులకు డబ్బులు చెల్లించిన అవినాష్.?

జబర్దస్త్‌ నిర్వాహకులకు డబ్బులు చెల్లించిన అవినాష్.?

ముక్కు అవినాష్ జబర్దస్త్ షోతో వెలుగులోకి వచ్చాడు. తన కామెడీతో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. మల్లెమాల జబర్దస్త్ షో అవినాష్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో అవినాష్ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలులా వర్థిల్లింది. ఇక తాజాగా జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పిన అవినాష్... బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ రియాల్టీ షోలో కూడా తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకుల నుంచి అధిక స్థాయిలో ఓట్లు పొందుతున్నాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంటర్‌టెయిన్ చేస్తూ ఇటు టీవీ చూస్తున్న ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాడు. అయితే బిగ్‌బాస్ కార్యక్రమంలోకి వెళ్లేందుకు జబర్దస్త్ నిర్వాహకులకు అధిక మొత్తంలో అవినాష్ డబ్బులు చెల్లించారనే వార్త సోషల్ మీడియాను చుట్టేస్తోంది.

 అవినాష్‌కు స్వాగతం పలుకుతున్న ఆ ఛానెల్

అవినాష్‌కు స్వాగతం పలుకుతున్న ఆ ఛానెల్

ఇక బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పాలని చెప్పడంతో జబర్దస్త్‌ నుంచి తప్పుకోవాలని అవినాష్ డిసైడయ్యాడు. దీంతో అప్పటి వరకు మాస్ అవినాష్ కెవ్వు కార్తీక్‌గా ఉన్న పేరు ఇప్పుడు కెవ్వు కార్తీక్‌గా మారిపోయింది. బిగ్‌బాస్ షో తర్వాత అవినాష్ తిరిగి జబర్దస్త్‌ చేస్తాడా లేదా అని అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక జబర్దస్త్ షోకు పర్మినెంట్‌గా అవినాష్ గుడ్‌బై చెప్పేసినట్లే అని సమాచారం. అంతేకాదు ఒకవేళ అవినాష్ తిరిగి వస్తానన్న నిర్వాహకులు మాత్రం అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. బిగ్‌బాస్ వచ్చే నెలతో ముగుస్తుంది. ఆ తర్వాత అవినాష్ పరిస్థితేంటనే ప్రశ్న చాలామందిలో తలెత్తింది. అయితే అవినాష్ కోసం మరో ఛానెల్ తన తలపులు తెరిచి పెట్టింది.

 అదిరింది బొమ్మతో అవినాష్ రీఎంట్రీ

అదిరింది బొమ్మతో అవినాష్ రీఎంట్రీ

జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పేసి బిగ్‌బాస్‌ ప్రోగ్రాంలోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్.. బిగ్‌బాస్ అయిపోగానే జీ తెలుగు టీవీ ఛానెల్‌లో టెలికాస్ట్ అవుతున్న బొమ్మ అదిరింది షోలో ఎంట్రీ ఇస్తారని సమాచారం. ఈ వార్త ఇటు ఫిలింనగర్‌లో కూడా చక్కర్లు కొడుతోంది. బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వకముందే బొమ్మ అదిరింది యూనిట్‌తో డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రోగ్రాంలో జబర్దస్త్ నుంచి వెళ్లిన చమ్మక్ చంద్ర, ధన్‌రాజ్, వేణు వంటి కమెడియన్స్ ఉన్నారు. త్వరలోనే అవినాష్ కూడా ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక అదిరింది అనే టైటిల్‌తో నాగబాబు, నవదీప్‌లు జడ్జీలుగా ఉన్న సమయంలో ఈ ప్రోగ్రాంకు అంత క్రేజ్ రాలేదు. ప్రోగ్రాం ప్రారంభమైన మొదట్లో సమీరా యాంకరింగ్‌ను ప్రేక్షకులు చూడలేకపోయారు. ఆ తర్వాత రవి,భానులు షోను క్యారీ చేశారు. అప్పటికీ పూర్తి స్థాయిలో హిట్ కాలేదు. తాజాగా టైటిల్ పేరును మార్చి శ్రీముఖిని యాంకర్‌గా రంగంలోకి దింపడంతో షో రేటింగ్స్ అమాంతం పెరిగాయని సమాచారం. ఇక నాగబాబు కూడా జబర్దస్త్‌ను వీడుతూ పలువురు కమెడియన్లను అదిరింది షోకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ అదృష్టం అవినాష్‌ను వరించిందని కృష్ణానగర్ టాక్.

మొత్తానికి జబర్దస్త్ వీడి బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ఆ తర్వాత అదిరింది బొమ్మ షోలో ఏ మాత్రం కామెడీ పండిస్తాడో వేచి చూడాలి. అయితే అదిరింది బొమ్మ షోకు అవినాష్ సైన్ చేశాడని వస్తున్న వార్తలపై మాత్రం ప్రోగ్రాం యూనిట్ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.

English summary
Comedian Mukku Avinash who left Jabardast show for Bigg Boss is all set to make a comeback to Nagababu show Adhirindi if sources are to be believed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X