• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:వైల్డ్ కార్డ్ పై కుమార్ సాయి రీ-ఎంట్రీ...ఇక కుమ్ముడే...!

|

హైదరాబాదు: బిగ్‌బాస్ షోలో ఓ వైపు నిర్వాహకులకు మరోవైపు హోస్ట్‌ నాగార్జునకు ఫేవరెట్ కంటెస్టెంట్లు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే నాగార్జున మోనాల్‌కు చాలా ఫేవర్‌గా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి. అంతేకాదు ప్రతి సారి మోనాల్ ఎలిమినేట్ అయ్యే స్టేజ్ వరకు వచ్చి మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంటి నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులు ఎలిమినేషన్ ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నారు. ఇక బిగ్‌బాస్ షో‌కు సంబంధించి తాజా వార్త ఒకటి ప్రచారంలో ఉంది. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుసా..?

 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కుమార్ సాయి..?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కుమార్ సాయి..?

బిగ్‌బాస్ షో ముగిసేందుకు మరికొన్ని వారాలు మాత్రమే ఉన్నాయి. వచ్చే నెలలో ఈ షో ముగుస్తుంది. ఈ క్రమంలోనే టీఆర్‌పీ రేటింగ్స్ కోసం, అదే సమయంలో షోను రక్తి కట్టించేందుకు తెరవెనక చాలా ప్రయత్నాలు చేస్తున్నారు బిగ్‌బాస్ షో నిర్వాహకులు. ఇక మోనాల్‌ను సేవ్ చేసేందుకు ఇప్పటికే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా మరో వార్త లీక్ అయ్యింది. మోనాల్‌ను సేవ్ చేసేందుకు మరోసారి బిగ్‌బాస్ నిర్వాహకులు ఇప్పటికే ఎలిమినేట్ అయిన కుమార్ సాయిని తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంటిలోకి ప్రవేశింపజేసేందుకు ప్లాన్ చేసేశారట. కుమార్ సాయిని ఒప్పించారని సమాచారం. ప్రస్తుతం అతను క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సారి గెలిపించే బాధ్యత తీసుకుంటాం

ఇక ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో మోనాల్ చాలా బలహీనంగా కనిపిస్తోంది. దీంతో ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇది ప్రేక్షకుల ఓటింగ్‌ను లెక్కలోకి తీసుకుంటేనే జరుగుతుంది. ఒక వేళ నాగార్జున సొంత నిర్ణయం లేదా బిగ్‌బాస్ నిర్వాహకుల సొంత డెసిషన్ అయితే మోనాల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. ఈ క్రమంలోనే ఆమెను సేవ్ చేసేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కుమార్ సాయికి వెల్కమ్ చెప్పనున్నట్లు సమాచారం. ఇక కుమార్ సాయి తిరిగి బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెడుతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో పొక్కడంతో అతని అభిమానులు నాగార్జునకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. రెండవ ఛాన్స్ ఇచ్చిన కుమార్ సాయి కచ్చితంగా టైటిల్ విన్నర్ అవుతాడని ఈ సారి తనను కోల్పోకుండా మేము కాపాడుకుంటామంటూ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.

దేవీకి వచ్చిన ఛాన్స్ బట్....

దేవీకి వచ్చిన ఛాన్స్ బట్....

ఇదిలా ఉంటే మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌‌గా ఉండి ఇంటి నుంచి ఎగ్జిట్ అయిన దేవీ నాగవల్లిని తిరిగి రీఎంట్రీ ఇవ్వాల్సిందిగా కోరగా అందుకు ఆమె నిరాకరించారట. బిగ్‌బాస్ షో నిర్వాహకుల తీరు ఆమెకు నచ్చలేదని అందుకే రీఎంట్రీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫలానా వారిని గెలిపించాలని షో నిర్వాహకులు ముందుగానే ఫిక్స్ అయినప్పుడు మిగతా వాళ్లను ఎందుకు బలి చేయడమని దేవీ డైరెక్ట్‌గా అటాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆమెకున్న బిజీ షెడ్యూల్ కారణంగా కూడా ఆమె నో చెప్పి ఉంటుందని మరో వెర్షన్ వినిపిస్తోంది.

  'Still The Boss'- Chris Gayle, The Only Cricketer To Score 1000 Sixes In T20 History | #UniverseBoss
   మోనాల్ కోసం ఇంకెంతమంది బలి కావాలి..?

  మోనాల్ కోసం ఇంకెంతమంది బలి కావాలి..?

  ఇక దేవీ నాగవల్లి, కుమార్ సాయిల ఎలిమినేషన్ పై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. స్క్రిప్ట్ ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతోందని నెటిజెన్లు కామెంట్లు సైతం పెట్టారు. అంతేకాదు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయిన వీరిని కేవలం మోనాల్ కోసం ఎలిమినేట్ చేయడం సరికాదంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు నెటిజెన్లు. వాస్తవానికి దేవీ నాగవల్లి, కుమార్ సాయి చాలా చక్కగా గేమ్‌ను ఆడారు. అది ఓపెన్ సీక్రెట్. ప్రేక్షకులు కూడా వీరికి ఓట్లు బాగానే వేశారు. కానీ నిర్వాహకులు మాత్రం షోను రక్తి కట్టించేందుకు మోనాల్ తప్పని సరి అని ఫిక్స్ అయిన నేపథ్యంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బయటకు పంపారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

  మొత్తానికి మోనాల్ కోసం రెండో సారి కుమార్ సాయి బలవుతారని అందుకే అతన్ని తిరిగి ఇంటిలోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇప్పిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

  English summary
  Kuma Sai is making a reentry to the Bigg Boss house on wild card entry,if reports are to be believed.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X