• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:అవినాష్ ఇష్టం లేదు...భావోద్వేగానికి గురైన దివి, కుండ బద్దలు కొట్టేసింది..!

|

బిగ్‌బాస్ తెలుగు సీజన్ ఏడవవారంలో అందరికీ షాకిస్తూ దివి ఎలిమినేట్ అయ్యింది. అయితే దివి ఎలిమినేషన్‌పై సోషల్ మీడియాలో చాలామంది నెటిజెన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. షో ప్రారంభమయ్యాక రెండో వారం నుంచే ఎలిమినేషన్ ప్రక్రియపై సోషల్ మీడియాలో నెటిజెన్లు దుమ్మెత్తి పోశారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన దేవీ, దివిలను హౌజ్‌నుంచి ఎగ్జిట్ చేయించడం అదే క్రమంలో మోనాల్‌ను సేవ్ చేస్తుండటంపై ఆగ్రహంతో పాటు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంటి నుంచి ఎగ్జిట్ అయిన దివి పలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పింది.

 దివి గ్లామర్ షోకు ప్లస్

దివి గ్లామర్ షోకు ప్లస్

దివి వద్యా... అందంతోనే కాకుండా చక్కటి ప్రణాళికతో గేమ్ ఆడటం ఆమె స్పెషాలిటీ. కానీ పండగ వేళ దివి ఎలిమినేట్ కావడం ఆమె అభిమానులను కలచివేసింది. దివి ప్రతి టాస్కును చాలా అంకితభావంతో ఆడింది. ఇక ఇంట్లో ఉన్న గ్లామరస్‌ క్వీన్స్‌లో దివి ఒకరు. దివి టీవీలో కనిపించినప్పుడు కుర్రకారు కన్నార్పకుండా ఆమెనే చూస్తారన్నది ఫ్యాక్ట్. ఇక దివి టాస్క్‌ పెర్ఫార్మెన్స్‌ సమయంలో కూడా చాలా ఇంటెలిజెంట్‌గా ఆడిందని నెటిజెన్లు చెబుతున్నారు. అయితే అందరినీ ఆకట్టుకున్న దివి ఇంటినుంచి ఎలిమినేట్ అవుతుందని తాము ఊహించలేకపోయామని కచ్చితంగా మోనాల్ బయటకు వస్తుందనే అంతా భావించామని నెటిజెన్లు చెబుతున్నారు.

 అవినాష్ అంటే నచ్చదు

అవినాష్ అంటే నచ్చదు

ఇక విజయదశమి రోజున ఇంటి నుంచి ఎగ్జిట్ ఇచ్చిన దివి.. తన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముందుగా ఆమె అవినాష్ గురించి మాట్లాడింది. అవినాష్ అంటే తనకు నచ్చదని దివి కుండబద్దలు కొట్టింది. ఎప్పుడూ నిరుత్సాహపరుస్తుంటాడని పేర్కొంది. కామెడీ అనేది ఒకింత వరకు ఫర్వాలేదని అయితే అది శృతి మించకూడదనేది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది దివి. పేడ టాస్క్ సమయంలో తనను చాలా డిస్కరేజ్ చేశాడని చెప్పింది. గేమ్‌లో గెలవాలనుకోవడం తప్పు కాదు కానీ.. పక్కవారిని ఏదో మాయ చేసి గెలవాలనుకోవడం తప్పని దివి చెప్పుకొచ్చింది.

 అవినాష్ పై అప్పుడే ఒక ఒపీనియన్ ఏర్పడింది

అవినాష్ పై అప్పుడే ఒక ఒపీనియన్ ఏర్పడింది

అవినాష్ గురించి మాట్లాడిన దివి.. తాను కామెడీ చేసి సింపథీ గెయిన్ చేసుకుంటున్నాడన్న వాదనతో తాను అంగీకరించనని వెల్లడించింది. అయితే అవినాష్ మాత్రం తాను హౌజ్‌లోకి గేమ్ ఆడేందుకు మాత్రమే వచ్చినట్లు తాను స్పష్టంగా చెప్పినట్లు గుర్తుచేసుకుంది దివి. ఫ్రెండ్స్ వేరు గేమ్ వేరని రెండు ఒక్కటిగా చూడనని అవినాష్ చెప్పినట్లు దివి పేర్కొంది. అప్పుడే ఒక ఒపీనియన్ అవినాష్ పై ఏర్పడిందని దివి చెప్పింది. పేడ టాస్క్ సమయంలో అవినాష్ చాలా హర్టింగ్‌గా మాట్లాడినట్లు దివి చెప్పుకొచ్చింది. మరో టాస్కు సందర్భంగా అవినాష్ చాలా నిరుత్సాహపరిచినట్లు దివి చెప్పుకొచ్చింది. నువ్వు చేయలేవంటూ నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశాడని దివి వెల్లడించింది.

  Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, దివి లేకుండా బిగ్‌బాస్ చూడలేను అంటూ నెటిజన్లు!!
   భావోద్వేగానికి గురైన దివి

  భావోద్వేగానికి గురైన దివి

  ఏదైనా ప్రయత్నం చేసే సమయంలో పక్కవారు నువ్వు చేయలేవు అని చెప్పినప్పుడు నిజంగానే అది చేయలేమని అది ఏదైనా సరే... అంటూ దివి భావోద్వేగానికి గురైంది. అయితే ఏదైనా సాధించగలవని తన తండ్రి ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాడని అయితే హౌజ్‌లో మాత్రం అవినాష్ చాలా నెగిటివిటీ తనపై ప్లేచేసేవాడని అందుకే నచ్చలేదని ఈ ముద్దుగుమ్మ తేల్చేసింది. జీవితంలో ఎప్పుడూ నిరుత్సాహపడొద్దని చేయాలనుకున్నది చేసేయండంటూ తప్పకుండా సక్సెస్ అవుతారంటూ దివి చెప్పుకొచ్చింది.

  మొత్తానికి దివి వద్యా ఎలిమినేషన్‌తో షో కాస్త పడిపోయే అవకాశం ఉందని నెటిజెన్లు చెబుతున్నారు. అసలు బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ సరిగ్గా లేదని అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులు వేసే ఓట్లతో పనిలేకుండా సొంతంగా ఎలిమినేట్ చేయడంలో ఆంతర్యం ఏమిటని షో నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు నెటిజెన్లు.

  English summary
  Divi who was eliminated from the Bigg Boss house said that she was upset by the way Avinash was playing his game.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X