• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:అఖిల్ పై గంగవ్వ ముచ్చట్లు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

|

హైదరాబాదు: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు రోజురోజుకూ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. హౌజ్‌లో డ్రామా, ఎమోషన్స్, రొమాన్స్ అన్నీ ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి. ఇక మరో వారాంతం వచ్చేసింది. ఒకరు ఇంటినీ వీడే సమయం దగ్గరపడింది. ఈ క్రమంలోనే ఇంటిలోని సభ్యులంతా ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు తమ స్థాయికి మించి ప్రదర్శన ఇస్తున్నారు. ప్రతి టాస్కులో ప్రేక్షకుల మెప్పు పొందేందుకు కంటెస్టెంటులు తెగ ప్రయత్నిస్తున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

 అఖిల్ పై గంగవ్వ స్టోరీ

అఖిల్ పై గంగవ్వ స్టోరీ

బిగ్‌బాస్ 40 రోజులు పూర్తిచేసుకుంది. విజయవంతంగా ప్రోగ్రామ్ నడుస్తోంది. రోజుకో కొత్త కహానీ ఈ హౌజ్‌లో కనిపిస్తోంది. ఇక ప్రతి వారం ఎలిమినేషన్ అనేది జరుగుతోంది. గతవారం స్వచ్చందంగా షో నుంచి బయటకు గంగవ్వ వచ్చిన విషయం తెలసిందే. అనారోగ్యకారణంగా ఆమె బయటకొచ్చింది. ఇక షో నుంచి బయటకు వచ్చిన గంగవ్వ పలు ఛానెల్స్‌కు, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గంగవ్వ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను ఎంతగానో ఇష్టపడే తన మనవడంటూ చెప్పుకున్న అఖిల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకొచ్చింది గంగవ్వ.

 అఖిల్ నా మనవడు

అఖిల్ నా మనవడు

అఖిల్‌ను తన మనవడని గంగవ్వ చెప్పుకుంటుంది.ఒక ఇంట్లో సొంత అమ్మమ్మ లేదా నాణెమ్మలకు మనవళ్లు ఎలా అయితే సేవలు చేస్తారో అలానే అఖిల్ కూడా గంగవ్వకు కాళ్లు పట్టాడు. ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేదంటే చాలా బాగా చూసుకున్నాడు. షో ప్రారంభం నుంచే గంగవ్వపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపాడు అఖిల్. కట్ చేస్తే హౌజ్‌లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందనే విషయం తెలిసిందే. ఇది మోనాల్-అఖిల్-అభిజీత్‌ల మధ్య ఉందనే విషయంపై సోషల్ మీడియాలో కూడా నెటిజెన్లు తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే షో నుంచి ఎలిమినేట్ అయిన వారు కూడా మోనాల్ - అఖిల్ మధ్య ఏదో లవ్ స్టోరీ నడుస్తోందనే సంకేతాలు కూడా ఇచ్చారు. అంతేకాదు మోనాల్‌పైనే అఖిల్ ఫోకస్ చేయడంతో గేమ్‌పై సరిగ్గా దృష్టి సారించలేకపోతున్నాడని వీరు చిన్న హింట్ ఇచ్చారు. ఇంత జరుగుతున్నా అఖిల్ మాత్రం తనదారి తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు.

  Big Boss Fame Kathi Karthika Confident Of Winning Dubbaka Bypoll | Oneindia Telugu
   త్వరలోనే ఓ ఇంటివాడవుతాడు

  త్వరలోనే ఓ ఇంటివాడవుతాడు

  ఇక హౌజ్‌లో అఖిల్‌తో చాలా దగ్గరగా ఉన్న గంగవ్వ కూడా అఖిల్ లవ్ స్టోరీ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓ హీరోయిన్‌ను అఖిల్ నాలుగేళ్ల పాటు లవ్ చేశాడని అయితే కొన్ని కారణాలతో వారి ప్రేమకు బ్రేక్ పడిందని గంగవ్వ చెప్పుకొచ్చింది. అంతేకాదు బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉంటాడని గంగవ్వ చెప్పింది. అయితే అఖిల్‌తో గంగవ్వ హౌజ్‌లో చాలా సన్నిహితంగా మెలిగింది కాబట్టి ఆమె చెప్పిన విషయంపై నిజమే ఉండొచ్చని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. అంతేకాదు గంగవ్వ షోలో ఉన్నా.. బయట ఉన్నా ఒకేలా ఉండటం మాటతీరులో ఎలాంటి మార్పు లేనందున ఆమె చెప్పేది నిజమే అయి ఉంటుందని నెటిజెన్లు చెప్పుకుంటున్నారు.

  ఇక ఈ వారం నామినేషన్ల విషయానికొస్తే లాస్య, అభిజీత్, అఖిల్, మోనాల్, దివి, లాస్య, అరియానా, కుమార్ సాయి, నోయల్ సీన్‌లు ఉన్నారు. అయితే దివి, నోయల్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే వీరిద్దిరలో ఒకరు మాత్రం ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తున్నారు. అయితే ఈ హౌజ్‌లో ఏమైనా జరగొచ్చు.. ఎందుకంటే ఇది బిగ్‌బాస్ కాబట్టి.

  English summary
  Bigg Boss contestant Gangavva who was voluntarily eliminated from the show revealed Akhil's love story
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X