• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:కమల్, సల్మాన్‌ల కంటే నాగార్జున రెమ్యునరేషనే ఎక్కువ..ఎంతో తెలుసా..?

|

హైదరాబాదు: బిగ్‌బాస్ రియాల్టీ షో... ఏ భాషలో ఈ షో ప్రారంభమైనా అన్ని చోట్లా మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగులో సీజన్ -4 నడుస్తోంది. అయితే షో ప్రారంభమైన తొలివారాల్లో కంటెస్టెంట్ల ఎంపిక సరిగ్గా లేదని నెటిజెన్లు కామెంట్ చేశారు. కానీ షో కొనసాగే కొద్దీ ఆసక్తి కలిగింది. ఇందుకోసం బిగ్‌బాస్ తెలుగు షో నిర్వాహకులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఎన్నో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, మరెన్నో తెరవెనక లాబాయింగ్‌లతో కలిసి మొత్తానికి షోను రక్తి కట్టించారు. తాజాగా ఇంటర్నెట్ పై హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్‌కు సంబంధించి చాలామంది రికార్డు స్థాయిలో సెర్చ్ చేస్తున్నారు. వారికోసమే ఈ వార్త.

 రెమ్యూనరేషన్ విషయంలో పోటీ...

రెమ్యూనరేషన్ విషయంలో పోటీ...

బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో ఇప్పటికే 70 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఈ షో పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో హోస్ట్ నాగార్జునపై ఎన్నో ప్రశంసలు వచ్చాయి. మొన్నటి వరకు ఒక ఎపిసోడ్‌కు గెస్ట్ హోస్ట్‌గా వ్యవహరించిన సమంతా ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకున్నారనేదానిపై ఆసక్తి చూపని నెటిజెన్లు తాజాగా నాగార్జున ఎపిసోడ్‌కు ఎంత తీసుకుంటున్నారు అనేదానిపై తెగ గూగ్లింగ్ చేసేస్తున్నారు. నాగార్జున వయసు 60లో పడినప్పటికీ ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఏకంగా కొడుకు నాగచైతన్యతోనే రెమ్యునరేషన్ విషయంలో పోటీ పడుతున్నాడు. ఇక బిగ్‌బాస్ తెలుగు షోను చాలా చక్కగా హోస్ట్ చేస్తున్నారనే ప్రశంసలు నాగార్జున పొందాడు.

 గూగుల్‌లో రికార్డు స్థాయిలో సెర్చ్‌లు

గూగుల్‌లో రికార్డు స్థాయిలో సెర్చ్‌లు

ఒక కార్యక్రమంను హోస్ట్ చేయడంలో పెద్దగా అనుభవం లేని నాగార్జున గత బిగ్‌బాస్ కార్యక్రమాన్ని చాలా చక్కగా క్యారీ చేయడంతో ఈ సారి కూడా బిగ్‌బాస్ నిర్వాహకులు నాగార్జుననే హోస్ట్‌గా ఎంపిక చేసుకుని రెమ్యూనరేషన్‌ కూడా భారీగానే ఇచ్చినట్లు సమాచారం. హోస్ట్‌గా నాగార్జున ప్రేక్షకులను ఏదో మాయ చేస్తున్నాడన్న ఫీలింగ్‌లో నిర్వాహకులు ఉన్నారు. దీంతో నాగార్జున ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నెటిజెన్లు తెగ గూగ్లింగ్ చేసేస్తున్నారు. ఇక ఓవరాల్‌గా బిగ్‌బాస్ నిర్వాహకులకంటే నాగార్జుననే హోస్ట్‌గా ఎక్కువ లాభం పొందుతున్నాడని సమాచారం. ఎందుకంటే బిగ్‌బాస్ షో‌ నడిపేందుకు సెట్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేశారు. దీన్నుంచి నాగార్జునకు భారీగానే ముట్టజెబుతున్నారు షో నిర్వాహకులు. ఒక్క రూపాయి నాగార్జున పెట్టుబడి లేకుండా ఇందులో లాభాలను ఆర్జిస్తున్నాడు.

 ఆ ఇద్దరిని మించిన నాగార్జున

ఆ ఇద్దరిని మించిన నాగార్జున

ఇక బిగ్‌బాస్ షో నిర్వాహకులు నాగార్జున రెమ్యునరేషన్ నుంచి కంటెస్టెంట్లకు పారితోషికం, సెట్ కోసం భారీగానే ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతం నాగార్జున ఒక సింగిల్ ఎపిసోడ్‌కు రూ.16 లక్షలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకాస్త డెప్త్‌గా చెప్పాలంటే తమిళంలో టెలికాస్ట్ అవుతున్న బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్, హిందీ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా చేస్తున్న సల్మాన్‌ ఖాన్‌ల కంటే నాగార్జున రెమ్యునరేషన్‌ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ కింగ్ నాగార్జున ఎక్కడా తగ్గడం లేదని స్పష్టమవుతోంది.

 ఈ సారి నామినేషన్‌లో ఆరుగురు

ఈ సారి నామినేషన్‌లో ఆరుగురు

ఇక షో విషయానికొస్తే బిగ్‌బాస్ తెలుగు 11వ వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే 70 ఎపిసోడ్లు పూర్తికాగా షో ముగిసేందుకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక షోలో కొందరు మాత్రమే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు. ఇప్పటి వరకు 8 మంది కంటెస్టెంట్లు ఉండగా ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. వీరిలో మోనాల్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే మోనాల్ ఈ సారి ఎలిమినేట్ అవుతుందా లేక షరామామూలుగానే మరొకరిని బలిచేస్తారా అన్న విషయం తెలియాలంటే ఈ వారం వరకు వేచిచూడాల్సిందే..!

English summary
Nagarjuna's Remuneration is more than his counterparts salman and Kamal haasan in Bigg Boss show if reports are to be believed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X