India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bigg Boss Telugu: ముహూర్తం పెట్టేశారు: దుర్గారావు, మంగ్లీ సహా: కంటెస్టెంట్లు వీరే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. మరోసారి వీక్షకులను పలకరించబోతోంది. బుల్లితెర మీద సందడి చేయబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కోట్లాదిమంది వ్యూవర్స్‌ను గంటలపాటు కట్టి పడేయడానికి రెడీ అవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లోనూ సీజన్ 4 గ్రాండ్ సక్సెస్ కావడంతో.. అవే తరహా వాతావరణం ఉన్నప్పటికీ.. దాన్ని విజయవంతం చేయడానికి నిర్వాహకులు కసరత్తు పూర్తి చేస్తోన్నారు. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున.. తనదైన స్టైల్‌లో ప్రతి ఇంటినీ పలకరించనున్నారు.

Bigg Boss Telugu Season 5 : Contestants వీళ్ళే ! మీకు ఓకే నా ? || Oneindia Telugu
జులై రెండోవారంలో..

జులై రెండోవారంలో..


అన్నీ అనుకున్నట్లుగా సాగితే..జులై రెండోవారంలో బిగ్‌బాస్ సీజన్ 5.. మన కళ్ల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అనూహ్య అవాంతరాలు, అనుకోని పరిస్థితులు ఎదురైతే తప్ప వాయిదా పడటానికి ఏ మాత్రం అవకాశం లేదని తెలుస్తోంది. గత ఏడాది తరహాలోనే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం ప్రత్యేకంగా బయో సెక్యూర్ బబుల్‌ను ఏర్పాటు చేయబోతోన్నారు నిర్వాహకులు. బిగ్‌బాస్ హౌస్ మేట్స్ ఎంపిక పూర్తయిన తరువాత వారందరినీ ప్రత్యేకంగా బయోబబుల్‌లోకి పంపిస్తారు. అక్కడి నుంచి అటే వాళ్లంతా బిగ్‌బాస్‌లో అడుగు పెడతారు.

 కంటెస్టెంట్లు వీరే..

కంటెస్టెంట్లు వీరే..

ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పోటీ పడబోయే కంటెస్టెంట్ల పేర్లు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోన్నాయి. గాయని మంగ్లీ, యాంకర్ వర్షిణి, యూట్యూబర్ షణ్ముఖ జశ్వంత్, టీవీ సెలెబ్రిటీ దీపికా పిళ్ల, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, టాలీవుడ్ కమేడియన్ ప్రవీణ్, టీవీ9 న్యూస్ యాంకర్ ప్రత్యూష, యాంకర్ శివ, కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది కంటెస్టెంట్ల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో హైపర్ ఆది, శేఖర్ మాస్టర్ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల జాబితాలో ఉన్నారా? లేదా అనేది నిర్ధారణ కాలేదు. మిగిలిన వారందరినీ నిర్వాహకులు జూమ్ మీటింగ్ యాప్ ద్వారా ఇంటర్వ్యూ ప్రక్రియను కొనసాగిస్తోన్నట్లు సమాచారం. మరి కొందరి పేర్లు తెలియరావాల్సి ఉంది.

మంగ్లీ డౌటే..

మంగ్లీ డౌటే..

మంగ్లీ కూడా పాల్గొనడం అనుమానమేనని చెబుతున్నారు. టాలీవుడ్‌లో ఆమెకు వస్తోన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుంటే.. మంగ్లీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ లిస్ట్ నుంచి తప్పుకోవచ్చని భావిస్తున్నారు. ఈ సీజన్‌కు కూడా అక్కినేని అందగాడు నాగార్జునే యాంకర్‌గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. చివరి రెండు సీజన్లకు కూడా ఆయనే యాంకర్. తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో ఎపిసోడ్‌కు నేచురల్ స్టార్ నాని యాంకర్లుగా వ్యవహరించారు. మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున హవా ఆరంభమైంది. సీజన్ 3, సీజన్ 4కు ఆయనే యాంకర్. తాజాగా అయిదో సీజన్‌కు కూడా ఆయనే యాంకరింగ్ చేస్తారని అంటున్నారు.

ఈ సారి టైటిల్ ఎవరికి?

ఈ సారి టైటిల్ ఎవరికి?

చివరి రెండు సీజన్లతో పోల్చుకుంటే.. ఈ సారి ఆయన రెమ్మునరేషన్ కూడా భారీగా ఉండొచ్చనే అభిప్రాయాలు ఫిల్మ్‌నగర్‌లో వ్యక్తమౌతోన్నాయి. ఈ రియాలిటీ షో తొలి సీజన్ విన్నర్‌గా శివ బాలాజీ నిలిచాడు. రెండో సీజన్‌లో కౌశల్ మందా, సీజన్-3లో ప్లేబ్యాక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిళ్లను ఎగురేసుకెళ్లారు. టాలీవుడ్ నటుడు అభిజిత్ ఫోర్త్ సీజన్‌లో విజేతగా ఆవిర్భవించాడు. ఇక అయిదో సీజన్‌లో బిగ్ బాస్ టైటిల్ ఎవరి వశం అవుతుందనేది ఆసక్తి రేపుతోంది.

English summary
The much awaited reality show Bigg Boss Telugu Season 5 likely to start in July. The organizers are already talking to a set of people who are interested to take part in the show. The conversations are being carried out on Zoom calls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X