• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:అన్ని తప్పులు చేసినా హౌజ్‌లోనే అభిజీత్...తన ఓటింగ్ వెనకాల ఉన్నదెవరు..?

|

హైదరాబాద్ : నెల రోజుల క్రితం ప్రారంభమైన రియాలిటీ షో బిగ్‌ బాస్ తెలుగు మొదట్లో ఊహించినంత ఊపు లేనప్పటికీ క్రమంగా హౌజ్‌లో మార్పులు వస్తూ వచ్చాయి. ఇక కంటెస్టెంట్స్ కూడా కాస్త ఎక్కువగానే మింగిల్ అవుతుండటం, ప్రేమయాణాలు నడుపుతుండటంతో షో పై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి కలిగింది. ఆ తర్వాత ఎలిమినేషన్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారాయి. అయితే ఊహించని విధంగా ఎలిమినేషన్స్ జరుగుతుండటంతో చాలా మంది ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక హౌజ్‌లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టే టాస్కులు బిగ్‌బాస్ ఎలాగో ఇచ్చి షోను మరింత రక్తి కట్టిస్తున్నారు. ఇక బిగ్ బాస్‌లో ముందుగా ఓ కంటెస్టెంట్ గురించి చెప్పుకోవాలి. అతనే అభిజీత్. ఇంతకీ హౌజ్‌లో అభిజీత్ తీరు ఎలా ఉంది..? అతని ప్రవర్తన సరైనదేనా..?

 తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని అభిజీత్

తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని అభిజీత్

అభిజీత్... తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉందా అంటే చాలా తక్కువే అని చెప్పాలి. ఒకటి రెండు సినిమాల్లో నటించినప్పటికీ ఈ కుర్రాడికి మాత్రం రావాల్సిన క్రేజ్ రాలేదు. గత సీజన్లలో బిగ్‌బాస్‌కు ఎంపికైన యాంకర్ శ్రీముఖి లేదా నటి తేజస్వీ మడివాడలకున్న గుర్తింపు కూడా అభిజీత్‌కు లేదనే చెప్పాలి. ఇక వరుణ్ సందేశ్ కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టే నాటికి తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు ఆయనేంటో తెలుసు. కానీ అభిజీత్ పరిస్థితి అలా లేదు. బిగ్‌బాస్ షోలోకి అడుగు పెట్టక ముందు అభిజీత్ అంటే చాలా మందికి తెలియదు. ఇక షో ప్రారంభమైన తొలిరోజు నుంచే ఇంటి సభ్యులకు సవాళ్లు విసురుతూ కనిపించాడు. ఇక తానేదో గొప్ప అన్నట్లుగా స్వచ్చందంగా తనను తాను నామినేట్ చేసుకున్నాడు. అంతే కాదు తాను సూపర్ స్టార్ లెవెల్‌లో ఫీల్ అవుతూ వస్తున్నాడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది.

 అభిజీత్ కోసం వెలిసిన సోషల్ మీడియా గ్రూప్స్

అభిజీత్ కోసం వెలిసిన సోషల్ మీడియా గ్రూప్స్

ఇక అభిజీత్‌ కోసం సోషల్ మీడియాలో చాలా గ్రూప్స్ వెలిశాయి. ఒకప్పుడు కౌశల్ ఆర్మీ అని ఎలా అయితే సోషల్ మీడియాలో గ్రూపు హల్చల్ చేసిందో.. ఇప్పుడు కూడా అభిజీత్ విషయంలో అలాంటి గ్రూప్స్ యాక్టివ్‌గా ఉంటున్నాయి. ఇక అనధికారికంగా అభిజీత్‌కు ఓట్లు బాగా వస్తున్నాయంటే ఇది సోషల్ మీడియా పుణ్యమే అని చెప్పక తప్పదు. ఈ గ్రూపులన్నీ అభిజీత్‌ను ఓ హీరోలా ఫోకస్ చేస్తున్నాయి. ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఏర్పాటు అయిన గ్రూప్స్‌గా తెలుస్తోంది. హౌజ్‌లోని ఓ కంటెస్టెంట్‌తో అభిజీత్ కొంత ర్యాష్‌గా మాట్లాడిన విషయం తెలిసిందే. దమ్ముంటే నన్ను ఈడికెళ్లి పీకు అంటూ మరో కంటెస్ట్‌ను అనడం చూస్తే తనను ఎవరూ ఏమీ చేయలేరనే ఫీలింగ్‌తో అభిజీత్ ఉన్నాడంటూ చాలామందిలో చర్చ జరుగుతోంది. తనకు రావాల్సిన ఓట్లు తనకు వస్తాయనే భావనలో అభిజీత్ ఉన్నాడని మరికొందరు మాట్లాడుకుంటున్నారు.

 ఎక్కడా ఆకట్టుకోలేకపోయిన అభిజీత్

ఎక్కడా ఆకట్టుకోలేకపోయిన అభిజీత్

బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో భాగంగా దివిని కిడ్నాప్ చేసే విధానంలో తప్ప అభిజీత్ ఎక్కడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడన్న వార్త ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఇంటి సభ్యులతో చాలావరకు దూరంగానే ఉంటాడనే అపవాదును సైతం మూటగట్టుకున్న అభిజీత్... తన అహంను ఎక్కువగా ప్రదర్శించడం ప్రేక్షకులకు నచ్చడం లేదని తెలుస్తోంది. మాటికీ తోటి కంటెస్టెంట్స్ పై వేలెత్తి చూపడం, ఆగ్రహం వ్యక్తం చేయడం, వారి క్యారెక్టర్ గురించి మాట్లాడటాన్ని టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులకు నచ్చడం లేదట. బిగ్‌బాస్ పదేపదే తెలుగులో మాట్లాడాలని చెబుతున్నప్పటికీ అదేమీ పట్టనట్టుగా ఇంగ్లీషులోనే మాట్లాడటం అభిజీత్ చేస్తున్న మరో తప్పని షోను నిశితంగా ఫాలో అవుతున్న ప్రేక్షకులు చెబుతున్నారు.

 అంతలా ఓట్లు ఎలా సాధ్యం..

అంతలా ఓట్లు ఎలా సాధ్యం..

ఇన్ని తప్పులు పొరపాట్లను అభిజీత్ చేస్తున్నప్పటికీ తనకు 40శాతం కంటే ఎక్కువగా ఓట్లు వస్తుండటం, ఇతర కంటెస్టులకు బొటాబొటిన ఓట్లు వస్తుండటం షో నిర్వాహకులకే షాకింగ్‌గా ఉన్నట్లు సమాచారం. ఇక అసలు విషయానికొస్తే బిగ్‌బాస్ హౌజ్‌లో ఓటింగ్ పారదర్శకంగా ఉండదని సమాచారం. ఎందుకంటే హౌజ్‌లో ఉన్న కొందరు కంటెస్టెంట్లు తాము మరింత ఎక్కువ కాలం షోలో కొనసాగేలా చూసేందుకు కొందరు పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీస్‌ సహాయం తీసుకుంటారని సమాచారం. నామినేషన్‌లో ఉన్న ప్రతిసారీ బయట ఉన్న ఈ ఏజెన్సీలు కంటెస్టెంట్లకు ఓట్లు భారీగా పెరిగేలా తమవంతు కృషి చేస్తారని సమాచారం. ఈ క్రమంలోనే అభిజీత్ ఒక బలమైన ఏజెన్సీని నియమించుకుని ఉంటాడని సమాచారం. అయితే ఇదన్నా జరిగి ఉండాలి లేదా తనకు విపరీతమైన అభిమానులు,అభిమాన సంఘాలైనా ఉండి ఉండాలి. కానీ షోలోకి అడుగుపెట్టేవరకు అభిజీత్ అంటేనే ఎవరో తెలియదని కచ్చితంగా ఆయనకు వచ్చే ఓట్లు ఏదో ఏజెన్సీ సహకారంతోనే వస్తున్నాయనే వార్త ప్రచారంలో ఉంది.

మొత్తానికి ఇలాంటి మెగా రియాల్టీ షో జరుగుతున్న సమయంలో నిర్వాహకులు ఫేక్ ఓటింగ్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇలానే జరిగితే ఇక రియాలిటీ షో అనే పేరుకు అర్థం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నిర్వాహకులు భవిష్యత్తు సీజన్లలో కంటెస్టెంట్లు నియమించుకునే ఈ పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీస్‌ పై ఓ కన్నేసి ఉంచాలని బిగ్‌బాస్‌ షో ను అభిమానించే వారు కోరుతున్నారు.

English summary
Many who are following the Bigg Boss show are raising eyebrows on the contestant Abhijeet whose behaviour in the house is very arrogant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X