హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రయ్ రయ్‌మంటూ బైక్ రేసులు.. అర్ధరాత్రి న్యూసెన్స్.. పోలీసుల కొరడా..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అర్ధరాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తారు. మిడ్ నైట్ కాగానే రేసు బైకులతో రోడ్ల మీదకు వస్తారు. నానా హంగామా చేస్తారు. రయ్ రయ్‌మంటూ దూసుకెళుతూ ఇతరులకు ఇబ్బందులు తెచ్చి పెడతారు. ఆ బైకుల సౌండ్ వింటే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు భయందోళన చెందాల్సిందే. అంతలా శబ్ధ కాలుష్యానికి పాల్పడుతూ బైక్ రేసులతో బీభత్సం సృష్టిస్తున్నారు కొందరు యువకులు.

హైదరాబాద్ నగర రోడ్ల మీద అర్ధరాత్రి పూట బైక్ రేసులు కలకలం రేపుతున్నాయి. వీకెండ్లలో యువకులు రెచ్చిపోతున్నారు. బైకు రేసులతో నానా హంగామా చేస్తున్నారు. ఆ క్రమంలో శనివారం నాడు అర్ధరాత్రి బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో రేసర్ల గుట్టు రట్టైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ డ్రైవ్‌లో పలువురు రేసర్లు ఖాకీల చేతికి చిక్కారు.

bike racers caught at banjara hills hyderabad

చోరీల్లో నెంబర్ వన్.. దేనికి భయపడడు.. ఆ కుక్కను చూస్తే మాత్రం షేక్..!చోరీల్లో నెంబర్ వన్.. దేనికి భయపడడు.. ఆ కుక్కను చూస్తే మాత్రం షేక్..!

కేబీఆర్ పార్క్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు రయ్ రయ్‌మంటూ బైకుల మీద దూసుకెళుతున్న రేసర్లను పోలీసులు అడ్డగించారు. 27 వాహనాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక కారుతో పాటు 26 ద్విచక్ర వాహనాలున్నాయి. అయితే 15 కాస్ట్లీ స్పోర్ట్స్ బైక్స్ పట్టుబడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అదలావుంటే పోలీస్ అధికారులు బైక్ రేసింగ్‌ల్లో పాల్గొంటున్న యువకుల తల్లిదండ్రులను పిలిపించి వారి ముందరే కౌన్సిలింగ్ నిర్వహించారు. మరోసారి ఇలా బైక్ రేసింగులతో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి వదిలేశారు.

English summary
Bike Racers Caught At Banjara Hills Hyderabad On Saturday Mid Night. Police were given Councelling for them infront of their parents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X