హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిలేడీ లిస్ట్ పెద్దదే.. స్కూళ్లతోపాటు డెంటల్ క్లినిక్స్, స్పా కూడా... బండారం బయటపడిందిలా..

|
Google Oneindia TeluguNews

చిన్నారుల ఫోటోలు తీసుకొని న్యూడ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన లేడీ కిలేడీ బండారం బయటపడింది. ఫాతిమా నేహా అనే కిలేడీ.. స్కూళ్లే కాదు డెంటల్ క్లినిక్స్, సెలూన్లను కూడా వదలకుండా బెదిరించింది. ఈమె అరాచకాలపై స్కూల్ ప్రిన్సిపల్ ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. పిల్లల ఫోటోలే కాదు పేరెంట్స్ ఫోటోలు కూడా మార్పింగ్ చేసిందనే కఠోర నిజం పోలీసుల విచారణలో తేలింది. ఫాతిమా నేహాను మూడురోజుల కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు మెజిస్ట్రేట్‌ను కోరారు.

255 స్కూళ్లు, సెల్లూన్లు కూడా ..

255 స్కూళ్లు, సెల్లూన్లు కూడా ..

ఒకటి కాదు రెండు కాదు 255 స్కూళ్లు. ఆయా పాఠశాలలో చిన్నారుల ఫోటోలను తీసుకుంది. ఇంటర్నెట్‌లో లాగిన్ అయి ఫోటోలు తీసుకోవడం విశేషం. వారి ఫోటోలతో పాటు పేరెంట్స్ చిత్రాలు కూడా తీసింది. వారి ఫోటోలను కూడా ఫాతిమా మార్ఫింగ్ చేసిందనే నిజం బయటపడింది. డెంటల్ క్లినిక్స్ సంబంధించిన ఫోటోలు, రెండు స్పా సెలూన్లకు సంబంధించిన చిత్రాలను కూడా సేకరించింది. ఇలా అన్ని ఫోటోలు తీసుకున్నాక తన పనిని నేహా ఫాతిమా ప్రారంభించింది.

ఫోటోల్ అప్‌లోడ్ చేసి ఫోన్

ఫోటోల్ అప్‌లోడ్ చేసి ఫోన్

ఫోటోలు అప్‌లోడ్ చేసి ఆయా పాఠశాలకు కిలేడీ ఫాతిమా ఫోన్ చేసింది. ఫోటోలు చూసి స్కూల్ మేనేజ్‌మెంట్ షాక్ తింది. ఇంతలో ఆ స్కూల్‌కు ట్రింగ్ మని ఫోన్ మోగింది. తాను సైబర్ సెక్యూరిటీ నుంచి మాట్లాడుతున్నా అంటూ చెప్పింది. విద్యార్థినుల ఫోటోల విషయం అడిగి తెలివిగా వ్యవహరించింది. ఆమె గురించి తెలియక గుట్టుగా నమ్మారు. ఫోటోలు తీసేస్తానని చెపితే కొందరు నమ్మారు. కానీ తాజాగా 4 స్కూళ్లు, డెంటల్ క్లినిక్స్, స్పా సెలూన్లను ఫాతిమా బ్లాక్ మెయిల్ చేసింది.

బయట పడిందిలా

బయట పడిందిలా

ఫాతిమా మాటలపై స్కూల్ ప్రిన్సిపల్‌కు అనుమానం వచ్చింది. ఏం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు .. దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఫాతిమా నేహా బండారం బట్టబయలైపోయింది. విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఫాతిమాను 3 రోజలు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు మేజిస్ట్రేట్‌ను కోరారు.

ఇవే ఆ స్కూళ్లు..

ఇవే ఆ స్కూళ్లు..

ఫాతిమా బెదిరించిన స్కూళ్ల వివరాలు బయటకొచ్చాయి. వాటి వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. అందులో బబుల్స్ జీ, ఫెర్రీ ప్లే స్కూల్, లిటిల్ డాఫోర్జిల్, షార్ప్ కిడ్స్, పీపుల్స్ ప్లే లిటిల్ సోల్జర్స్, లిటిల్ జీనియస్, బ్లూ బాక్స్, రైసింగ్ స్కూల్, రైజింగ్ శాప్, ఫస్ట్ స్టెప్, సింగ్ వ్యాలీ, లిటిల్ పాదర్ స్కూళ్లు ఉన్నాయి. డెంటల్ క్లినిక్, లూయిస్ స్పాను కూడా ఫాతిమా నేహా బెదిరింపులకు గురిచేసింది.

English summary
bizarre incident in hyderabad. fatima neha take children photos website and upload porn sites. police arrested fatima neha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X