హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గురురూప రాక్షసుడు.. విద్యార్థిపై స్కేల్‌తో...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : గురువు కనిపించే దైవం. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. విద్యాబుద్దుల చెప్పే టీచర్లకు సమాజంలో ఉన్నత స్థానం ఉంది. వారికి సముచిత గౌరవం దక్కుతుంది కూడా. కానీ కొందరు ఉపాధ్యాయుల తమ వృత్తికి కళంకం తీసుకొస్తున్నారు. ఎప్పుడు ఎక్కడో చోట కీచక టీచర్ చర్యలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో కూడా ఓ టీచర్ తన స్థాయిని మరచిపోయారు. విద్యార్థి అని కూడా చూడకుండా విరుచుకుపడ్డారు.

వామ్మో జరిమానాల మోత.. ట్రాక్టర్ డ్రైవర్‌కు రూ.59 వేల ఫైన్.. ఎక్కడో తెలుసా..?వామ్మో జరిమానాల మోత.. ట్రాక్టర్ డ్రైవర్‌కు రూ.59 వేల ఫైన్.. ఎక్కడో తెలుసా..?

ఎందీ .. టీచర్ ..

ఎందీ .. టీచర్ ..

హైదరాబాద్ మీర్‌పేటలో ఓ స్కూల్ ఉంది. అందులో సుజాత అనే టీచర్ పనిచేస్తున్నారు. విద్యాబుద్దులు చెప్పే ఈమె బుద్ది గడ్డితిన్నది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది పోయి .. దాడులు చేసి .. భయాందోళనకు గురిచేస్తోంది. మూడో తరగతి చదువుతున్న సాయితేజ‌ను చితకబాదింది. అయినా ఆమె అహం చల్లారలేదో ఏమో .. ఏకంగా స్కేల్ తీసుకొని ప్రతాపం చూపించింది. అయితే అదీ ఇనుప స్కేల్ కావడంతో విద్యార్థికి తీవ్ర గాయమైంది. దీంతో బాలుడు విలవిలలాడిపోయాడు. బోరున ఏడ్చేశాడు.

విరిగిన వేలు ..

విరిగిన వేలు ..

ఐరన్ స్కేల్‌తో విద్యార్థి సాయితేజపై దాడిచేసింది టీచర్ సుజాత. దీంతో అతని ఎడమచేయి వేలు విరిగాయి. దీంతో అతను బాధ వర్ణణాతీతం. అమ్మా అంటూ ఇంటికి పరుగెత్తాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. అయితే విషయం తెలిసి .. పాఠశాల యాజమాన్యం మెల్లగా జారుకున్నారు. టీచర్, సిబ్బంది లేరు. అక్కడ కాసేపు నిరీక్షించిన రాలేదు. దీంతో మీర్‌పేట పోలీసు స్టేషన్‌లో కేసు గురించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

కఠినచర్యలు తీసుకొండి ..

కఠినచర్యలు తీసుకొండి ..

విద్యార్థిపై క్లాస్ టీచర్ స్కేల్‌తో దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె టీచర్ కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పాలి కానీ .. దాడులు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. టీచర్ సుజాతపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆమెపై తీసుకొనే చర్యలతో మరో టీచర్ .. విద్యార్థిని కొట్టాలంటే భయపడాలన్నారు. మరోవైపు టీచర్ సుజాత పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. స్కూల్ యాజమాన్యానికి ఇప్పటికే నోటీసులు జారీచేశామని పేర్కొన్నారు.

English summary
There is a school in Mirpet, Hyderabad. teacher name is Sujata. Go to the lessons for the students. The third grade student, sai teja, was beated. However, her ego is not cool. However, the student was seriously injured as it was an iron scale.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X