• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పేద ముస్లింలకు ఓవైసీ చుక్కలు - కేసీఆర్ భారీ దోపిడీ -ఇవిగో సాక్ష్యాలు -కేంద్ర మంత్రి సంచలనం

|

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోన్న బీజేపీ తాజాగా కేంద్ర మంత్రులను సైతం రంగంలోకి దించింది. కేసీఆర్ పాలనలో అవినీతి, అక్రమాలకు సాక్ష్యాలు ఇవేనంటూ ''6 ఏళ్లలో 60 వైఫల్యాలు'' పేరుతో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ చార్జిషీట్ ను రూపొందించింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం హైదరాబాద్ లో ఆ బుక్ లెట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్, హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీలపై సంచలన ఆరోపణలు చేశారు. జవదేకర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

భార్య సహా 17 మంది అమ్మాయిలను -ఆర్మీ మేజర్ ముసుగులో సంచలన క్రైమ్ - రూ.6కోట్లు స్వాహాభార్య సహా 17 మంది అమ్మాయిలను -ఆర్మీ మేజర్ ముసుగులో సంచలన క్రైమ్ - రూ.6కోట్లు స్వాహా

ఓవైసీ ఆస్పత్రిలో నో ఎంట్రీ..

ఓవైసీ ఆస్పత్రిలో నో ఎంట్రీ..

‘‘తెలంగాణలో రెండు కుటుంబాల పాలన నడుస్తోంది. ఒకటి సీఎం కేసీఆర్ కుటుంబమైతే, రెండోది అసదుద్దీన్ ఓవైసీ కుటుంబం. వీళ్లిద్దరూ కలిసి ఉమ్మడిగా రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు. తెలంగాణ ఏర్పడింది కుటుంబాల పాలన కోసం కాదు. అసదుద్దీన్ ఓవైసీ కుటుంబం నడుపుతోన్న ఆస్పత్రుల్లోకి పేద ముస్లిలను రానీయకుండా గోసపెడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలవడం ద్వారా మళ్లీ నిరంకుశ మేయర్ లా అవతరించాలని ఎంఐఎం తాపత్రయపడుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటేస్తే.. ఎంఐఎంకు ఓటేసినట్టే. అదే ఎంఐఎంకు నేరుగా ఓటేస్తే చీలికను సమర్థించినట్లే.

కేసీఆర్ దోపిడీ..

కేసీఆర్ దోపిడీ..

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకైన మంత్రి కేటీఆర్, ఇతర కుటుంబీకులతోపాటు వారి సన్నిహితులు, రాజకీయ మిత్రులైన ఎంఐఎం నేతలు భారీ ఎత్తున ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. గత ఆరేళ్లగా ప్రజలను దోచుకుతింటున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో అవినీతి బాగా పెరిగిపోయింది. కేసీఆర్‌‌ ఫ్యామిలీతోపాటు ఆయన సన్నిహితుల ఆస్తులు పెరుగుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర అప్పులు పెరుగుతూ వవచ్చాయి. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది..

కొవిడ్-19 వ్యాక్సిన్:మోడెర్నా ధర ఖరారు -ఒక్కో డోసు రూ.3వేల లోపే -భారీగా ఆర్డర్లుకొవిడ్-19 వ్యాక్సిన్:మోడెర్నా ధర ఖరారు -ఒక్కో డోసు రూ.3వేల లోపే -భారీగా ఆర్డర్లు

గ్రేటర్‌లోనూ దుబ్బాక ఫలితమే..

గ్రేటర్‌లోనూ దుబ్బాక ఫలితమే..

హైదరాబాద్‌‌ నగరాన్ని డల్లాస్, ఇస్తాంబుల్‌‌లాగా గ్లోబల్ సిటీ చేస్తామని టీఆర్ఎస్ నేతలు బీరాలు పోయారు. తీరా చూస్తే హైదరాబాద్ ను వరదల నగరంగా మార్చారు. సిటీలో డ్రైనేజీ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. లక్ష మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీకి దిక్కు లేకుండా పోయింది. లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కడతామని చెప్పి.. పట్టుమని వెయ్యి కూడా పూర్తి చేయలేదు. హైదరాబాద్ మేయర్ పీఠం మీద టీఆర్ఎస్ అనుబంధ ఎంఐఎం మేయర్ కూర్చోవాలా? లేదా బీజేపీ మేయర్ కావాలా? అనే ప్రశ్న మీదే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల నియోజకవర్గాల మధ్య ఉన్న దుబ్బాకలో బీజేపీ హవా చూపించింది. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితమే రిపీట్ కాబోతున్నది..

  GHMC Elections 2020 : అన్ని పార్టీల నజర్.. పాతబస్తీ, మజ్లిస్‌ను మట్టికరిపించడానికి బీజేపీ
  చిన్నమ్మ సుష్మను గుర్తు చేసుకోండి..

  చిన్నమ్మ సుష్మను గుర్తు చేసుకోండి..

  వరదల ప్రభావం నుంచి హైదరాబాద్ ఇంకా తేరుకోలేదు. ఒక్క వరదలే కాదు, ఏ సమస్య వచ్చినా ఫామ్ హౌజ్ కు పారిపోవడం కేసీఆర్ కు అలవాటు. కరోనా సమయంలో జనాన్ని గాలికొదిలేసి ఆయన ఫామ్ హౌజ్ కు వెళ్లిపోయారు. టీఆర్ఎస్-ఎంఐఎంల నిరంకుశ పాలనకు చెక్ పెట్టాలని హైదరాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుచేసుకోవాలి.

  తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ కృషి ఎవరూ కాదనలేనిది, తెలంగాణ ప్రజలు ‘చిన్నమ్మ'గా పిలుచుకునే సుష్మా స్వరాజ్ ప్రస్తుతం మన మధ్య లేకపోయినా.. రాష్ట్రం కోసం ఆమె చేసిన పోరాటం మర్చిపోలేము. కష్టపడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్-అసదుద్దీన్ ల పాలు చేయకుండా కాపాడుకోడానకే బీజేపీకి ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు'' అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. టీఆర్ఎస్ పై బీజేపీ చార్జి షీట్ విడుదల కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా కీలక నేతలు పాల్గొన్నారు.

  English summary
  Union Minister Prakash Javadekar alleged that TRS and AIMIM were indulging in lakh-crore corruption and challenged that BJP will strive for 'AIMIM-muft Hyderabad' at a press conference in Hyderabad. Prakash Javadekar on sunday also released a booklet called 'chargesheet' on the alleged failures of TRS and AIMIM led GHMC administrations.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X